Ghaati Movie: ‘ఘాటీ’ షూటింగ్ మళ్లీ షురూ చేసిన అనుష్క శెట్టి... హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల షూట్
అనుష్క, క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఘాటీ’ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. హైదరాబాద్ లో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కొనసాగుతోంది. అనుష్కకు సంబంధించి కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు.
Ghaati Movie Shooting: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క శెట్టి కాంబోలో ఇప్పటికే ‘వేదం’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం మరోసారి వీరి కాంబోలో మరో సినిమా వస్తోంది. అనుష్క ప్రధాన పాత్రలో ‘ఘాటీ’ అనే సినిమా తెరకెక్కుతున్నది. గంజాయి కథాశంతో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి కొద్ది నెలల క్రితమే అనౌన్స్ మెంట్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కొనసాగుతోంది. అనుష్క శెట్టికి సంబంధించి కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.
గంజాయి కథాంశంతో తెరెక్కుతున్న‘ఘాటీ’
నేరస్తురాలిగా మారిన ఓ బాధితురాలి కథతో ‘ఘాటీ’ సినిమా తెరకెక్కుతోంది. రివేంజ్ స్టోరీతో ఈ సినిమా రూపొందుతోంది. బిజినెస్ వుమెన్ గా ఎదుగుతున్న ఓ మహిళను కొందరు స్వార్థంతో కావాలని టార్గెట్ చేస్తారు. ఆమెను తీవ్రం నష్టపరుస్తారు. ఆమె ఏ పరిస్థితులలో నేరస్థురాలిగా మారింది? ఆ తర్వాత తనకు నష్టం చేసిన వారిపై ఎలా రివేంజ్ తీర్చుకుంది? అనేది ఈ సినిమాలో ప్రధాన అంశం. ఈ రివేంజ్ డ్రామా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.
ముంబై వేదికగా ‘ఘాటీ’ పేరు, ప్రీ లుక్ రివీల్
యు.వి.క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా ‘ఘాటీ‘ సినిమాను నిర్మిస్తున్నాయి. వంశీకృష్ణా రెడ్డి, రాజీవ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కొద్ది నెలల క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియో ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ సినిమాకు సంబంధించిన పేరును, ప్రీ లుక్ ను రివీల్ చేశారు. ఈ సినిమా ప్రీ లుక్ ప్రేక్షకులను బాగా కట్టుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది.
#Ghaati#AnushkaShetty pic.twitter.com/fZZmGsrIE3
— The South Movies (@TheSouthMovies1) September 19, 2024
చివరగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి‘ చిత్రంలో కనిపించిన అనుష్క
అనుష్క చివరగా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాలో కనిపించింది. గత ఏడాది సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పి. మహేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించారు. నాజర్, మురళీ శర్మ, జయసుధ, అభినవ్ గోమఠం, సోనియా దీప్తి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. చిరంజీవి, మహేష్ బాబు, సమంత లాంటి సినీ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా అప్పట్లో రూ. 50 కోట్లకు పైగా వసూళు చేసింది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్... అతిథులుగా ఎన్టీఆర్‌తో సినిమాలు చేసిన, చేయబోయే దర్శకులు