అన్వేషించండి

Bandi Bhagirath: అమ్మాయి బాగుంది... మూసుకుని పెళ్లి చేసుకో - బండి భగీరథపై పబ్లిక్ స్టార్ ట్వీట్

Bandi Saroj Kumar On Bandi Bhagirath: బండి భగీరథ కేసుపై మెజారిటీ సెలబ్రిటీలు మౌనం వహించారు. మంచు మనోజ్ ఒక్కరే స్పందించారు. ఇప్పుడీ కేసుపై పబ్లిక్ స్టార్ సరోజ్ కుమార్ ట్వీట్ చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నెటిజన్లు సరోజ్ కుమార్ ట్వీట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ (Bandi Bhagirath Case Latest Update) మీద నమోదైన పోక్సో కేసు వ్యవహారం రోజుకు ఒక మలుపు తిరుగుతోంది. మంత్రిగా అధికార, రాజకీయ పలుకుబడి ఉపయోగించి తన కుమారుడిని బండి సంజయ్ రక్షిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఇంటి పేరు ఉన్న నటుడు సరోజ్ కుమార్ సైతం విమర్శించారు (Bandi Saroj Kumar Tweet On Bandi Bhagirath). 

పోక్సో కేసుపై ప్రజలు రెండు వర్గాలు చీలిపోయారు. బండి భగీరథను సపోర్ట్ చేస్తున్న జనాలు ఉన్నారు. విమర్శిస్తున్న వాళ్ళూ ఉన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎక్కువ మంది మౌనం వహించారు. బండి బగీరథపై మంచు మనోజ్ ఒక్కరే స్పందించారు. ఇప్పుడు ఆ లిస్టులో పబ్లిక్ స్టార్ బండి సరోజ్ కుమార్ చేరారు. బండి భగీరథపై పరోక్షంగా ఆయన ట్వీట్ చేశారు.

అమ్మాయి బాగుంది... మూసుకొని పెళ్లి చేసుకో!
''అమ్మాయి బాగుంది... మూసుకొని నాన్నను ఒప్పించి పెళ్లి చేసుకో. వాళ్ల పేరెంట్స్ గురించి లైట్ తీస్కో. అన్నీ సెట్ అయిపోయి హ్యాపీ ఎండింగ్ ఉంటది. ఈ సొసైటీకి ఒక ఎగ్జైటింగ్ రివేంజ్ లవ్ స్టోరీ'' అని బండి సరోజ్ కుమార్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. లవ్ సింబల్ ఎమోజీతో పాటు రెండు చేతులు పైకి లేపుతూ అంగీకారాన్ని తెలిపే మరొక ఎమోజీ కూడా జోడించారు.

Also ReadSuriya Hit Movies On OTT: సూర్య టాప్ 10 హిట్ సినిమాలు... ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌ & స్ట్రీమింగ్ డీటెయిల్స్

మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటావా ఏంటి?
బండి సరోజ్ కుమార్ చేసిన ట్వీటులో భగీరథ పేరు ఎక్కడా లేదు. కానీ, అతను ఉద్దేశం ఏమిటో నెటిజనులకు అర్థమైంది. దాంతో మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నావా? అని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. మరొక నెటిజన్ అయితే 'మూసుకో లత్కోర్' అని తిట్టారు.

Also Readకమల్‌ వల్ల కాలేదు... రజనీ రాలేదు... 60 ఏళ్ళ ద్రావిడ ప్రభుత్వాలను విజయ్ ఎలా ఓడించాడు? సక్సెస్ ఫార్ములా ఏంటి?

'అమ్మాయి ఇష్టంతో పని లేదా? అమ్మాయికి కష్టం వచ్చిందనే కదా కేసు వరకూ వెళ్ళింది. అమ్మాయి వ్యక్తిత్వ హననానికి ఎలా పాల్పడుతున్నారో చూశావా? అసలు నీకు మైండ్ ఉందా? అని సరోజ్ కుమార్ బండిని మరొక నెటిజన్ ప్రశ్నించాడు. వ్యంగ్యంగా చేసిన ట్వీట్ అయితే ఓకే కానీ అంతకు మించి అయితే ఇంకో ఎడ్డి పాయింట్ ఉండదని మరొకరు తెలిపారు. ఇద్దరి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోమని మరొకరు సలహా ఇచ్చారు. బండి భగీరథ కేసు నేపథ్యంలో అతనిపై వర్మ గతం చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇప్పుడు బండి భగీరథ పోక్సో కేసుపై ఎవరు స్పందిస్తారో చూడాలి.

బండి సరోజ్ కుమార్ విషయానికి వస్తే... ఆయన చేసిన ఇండిపెండెంట్ ఫిల్మ్ 'మాంగల్యం'కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. సుమ కనకాల తనయుడు రోషన్ హీరోగా నటించిన 'మోగ్లీ'లో (సినిమా రివ్యూ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి) విలన్ రోల్ చేశారు. అందులో ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. నెక్స్ట్ ఏ సినిమాలో నటిస్తారో చూడాలి.

Also Readఎవరీ అగ్నిమిత్ర పాల్? 23 క్రిమినల్ కేసులు... బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నుంచి బెంగాల్ బీజేపీ క్యాబినెట్‌లోకి

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pradeep Rawat Passes Away: ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
Vanda Devullu OTT: వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ichi Padeddam Song Lyrics: 'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
Mary Rivera: 'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Embed widget