సూర్య 'కరుప్పు'లో మెయిన్ క్యారెక్టర్ లుక్స్... ఎవరెవరు నటించారో తెలుసా?

Published by: Satya Pulagam

'కరుప్పు'ను తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో విడుదల చేస్తున్నారు.

'వీరభద్ర'గా కనిపించనున్నారు సూర్య. ఆయన క్యారెక్టర్ డ్యూయల్ షేడ్స్ ఉంటాయి. ఒకటి లాయర్ గెటప్. మరొకటి దైవం వీరభద్రుడు / కరుప్పుస్వామి ఆవహించిన రూపం.

సూర్యకు జంటగా లాయర్ ప్రీతి పాత్రలో త్రిష నటించారు.

'వీరభద్రుడు'లో విలన్ రోల్ చేశారు దర్శకుడు ఆర్జే బాలాజీ. ఆయన బేబీ కృష్ణగా కనిపించనున్నారు.

మలయాళీ నటి అనఘా మారుతోరు అలియాస్ అనఘా మాయ రవి కీలక పాత్ర చేశారు. మీనా పాత్రలో ఆమె కనిపించనున్నారు.

అనఘా తండ్రి పాత్రలో ఇంద్రాన్స్ నటించారు.

'వీరభద్రుడు'లో కీలకమైన జడ్జ్ పాత్రలో నట్టి సుబ్రమణియన్ నటించారు.

విలన్ బేబీ కృష్ణ దగ్గర అసిస్టెంట్ రోల్ చేశారు శ్వాసిక.

'ఖైదీ'తో తెలుగులోనూ పాపులర్ అయిన జార్జ్ మరియన్ మరో పాత్ర చేశారు. తెలుగు నటుడు సుప్రీత్, తమిళ కమెడియన్ యోగిబాబు, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు ఇతర పాత్రలు చేశారు.