అన్వేషించండి

Anupama Parameswaran: సిద్ధుకు పెద్ద ‘ముద్ద’ పెట్టానంటున్న అనుపమ - షాకైన నిర్మాత

Anupama Parameswaran: ‘టిల్లు స్క్వేర్’లో అనుపమ పరమేశ్వరన్ చాలా బోల్డ్‌గా నటించింది. అంతే కాకుండా తాజాగా ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ డైలాగ్ కూడా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Anupama Parameswaran: సంక్రాంతికి విడుదల కావాల్సిన ‘టిల్లు స్క్వేర్’.. ఇన్నిరోజుల తర్వాత మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఇందులో సిద్ధు జొన్నల్లగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించగా.. అనుపమ తన కెరీర్‌లో మునుపెన్నడూ చేయని బోల్డ్ పాత్ర చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఇదే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ‘టిల్లు స్క్వేర్’ హీరోహీరోయిన్లతో పాటు నిర్మాత నాగవంశీ కూడా ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో అనుపమ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పెద్ద ముద్ద..

ముందుగా అనుపమ పరమేశ్వరన్‌కు వంట వచ్చా అని ప్రశ్న ఎదురయ్యింది. తను ఎలాంటి వంటకాలు చేయగలదో కూడా బయటపెట్టింది. అది విన్న సిద్ధు.. ‘‘ప్రతీరోజూ షూటింగ్‌లో అనుపమను పిలిచి 4,5 వెరైటీల ఐటెమ్స్ పెట్టేవాడిని. ఒక్కరోజు నాకు ఒక గుడ్డు పెట్టిన పాపాన పోలేదు’’ అని కౌంటర్ ఇచ్చాడు. ‘‘ఒక ఆమ్లెట్ అయినా పెట్టావా’’ అని ధీనంగా అనుపమను అడిగాడు. ఇప్పుడు పెడతాను అని అనుపమ సమాధానం ఇవ్వగా ఇంకెందుకు అని రివర్స్ అయ్యాడు. ‘‘పెద్ద ముద్ద పెట్టాను కదా’’ అని కౌంటర్ ఇచ్చింది అనుపమ. అది విన్న సిద్ధు, నాగవంశీ షాకయ్యారు. ‘‘అనుపమ తెలియక అన్నదని ఎవరూ అనుకోకండి.. తెలిసే అన్నది’’ అని క్లారిటీ ఇచ్చాడు సిద్ధు.

మీకేంటి తొందర..

‘‘అది సినిమాలో డైలాగ్. టిల్లు ఎలా చెప్తాడో అలా చెప్పాను’’ అంటూ తను చెప్పిన కౌంటర్‌ను కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది అనుపమ. ‘‘ట్రైలర్‌లో పెద్ద ముద్ద పెట్టాను. బాంబూ’’ అంటూ ‘టిల్లు స్క్వేర్’ రిఫరెన్స్‌తో మాట్లాడింది. ఇక సిద్ధు పెళ్లి గురించి తాజాగా జరిగిన ‘టిల్లు స్క్వేర్’ ప్రెస్ మీట్‌లో కూడా ప్రశ్న ఎదురయ్యింది. మరోసారి ఆ పెళ్లి ప్రశ్నపై తను స్పందించాడు. ‘‘లైఫ్‌లో నిజంగా రాధిక వస్తుందా’’ అని అడగగా.. లేదు అన్నట్టుగా తలను అడ్డంగా ఊపాడు సిద్ధు. ‘‘పెళ్లయిన వాళ్లందరూ కూడా పెళ్లికాని వారి అకౌంట్‌ను క్లోజ్ చేసేద్దాం అనే ఆలోచనలో ఉంటారు. మొన్న కూడా ప్రెస్ మీట్‌లో ఎవరో స్టార్ హీరోయిన్‌తో పెళ్లి అవుతుందా అని అడిగితే చెప్పండి సంబంధం మేము పెళ్లి చేస్తామన్నారు నాగవంశీ. మీకేంటి తొందర?’’ అని సిద్ధు ఫన్నీగా సమాధానమిచ్చాడు.

పెళ్లి అంటే అంతే..

పెళ్లయితే బాగుంటుంది అని చెప్పగా.. ‘‘ఎవరికి బాగుంటుంది’’ అంటూ రివర్స్ అయ్యాడు సిద్ధు జొన్నలగడ్డ. ‘‘ఇండియన్ పెళ్లిలో పెద్ద జోక్ ఏంటంటే పెళ్లి తంతు వారి గురించే అని జంట అనుకుంటుంది. కానీ అది వాళ్లు గురించి కాదు’’ అంటూ పెళ్లిపై తనకు ఉన్న అభిప్రాయాన్ని బయటపెట్టాడు. ఇక ‘డీజే టిల్లు’తో టాలీవుడ్‌లోని మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోల జాబితాలో చేరిపోయాడు సిద్ధు. ఇప్పుడు మరోసారి తనకు ఆ రేంజ్‌లో క్రేజ్ తెచ్చిపెట్టిన సినిమాకు సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ‘టిల్లు స్క్వేర్’ సీక్వెల్‌లో అనుపమ కూడా యాడ్ అవ్వడంతో మూవీకి మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

Also Read: చాలాసార్లు చచ్చిపోవాలి అనిపించింది, నా సపోర్ట్ ఆ నాయకుడికే - అనసూయ

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget