అన్వేషించండి

Miss Shetty Mr Polishetty : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి - అనుష్క కొత్త సినిమా టైటిల్, లుక్ వచ్చిందోచ్

Anushka Movie Titled Miss Shetty Mr Polishetty : అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి ఓ సినిమా చేస్తున్నారు. ఈ రోజు టైటిల్ అనౌన్స్ చేశారు. ఇద్దరి ఇంటి పేర్లు కలిసొచ్చేలా సినిమా టైటిల్ పెట్టడం విశేషం. 

అరుంధతి, భాగమతి, దేవసేన వంటి పేర్లు చెబితే తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేది ఒక్కరే! మిస్ అనుష్క శెట్టి (Anushka Shetty). యువ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty)తో కలిసి ఆమె ఓ సినిమా చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ సినిమా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ విషయం ప్రేక్షకులకు తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... సినిమా టైటిల్ ఖరారు చేశారు. 

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి - టైటిల్ ఇదే!
Miss Shetty Mr Polishetty For Anushka 48th Movie : అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి సినిమాకు 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' టైటిల్ ఖరారు చేసినట్లు యూవీ క్రియేషన్స్ ఈ రోజు వెల్లడించింది. విశేషం ఏమిటంటే... హీరో హీరోయిన్లు ఇద్దరి పేర్లలో చివరి పేర్లు, ఇంటి పేర్లు అవే కావడం!

టైటిల్ రివీల్ చేసిన సందర్భంగా విడుదల చేసిన స్టిల్ గమనిస్తే... లండన్ సిటీలో అనుష్క శెట్టి, హైదరాబాద్ సిటీలో నవీన్ పోలిశెట్టి ఉన్నట్లు అర్థం అవుతోంది. వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయనున్నట్లు యూవీ క్రియేషన్స్ సంస్థ పేర్కొంది. 

అనుష్క... ఇంటర్నేషనల్ షెఫ్!
ఈ సినిమాలో అనుష్క షెఫ్ రోల్ చేస్తున్నారు. అదీ ఇంటర్నేషనల్ షెఫ్! ఆమె బర్త్ డే సందర్భంగా అన్విత రవళి శెట్టి పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. అలాగే, అనుష్క వంట చేస్తున్న స్టిల్ కూడా విడుదల చేశారు. 

అనుష్కకు 48వ చిత్రమిది. యూవీ క్రియేషన్స్ సంస్థలో 'మిర్చి', 'భాగమతి' చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. వాటి తర్వాత ఆ సంస్థలో అనుష్క నటిస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. త్వరలో సినిమా టైటిల్ అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం... నాలుగు దక్షిణాది భాషల్లో తెరకెక్కిస్తున్నారు. 

'భాగమతి' తర్వాత అనుష్క...
'జాతి రత్నాలు' తర్వాత నవీన్!
సుమారు ఐదేళ్ళ తర్వాత అనుష్క శెట్టి నుంచి థియేటర్లలోకి వస్తున్న సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. 'భాగమతి' తర్వాత అనుష్క 'నిశ్శబ్దం' సినిమా చేశారు. అయితే, ఆ సినిమా ఓటీటీలో విడుదల అయ్యింది. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన హిస్టారికల్ సినిమా 'సైరా నరసింహా రెడ్డి'లో ఝాన్సీ లక్ష్మీ బాయి రోల్ చేశారు. అందువల్ల, ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. 

Also Read : రామ్ చరణ్‌ - 'బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా' అంటోన్న అమెరికన్ మీడియా

మరో విశేషం ఏమిటంటే... 'జాతి రత్నాలు' తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి వస్తున్న సినిమా కూడా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'యే. అనుష్క, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. హీరో హీరోయిన్లు ఇద్దరూ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా విడుదల తర్వాత కొత్త సినిమాలకు సంతకం చేయాలని నవీన్ పోలిశెట్టి ఆలోచిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ గుసగుస. అందుకని, ఈ మధ్య కొత్త కథలు ఏవీ వినడం లేదని తెలుస్తోంది. ఆల్రెడీ సితార సంస్థలో  ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు అనుష్క కూడా కొత్త సినిమాలు ఏవీ అంగీకరించలేదు. ఆమె కూడా ఈ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విడుదలైన తర్వాత కొత్త సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. 

Also Read : సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మృతి - 'విరూపాక్ష' టీజర్ విడుదల వాయిదా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Actor Govinda: అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
Embed widget