అన్వేషించండి

PV Sindhu: ‘ఫైటర్‘ మూవీపై పీవీ సింధు రివ్యూ, దీపికా పదుకొణె రియాక్షన్ ఏంటో తెలుసా?

PV Sindhu Reviews Fighter movie: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ‘ఫైటర్‘ మూవీపై రివ్యూ ఇచ్చింది. ‘వాట్ ఏ మూవీ‘ అంటూ ప్రశంసలు కురిపించింది. సింధు రివ్యూపై దీపికా పదుకొణె స్పందించింది.

PV Sindhu Reviews Deepika Padukones Fighter movie: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించిన తాజా యాక్షన్ మూవీ ‘ఫైటర్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న విడుదలైంది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకున్నది. ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 225 కోట్లు వసూళు చేసింది. ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ మూవీపై బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రివ్యూ ఇచ్చింది. తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఈ సినిమా అద్భుతం అంటూ ప్రశంసించింది. హృతిక్ రోషన్, దీపికా పదుకొణె నటనపైనా పొగడ్తల వర్షం కురిపించింది.  

‘ఫైటర్’ మూవీపై పీవీ సింధు రివ్యూ

తాజాగా ‘ఫైటర్’ సినిమాను చూసినట్లు పీవీ సింధు వెల్లడించింది. సినిమాతో పాటు సినిమాలోని నటీనటుల యాక్టింగ్ ను ఓ రేంజిలో పొగిడేసింది. “వాట్ ఏ మూవీ, హృతిక్, దీపికా ఉఫ్.. అనిల్ సర్, జస్ట్ టైమ్ లెస్” అంటూ తన ఇన్ స్టా స్టోరీస్ లో రాసుకొచ్చింది. ఈ మేరకు ఫైటర్ మూవీ పోస్టర్ ను షేర్ చేస్తూ తన రివ్యూను వెల్లడించింది. పీవీ సింధు రివ్యూపై దీపికా పదుకొణె స్పందించింది. సింధు పోస్టును రీ పోస్ట్ చేస్తూ ‘లవ్ యు’ అని వెల్లడించింది.  

బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న ‘ఫైటర్’

జనవరి 25న ‘ఫైటర్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రాగా, 5 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ. 225 కోట్లు వసూళు చేసింది. ఇండియాలో ఇప్పటి వరకు రూ. 126.5 కోట్లు సాధించింది. అయితే, ఈ సినిమా కేవలం హిందీలోనే విడుదల అయ్యింది. ఇప్పుడు వస్తున్న చాలా సినిమాలు పలు భాషల్లో విడుదలవుతున్నా, ఈ సినిమాను కేవలం హిందీలోనే రిలీజ్ చేశారు మేకర్స్. అటు ఈ సినిమాను గల్ఫ్ కంట్రీస్ లో నిషేధించాయి. ఈ నేపథ్యంలో అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదంటున్నారు ట్రేడ్ నిపుణులు. వాస్తవానికి ‘ఫైటర్’ మూవీకి నెగెటివ్ రివ్యూలు రాకపోయినా, సిద్ధార్థ్ ఆనందం గత చిత్రాలు ‘వార్’, ‘పఠాన్’తో పోల్చితే కలెక్షన్లు చాలా తక్కువగా వచ్చాయి. ఫుల్ రన్ లో ‘వార్’ రూ. 475 కోట్లు, ‘పఠాన్’ రూ. 1050 కోట్లు సాధించాయి. ఈ మార్క్ ను ‘ఫైటర్’ చేరడం కష్టం అనిపిస్తోంది. 

‘ఫైటర్’ మూవీలో హృతిక్, దీపికా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో స్క్వాడ్రన్ లీడర్లుగా కనిపించారు. అనిల్ కపూర్ గ్రూప్ కెప్టెన్ పాత్రలో నటించారు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.  అటు హృతిక్ త్వరలో ‘వార్2’లో నటించనున్నారు. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నారు. అటు దీపికా పదుకొణె ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీ ‘కల్కి 2898 AD’తో పాటు ‘సింగం ఎగైన్‌’లో కనిపించనుంది.

Read Also: ఆ స్టార్‌ హీరోతో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పెళ్లి - నిజమెంత?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Embed widget