Balakrishna: అప్పుడు మిస్ అయ్యింది... కానీ ఇప్పుడు కన్ఫర్మ్... రజనీ సినిమాలో బాలయ్య
Balakrishna In Jailer 2: సూపర్ స్టార్ రజనీకాంత్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కలిసి స్క్రీన్ మీద కనిపించాల్సిన మూమెంట్ ఒకటి మిస్ అయింది. ఇప్పుడు అది కన్ఫర్మ్ అయ్యిందని కోలీవుడ్ టాక్.

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)... గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)... ఇద్దరూ కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుంది? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో రెస్పాన్స్ ఏ రేంజ్‌లో ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి. త్వరలో ఆ మూమెంట్ థియేటర్లలో నిజం కానుంది.
'జైలర్ 2'లో అతిథిగా బాలయ్య... ఇది ఫిక్స్!
Rajinikanth's Jailer 2 Latest News: రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన సినిమా 'జైలర్'. బాక్స్ ఆఫీస్ బరిలో 600 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది. రజని స్టామినా ఏమిటనేది ఈతరం ప్రేక్షకులకు చూపించిన చిత్రమిది.
'జైలర్' సినిమాలో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ అతిథి పాత్రలలో సందడి చేశారు. అప్పట్లో బాలకృష్ణ కూడా ఆ సినిమాలో నటించాల్సిందని దర్శకుడు నెల్సన్ తెలిపారు. బాలయ్య కోసం ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ చేయాలని అనుకున్నామని, అయితే అది కుదరలేదని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. దాంతో రజనీకాంత్, బాలకృష్ణ కాంబినేషన్ మిస్ అయింది. కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయింది.
'జైలర్ 2' సినిమాలో బాలకృష్ణ అతిధి పాత్రలో నటించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. త్వరలో ఆయన చిత్రీకరణలో పాల్గొంటారు. ఆయన రోల్ ఎలా ఉంటుంది? స్క్రీన్ మీద ఎంత సేపు కనిపిస్తారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ప్రస్తుతానికి సస్పెన్స్.
'జైలర్'లో అతిథి పాత్రల్లో సందడి చేసిన మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ మరోసారి 'జైలర్ 2'లోనూ సందడి చేయనున్నారు. వాళ్లిద్దరూ కాకుండా బాలకృష్ణ జాయిన్ అయ్యారు. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, కోలీవుడ్ స్టార్ ఎస్.జె. సూర్య ఇందులో నటిస్తున్నారు.
ఇటీవల '45' సినిమా ప్రచార కార్యక్రమాల కోసం హైదరాబాద్ వచ్చిన శివ రాజ్ కుమార్ 'జైలర్ 2'లో బాలయ్య అతిథి పాత్ర గురించి తెలివిగా సమాధానం ఇచ్చారు. సీక్వెల్‌లో కూడా తన రోల్ ఉందని నెల్సన్ చెప్పాడని, బాలకృష్ణ గురించి తనకు తెలియదని ఆయన సమాధానం ఇచ్చారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమాలో బాలకృష్ణ కూడా ఉన్నారు.
అనిరుద్ సంగీతం... ఇంకా క్రేజీగా కథ!
'జైలర్' సినిమాలో రజనీకాంత్ భార్య పాత్రలో శివగామి రమ్యకృష్ణ నటించిన నటించారు. సీక్వెల్‌లో ఆవిడ క్యారెక్టర్ ఉంటుంది. తాను షూటింగ్ చేస్తున్న విషయాన్ని ఆ మధ్య సోషల్ మీడియాలో తెలిపారు. 'జైలర్' విజయంలో అనిరుద్ రవిచందర్ సంగీతం కీలక పాత్ర పోషించింది. 'జైలర్ 2' సినిమాకు ఆయనే సంగీతం అందిస్తున్నారు. ఈసారి కథ మరింత క్రేజీగా ఉంటుందని, రజనీతో పాటు మిగతా స్టార్స్ హీరోయిజం మూమెంట్స్ అదిరిపోతాయట.
Also Read: శర్వా38... ఇప్పట్నుంచి 'భోగి'... షూటింగ్ మొదలైంది... టైమ్ పీరియడ్, స్టోరీ బ్యాక్‌డ్రాప్ ఇదే




















