Thamma Telugu Trailer: రష్మిక మందన్న హారర్ కామెడీ 'థామా' ట్రైలర్ - నవ్విస్తూనే భయపెట్టేశారు... తెలుగులో చూశారా?
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక, బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటించిన 'థామా' తెలుగు ట్రైలర్ వచ్చేసింది. దీపావళి కానుకగా మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Rashmika Mandanna's Thamma Trailer Released: బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్ ఖురానా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ బాలీవుడ్ హారర్ థ్రిల్లర్ 'థామా'. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, టీజర్ ఆకట్టుకుంటుండగా... తాజాగా తెలుగులో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో డిఫరెంట్ రోల్‌లో రష్మిక అదరగొట్టారు.
ట్రైలర్ ఎలా ఉందంటే?
'నువ్వు భేతాళుడివి. నిన్ను భూమిని, మానవాళిని రక్షించడానికే సృష్టించారు.' అంటూ రష్మిక డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం కాగా... 'ఈ రోజు నుంచి మానవుల రక్తం తాగుదాం. చిన్ని చిన్ని భేతాళులని సృష్టిద్దాం. ఒక సైన్యాన్ని తయారు చేద్దాం. అప్పుడు నేనవుతాను. మీ థామా.' అనే డైలాగ్‌తో ఓ భేతాళుడి కోటను చూపించారు. వేల ఏళ్ల క్రితం ఉన్న ఆత్మ తిరిగి భూమి మీదకు వస్తే ఏం జరుగుతుంది? దాన్ని హీరో, హీరోయిన్లు ఎలా ఎదుర్కొన్నారు అనేదే బ్యాక్ డ్రాప్‌గా మూవీ తెరకెక్కినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. హీరో ఆయుష్మాన్ ఖురానాకు భేతాళుడి రూపంలో పళ్లు ముందుకు రావడం... దాన్ని కామెడీ రూపంలో చూపించారు. తన కొడుకుని అలా చూసిన తండ్రి షాక్ అవుతాడు. అతన్ని మామూలుగా మార్చేందుకు ఆయన పడే తిప్పలు నవ్వులు పూయించాయి.
రష్మిక, ఆయుష్మాన్ లవ్ ట్రాక్ చూపిస్తూనే... 'నేను నీతో పాటు ఉండలేను. మన ప్రపంచాలు ఒకటి కావు.' అంటూ రష్మిక చెప్పే డైలాగ్ సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ఓ గోల్ అంటూ పెట్టుకుని దాని కోసం పని చేస్తున్న హీరోకి భేతాళుడికి సంబంధం ఏంటి?, అసలు రష్మిక పాత్ర ఏంటి? ఆమె వల్ల ఆయుష్మాన్‌కు సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి?, వారిద్దరూ ఎందుకు కలవలేరు? సూపర్ పవర్స్‌తో ఏం చేశారు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
రిలీజ్ ఎప్పుడంటే?
మూవీకి ఆదిత్య సర్పోత్ధార్ దర్శకత్వం వహిస్తుండగా... దినేశ్ విజన్ నిర్మిస్తున్నారు. రష్మిక, ఆయుష్మాన్‌లతో పాటు నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్, సత్యరాజ్, వరుణ్ ధావన్, ఆసిఫ్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మడాక్ ఫిల్మ్స్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా 'థామా' రూపొందుతుండగా... అక్టోబర్ 21న దీపావళి కానుకగా మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram






















