Avika Gor: త్వరలో తల్లి కాబోతున్న చిన్నారి పెళ్లి కూతురు... అలా హింట్ ఇచ్చిందా?
తొలుత 'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్, ఆ తర్వాత 'ఉయ్యాలా జంపాలా'తో పాటు పలు సినిమాలు చేసిన నార్త్ ఇండియన్ అమ్మాయి త్వరలో తల్లి కాబోతుంది. ఓ వీడియోలో ఆవిడ హింట్ ఇచ్చింది.

బాలీవుడ్ సీరియల్ 'బాలికా వధు'ను తెలుగులో 'చిన్నారి పెళ్లి కూతురు'గా డబ్బింగ్ చేశారు. దాంతో తెలుగు బుల్లితెర వీక్షకుల్లో అవికా గోర్ పాపులర్ అయ్యారు. ఆ తర్వాత 'ఉయ్యాలా జంపాలా'తో హీరోయిన్ అయ్యారు. కథానాయికగా బోలెడు సినిమాలు చేశారు. ఇప్పుడు ఆమె తల్లి కాబోతోందనే సమాచారం. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ, ఆమె భర్త మిలింద్ చంద్వానీ మాటలు వింటే ఈ జంట త్వరలో తమ మొదటి బిడ్డకు స్వాగతం పలుకుతారని అనుకోవడం సహజం.
అవికా గోర్ తన చిరకాల ప్రియుడు మిలింద్ చంద్వానీతో గత ఏడాది పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వార్తలతో హెడ్ లైన్స్‌లో నిలిచింది. తాజా వ్లాగ్‌లో అవికా గోర్ 2026లో తన జీవితంలో పెద్ద మార్పు రాబోతోందని చెప్పింది.
ప్లాన్ చేయలేదు... మిలింద్ మాటల వెనుక అర్థం ఏమిటి?
కొత్త సంవత్సరం కూడా తమకు మంచిని తెస్తుందని, దాని కోసం తాము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అవికా గోర్ చెప్పింది. మిలింద్ మాట్లాడుతూ... "మేము ఊహించని, ప్లాన్ చేయని మార్పు ఇది. మేము కలలో కూడా దీని గురించి ఆలోచించలేదు" అని అన్నాడు.
Also Read: Sreeleela: ఇది బీకాంలో ఫిజిక్స్ లెక్క... ఆర్ట్స్ కాలేజీలో డాక్టర్లు ఎందుకుంటారమ్మా?
తమ జీవితంలో రాబోయే మార్పు చాలా పెద్దదని, అది తమకు చాలా అందంగా ఉందని ఈ జంట పేర్కొంది. 'మీరు నర్వస్‌గా ఉన్నారా?' భర్తను అవిగా గోర్ అడిగినప్పుడు... తాను సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నానని, కానీ కొంచెం నర్వస్‌గా ఉన్నానని మిలింద్ చెప్పాడు. జీవితంలో కొంచెం నర్వస్‌గా ఉండటం అవసరమని మిలింద్ అన్నారు. అవికా గోర్ త్వరలో తన యూట్యూబ్‌లో శుభవార్తను పంచుకుంటానని ప్రామిస్ చేసింది.
అవికా, మిలింద్‌ల ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో అభిమానులు ఈ జంట తమ మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారని ఊహాగానాలు చేస్తున్నారు. నెటిజనులు కొందరు ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారని రాశారు. రియాలిటీ షో 'పతి పత్ని ఔర్ పంగా'లో మిలింద్, అవికా ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.





















