NTR Death Anniversary: తండ్రి వర్ధంతికి బాలకృష్ణ ఘన నివాళి... భారతరత్న సాధించి తీరతామన్న ఆర్ఆర్ఆర్
Balakrishna On NTR: నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన తనయుడు బాలకృష్ణ ఘన నివాళి అర్పించారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నందమూరి, నారా కుటుంబ సభ్యులతో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు, ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, ఇంకా వేలాదిమంది అభిమానులు హైదరాబాద్ సిటీలో ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ ఘాట్ (NTR Ghat)కు వచ్చి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao)కు నివాళి అర్పిస్తున్నారు.
తండ్రికి ఘన నివాళి అర్పించిన బాలకృష్ణ
Balakrishna Speech At NTR Ghat: ఎన్టీఆర్ తనయుడు, తెలుగు చిత్ర సినిమాలో అగ్ర కథానాయకుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శనివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు చేరుకున్నారు. తండ్రి 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు.
ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదని, చరిత్ర అన్నారు బాలయ్య. తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని ప్రపంచం నాలు మూలలా చాటి చెప్పడమే కాకుండా తెలుగు జాతి గౌరవాన్ని పెంచిన మహనీయుడు ఎన్టీఆర్ అని బాలకృష్ణ కొనియాడారు. ప్రతి తెలుగు వాడికి సత్తా, ధైర్యం ఇచ్చిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు అని ఆయన చెప్పారు. తెలుగు ప్రజల్లో రాజకీయాలపై ఆసక్తి, చైతన్యం పెంచిన వ్యక్తి అని, ప్రజల వద్దకు పాలన తీసుకు వచ్చిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని బాలకృష్ణ తెలిపారు. తన తండ్రి తీసుకు వచ్చిన పథకాల గురించి మరోసారి వివరించారు.
Also Read: టీవీ ఇండస్ట్రీలో ఘోర విషాదం... ట్రక్కు ఢీ కొట్టడంతో 22 ఏళ్ల నటుడు మృతి
Nandamuri Balakrishna visited NTR Ghat to pay homage to his father, the legendary Nandamuri Taraka Rama Rao, on his 29th death anniversary.#RememberingNTR #Balakrishna #LegendLivesOn #MediaMic pic.twitter.com/y8GjOgXC6i
— Media Mic | Indian Cinema | Tollywood (@MMTollywood) January 18, 2025
భారతరత్న ఇస్తే అవార్డుకు గౌరవం పెరుగుతుంది!
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన రాజకీయ ప్రముఖులలో ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘు రామ కృష్ణం రాజు (Raghu Rama Krishna Raju) కూడా ఉన్నారు. నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని, ఇస్తే ఆ అవార్డుకి వన్నె వస్తుందని, ఆ అవార్డుకు గౌరవం పెరుగుతుందని ఆర్ఆర్ఆర్ పేర్కొన్నారు. తప్పకుండా ఎన్టీఆర్‌కు భారతరత్న సాధించి తీరతామని తెలిపారు.
Also Read: టాలీవుడ్ ఇప్పుడూ స్పందించదా... 'గేమ్ చేంజర్' లీకు వీరుడు... తెలిసినవాడేనా?
#Balakrishna 🦁 arrived at #NTR Ghat 29 th death anniversary #NBK #NBKfans pic.twitter.com/2fJhlLO1xF
— Yesh rockz (@yeswanth_p) January 18, 2025





















