Arjun Ambati: జెన్నిఫర్‌తో అర్జున్ అంబటి 'చిన్ని చిన్ని తప్పులేవో'... థ్రిల్లర్ సినిమాలో రొమాంటిక్ సాంగ్
Paramapadha Sopanam Movie: సీరియల్స్, రియాలిటీ షోస్ చూసే తెలుగు ఆడియన్స్‌కు అర్జున్ అంబటి తెలిసే ఉంటారు. ఆయన హీరోగానూ సినిమాలు చేస్తున్నారు. ప్రజెంట్ ఒక రొమాంటిక్ మూవీ చేస్తున్నారు.

బుల్లితెరపై అర్జున్ అంబటి (Arjun Ambati) చాలా ఫేమస్. సీరియల్స్, రియాలిటీ షోస్ ద్వారా తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు. హీరోగానూ ఆయన తన మార్క్ చూపించారు. 'అర్ధనారి' వంటి హిట్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేశారు. 'బిగ్ బాస్'తో తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గర అయ్యారు. 'తెప్ప సముద్రం', 'వెడ్డింగ్ డైరీస్' వంటి సినిమాలు చేశారు. ఆయన హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ 'పరమపద సోపానం'
'పరమపద సోపానం'లో రొమాంటిక్ హీరోగా...
థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతున్న సినిమా 'పరమపద సోపానం' (Paramapada Sopanam). ఇందులో జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్. రీసెంట్‌గా ఫస్ట్ సాంగ్ 'చిన్న చిన్న తప్పులేవో...' విడుదల చేశారు. అందులో అర్జున్ అంబటి రొమాంటిక్ హీరోగా కనిపించారు. బికినీ తరహా డ్రస్సులతో జెన్నిఫర్ గ్లామర్ షో చేశారు.
మాస్ మహారాజా రవితేజ 'ఈగల్'తో సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న డేవ్ జాండ్ ఈ 'పరమపద సోపానం' చిత్రానికి మ్యూజిక్ అందించారు. సింగర్స్ పృథ్వీ చంద్ర, అదితి బావరాజు పాడిన 'చిన్ని చిన్ని తప్పులేవో'కి ఆయన ట్రెండీ ట్యూన్ అందించారు. రాంబాబు గోశాల అందించిన సాహిత్యం యువతను ఆకట్టుకునేలా ఉంది.
జూలై 11న 'పరమపద సోపానం' విడుదల
'పరమపద సోపానం' సినిమాకు పూరి జగన్నాథ్ వంటి దిగ్గజ దర్శకుడి దగ్గర వర్క్ చేసిన నాగ శివ దర్శకుడు. కథతో పాటు మాటలు, స్క్రీన్ ప్లే కూడా ఆయన రాశారు. ఎస్.ఎస్.మీడియా సంస్థపై గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మిస్తున్నారు. గుడిమెట్ల ఈశ్వర్ ఈ చిత్రానికి సహ నిర్మాత.
Paramapada Sopanam Release Date: 'పరమపద సోపానం' సినిమాను జూలై 11న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయని చెప్పారు.
Also Read: మెగా ఫ్యామిలీని దూరం చేసుకుంటున్న దిల్ రాజు? తెర వెనక కుట్రలా... ఇండస్ట్రీలో ఏం జరుగుతోందా?
అర్జున్ అంబటి, జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన 'పరమపద సోపానం' చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గణపర్తి నారాయణరావు, ఛాయాగ్రహణం: ఈశ్వర్, సంగీతం: డేవ్ జాండ్, నిర్మాణ సంస్థ: ఎస్ ఎస్ మీడియా, సహ నిర్మాత: గుడిమిట్ల ఈశ్వర్, నిర్మాత: గుడిమిట్ల శివ ప్రసాద్, దర్శకత్వం: నాగ శివ.





















