అన్వేషించండి

Bhagavanth kesari Movie: షూటింగ్ స్పాట్‌లో నవ్వులే నవ్వులు - నెట్టింట్లో ‘భగవంత్ కేసరి’ ఫన్ వీడియో వైరల్

నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నందమూరి బాల‌కృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నచిత్రం ‘భగవంత్ కేసరి’. మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరికొద్ది గంటల్లో ఈ సినిమా థియేటర్లలోకి అడుగు పెట్టనున్న నేపథ్యంలో షూటింగ్ సమయంలో తీసిన ఫన్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

షూటింగ్ స్పాట్ లో నవ్వులే నవ్వులు

బాలయ్య షూటింగ్ స్పాట్ లో చాలా గాంభీర్యంగా ఉంటారని భావిస్తారు. కానీ, ఆయనతో కలిసి పని చేసిన చాలా మంది నటీనటులు బాలయ్య చాలా ఫన్నీగా ఉంటారని చెప్తుంటారు. తాజాగా ‘భగవంత్ కేసరి’ చిత్రబృందం విడుదల చేసిన వీడియో చూస్తుంటే అది నిజమేనని తెలుస్తోంది. నటీనటులతోనే కాదు, చిత్రబృందంతోనూ ఆయన చాలా సరదాగా గడుపుతూ కనిపించారు. దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ కాజల్ అగర్వాల్, మరో హీరోయిన్ శ్రీలీలతో కలిసి బాలయ్య చేసే ఫన్ అందరనీ నవ్వుల్లో ముంచెత్తుతోంది. బాలయ్య వారితో కలిసి చిన్న పిల్లాడిలా చేసే సరదా సరదా కామెడీ ఆకట్టుకుంటోంది. అందరూ కలిసి ‘భగవంత్ కేసరి’ సినిమా షూటింగ్ లో బాగా ఎంజాయ్ చేశారు అనిపిస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shine Screens (@shinescreenscinema)

‘భగవంత్ కేసరి’కి క్లీన్ యు/ఎ సర్టిఫికేట్  

ఇక ‘భగవంత్ కేసరి’ సినిమా హాస్యంతో కూడిన యాక్షన్ మూవీ అని దర్శకుడు ఈ వీడియోతో చెప్పే ప్రయత్నం చేసినట్లు అర్థం అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండానే క్లీన్ యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను164 నిమిషాలు(2 గంటల 44 నిమిషాలు)గా ఫిక్స్ అయ్యింది.

అమెరికాలో ‘భగవంత్ కేసరి’ గ్రాండ్ ప్రీమియర్స్

ఇక ఇవాళ(అక్టోబర్18న) అమెరికాలో ‘భగవంత్ కేసరి’ గ్రాండ్ ప్రీమియర్స్ వేయనున్నారు. ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో పాపులర్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్‌ హౌజ్‌ సరిగమ సినిమాస్ విడుదల చేస్తోంది. ఇప్పటికే చక్కటి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుపుకుంది ఈ చిత్రం. ఇక ‘భగవంత్ కేసరి’ చిత్రంలో కాజల్ అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది.  టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఎస్‌ థమన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే భగవంత్‌ కేసరి నుంచి విడుదల అయిన గణేష్  ఆంథెమ్‌, ఉయ్యాలో ఉయ్యాలా పాటలు ప్రేక్షకులను బాగా అలరించాయి. కనీవినీ ఎరుగని వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి.  మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Read Also: 'సర్వం శక్తిమయం' ట్రైలర్ రిలీజ్ చేసిన రవితేజ - అష్టాదశ శక్తిపీఠాల అద్భుత కథ ఇది!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Anant Nag : నటుడు అనంత్ నాగ్‌కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం - ప్రముఖులు, ఫ్యాన్స్ విషెష్
నటుడు అనంత్ నాగ్‌కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం - ప్రముఖులు, ఫ్యాన్స్ విషెష్
CM Vijay Son Jason Sanjay : మా నాన్న సీఎం... ప్రమోషన్స్‌కు రారు... వద్దు కూడా - విజయ్ కొడుకు జాసన్ రియాక్షన్
మా నాన్న సీఎం... ప్రమోషన్స్‌కు రారు... వద్దు కూడా - విజయ్ కొడుకు జాసన్ రియాక్షన్
Disco Shanti : ఆస్పత్రి బెడ్‌పై సెలైన్‌తో డిస్కో శాంతి - క్షేమంగా ఇంటికి చేరుకున్నా అంటూ...
ఆస్పత్రి బెడ్‌పై సెలైన్‌తో డిస్కో శాంతి - క్షేమంగా ఇంటికి చేరుకున్నా అంటూ...
Vijay Trisha : స్నేహానికి విలువ ఇవ్వాలి - త్రిష స్థానంలో ఉంటే అలా చేసేదాన్ని... నటి అంబిక రియాక్షన్
స్నేహానికి విలువ ఇవ్వాలి - త్రిష స్థానంలో ఉంటే అలా చేసేదాన్ని... నటి అంబిక రియాక్షన్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget