(Source: ECI/ABP News/ABP Majha)
Ashoka Vanamlo Arjuna Kalyanam Trailer: అమ్మాయి ముద్దు పెట్టేసింది కానీ పెళ్లి ఇష్టం లేదంటోంది - పెళ్లికొడుకు పరిస్థితి ఏంటి?
విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదల చేశారు. ఆ ట్రైలర్ ఎలా ఉంది?
Ashoka Vanam Lo Arjuna Kalyanam movie update: విశ్వక్ సేన్ (Vishwak Sen) కథానాయకుడిగా నటించిన సినిమా 'అశోక వనంలో అర్జున కళ్యాణం'. ఇందులో రుక్సార్ థిల్లాన్ (Rukshar Dhillon) కథానాయిక. మే 6న (AVAK on May 6th) సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
Ashoka Vanam Lo Arjuna Kalyanam Trailer: సినిమా ట్రైలర్ చూస్తే... సూర్యాపేట కుర్రాడు అర్జున్ కుమార్ అల్లం పాత్రలో విశ్వక్ సేన్ కనిపించారు. 'మా సూర్యాపేట మొత్తం ఒక్కటే టాపిక్.. అర్జున్ కుమార్ అల్లం గాడికి పెళ్లి కాలేదు, పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు' అని అమ్మాయితో చెబుతూ హీరోను పరిచయం చేశారు. 'కుదిరింది... కుదిరింది... కుదిరింది పెళ్లి. ముడ్డి కింద 30 వచ్చినాక' అని నేపథ్యంలో మరో వాయిస్. అప్పుడు పెళ్లి కొడుకు అవతారంలో విశ్వక్ సేన్ ప్రత్యక్షం అయ్యారు. అసలు కథకు వస్తే... తెలంగాణ అబ్బాయికి, గోదావరి అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఇద్దరి కులాలు వేరు, యాసలు వేరు. అయినా పెళ్లికి అంతా సిద్ధమైంది. అబ్బాయికి అమ్మాయి ముద్దు కూడా పెట్టేసింది. కానీ, పెళ్లి ఇష్టం లేదని చెబుతోంది. ఏంటీ కథ? అంటే సినిమా చూడాలి.
స్క్రిప్టు.. అంతా స్క్రిప్టు 🔥😉
— SVCC Digital (@SVCCDigital) April 20, 2022
Here's the Theatrical Trailer of #AshokaVanamLoArjunaKalyanam
▶️ https://t.co/bdGJyDlkJ0
MAY 6TH RELEASE ✅#AVAKonMay6th@VishwakSenActor @RuksharDhillon @BvsnP #BapineeduB @sudheer_ed @storytellerkola @vidya7sagar @SVCCDigital @SonyMusicSouth pic.twitter.com/BQaSVdg0LH
'అశోక వనంలో అర్జున కళ్యాణం' చిత్రానికి విద్యా సాగర్ చింతా దర్శకుడు. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ (BVSN Prasad) సమర్పణలో... ఎస్‌విసిసి డిజిటల్ పతాకంపై ఆయన తనయుడు బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'రాజావారు రాణీగారు' (Ravi Kiran Kola) చిత్రదర్శకుడు రవికిరణ్ కోలా కథ అందించారు.
Also Read: మహేష్ 'సర్కారు'తో పెద్ద హిట్ కొడుతున్నాం - నిర్మాత కాన్ఫిడెన్స్, ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆల్రెడీ రెండు పాటలు 'ఓ ఆడపిల్ల..', 'రంగు రంగు రాంసిలకా...' విడుదల చేశారు. రెండూ శ్రోతలను ఆకట్టుకున్నాయి.
Also Read: మంగళ సూత్రం ఏది? నుదుట సింధూరం ఎక్కడ? - ఆలియాపై ట్రోలింగ్ షురూ