అన్వేషించండి

Bedurulanka 2012 Release Date : ఆగస్టులో 'బెదురులంక 2012' - ఫైనల్లీ, కొత్త రిలీజ్ డేట్‌తో వచ్చిన కార్తికేయ

కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన 'బెదురులంక 2012' సినిమా ఆగస్టులో విడుదల కానుంది. అదీ ఏ రోజున అంటే?

'ఆర్ఎక్స్ 100' కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'బెదురులంక 2012'. ఇందులో 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) కథానాయిక. ఈ చిత్రాన్ని లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో బెన్నీ ముప్పానేని (రవీంద్ర బెనర్జీ) నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... వచ్చే నెలలో సినిమాను విడుదల చేయనున్నారు. 

ఆగస్టులో థియేటర్లలోకి 'బెదురులంక'
Bedurulanka 2012 Release Date : వచ్చే నెల (ఆగస్టు)లో 'బెదురులంక 2012' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 25న  ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

కార్తికేయ ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసిన నేహా శెట్టి!
నిజం చెప్పాలంటే... 'బెదురులంక' ప్రచార కార్యక్రమాలు చాలా రోజుల క్రితమే మొదలు పెట్టారు. టీవీ షోలకు వెళ్లి మరీ కార్తికేయ, నేహా శెట్టి ప్రమోషన్స్ చేశారు. అయితే... అనుకోని కారణాల వలన విడుదల ఆలస్యమైంది. ఆ విషయానికి క్రియేటివిటీ జోడించి ప్రేక్షకులకు చెప్పారు కార్తికేయ. రిలీజ్ డేట్ చెప్పకపోతే ప్రమోషన్స్ చేయడానికి నేహా శెట్టి రానని చెబుతున్నారని, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని గురువారం విడుదల చేసిన ఓ వీడియోలో కార్తికేయ చెప్పారు. బహుశా... ఇప్పుడు ఆ సమస్య ఉండకపోవచ్చు. ఆగస్టు 25న విడుదల అని చెప్పారు కనుక నేహా శెట్టి ప్రమోషన్స్ చేయడానికి రావచ్చు.

Also Read : 'రుద్రంగి' రివ్యూ : 'బాహుబలి' రైటర్ దర్శకత్వంలో జగపతిబాబు నటించిన సినిమా ఎలా ఉందంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kartikeya (@actorkartikeya)

'బెదురులంక 2012' చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ 'వెన్నెల్లో ఆడపిల్ల...' సాంగ్ విడుదల చేశారు. ఆ గీతానికి కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం అందించారు. హారిక నారాయణ్, జెవి సుధాంశు ఆలపించారు. లెజెండరీ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు. 

రూరల్ డ్రామాల్లో బెంచ్ మార్క్!
ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే సినిమా 'బెదురులంక 2012' అని నిర్మాత బెన్నీ ముప్పానేని తెలిపారు. ఇప్పటి వరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు ఇది చాలా భిన్నంగా ఉంటుందని, గోదావరి బేస్డ్ రూరల్ డ్రామా అంటే 'బెదురులంక 2012' అనేలా బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని ఆయన చెప్పారు. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్ అని, ప్రేక్షకులని ఈ సినిమా కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళుతుందని ఆయన పేర్కొన్నారు. 

Also Read నాగశౌర్య 'రంగబలి' రివ్యూ : ఫస్టాఫ్‌లో సత్య కామెడీ హిట్, మరి సెకండాఫ్?

అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృథ్వీ, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, నృత్యాలు: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ: సి. యువరాజ్, నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన - దర్శకత్వం: క్లాక్స్.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Sunny Leone: బాలీవుడ్ నటి సన్నీలియోనికి నెలకు రూ.1000 - ప్రభుత్వ పథకం కింద అకౌంట్లోకి డబ్బులు, అధికారులు షాక్
బాలీవుడ్ నటి సన్నీలియోనికి నెలకు రూ.1000 - ప్రభుత్వ పథకం కింద అకౌంట్లోకి డబ్బులు, అధికారులు షాక్
Manu Bhaker News: మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!
మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!
Year Ender 2024: హ్యుందాయ్‌ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్‌ చేసిన IPOల లిస్ట్‌
హ్యుందాయ్‌ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్‌ చేసిన IPOల లిస్ట్‌
Embed widget