Ameer Sultan: రజనీకాంత్ సినిమా అయితే బ్యాన్ చేస్తారా? - నయనతార దర్శకుడి సెన్సేషనల్ కామెంట్స్
Rajinikanth: నయనతార హీరోయిన్‌గా తెరకెక్కిన ‘అన్నపూర్ణి’ అనేక కాంట్రవర్సీల్లో చిక్కుకుంది. అయితే ఓ దర్శకుడు రజినీకాంత్ ఈ సినిమాలో ఉంటే దీనిని బ్యాన్ చేసేవారా అంటూ కాంట్రవర్షియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
Ameer Sultan about Annapoorani: నయనతార 75 చిత్రంగా విడుదలయిన ‘అన్నపూర్ణి’ సినిమా కోలీవుడ్‌లో పెద్ద దుమారాన్ని సృష్టించింది. ఈ సినిమా హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందని, బ్రాహ్మణ కమ్యూనిటీని కించపరిచేలా ఉందని సోషల్ మీడియాలో రచ్చ ప్రారంభమయ్యింది. ‘అన్నపూర్ణి’ ట్రైలర్ విడుదయినప్పటి నుండే అందులో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా డైలాగులు, సీన్స్ ఉన్నాయని ప్రేక్షకుల నుండి వ్యతిరేకత మొదలయ్యింది. ఓటీటీలో విడుదలయిన తర్వాత వ్యతిరేకత మరింత పెరిగిపోయింది. అయితే మూవీ టీమ్... దీనిపై స్పందించడం ఇష్టపడలేదు. కానీ తమిళ డైరెక్టర్ అమీర్ సూల్తాన్ మాత్రం ఈ విషయంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మైనారిటీ సెంటిమెంట్స్‌కు విలువ లేదనిపిస్తుంది..
‘‘ఇండియాలో ఒక ప్రత్యేకమైన పార్టీకి, ప్రత్యేకమైన మతానికి సపోర్ట్ చేసేలా ఉండే సినిమాలు ఫ్రీగా ఓటీటీలో ప్రసారమవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే మైనారిటీ సెంటిమెంట్స్‌కు విలువ లేదనిపిస్తుంది. రాజకీయ ప్రచారం చేస్తున్న సినిమాలు ఎందుకు ఓటీటీల నుండి తొలగించడం లేదు? ఒకవేళ అన్నపూర్ణి సినిమాలో రజనీకాంత్ ఉండుంటే దానిని ఓటీటీ నుండి తొలగించేవారా’’ అని ప్రశ్నించారు అమీర్ సుల్తాన్. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి సినిమాను తొలగించారని, మైనారిటీ మనోభావాల గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా అంటూ అర్థం వచ్చేలా అమీర్ స్టేట్‌మెంట్ ఇవ్వడంతో ప్రస్తుతం కోలీవుడ్‌లో ఇది చర్చనీయాంశంగా మారింది. పైగా రజనీకాంత్ పేరును మధ్యలోకి తీసుకురావడంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
నెట్‌ఫ్లిక్స్ నుండి తొలగింపు..
నీలేష్ కృష్ణ తర్శకత్వంలో తెరకెక్కిన ‘అన్నపూర్ణి’.. నయనతార కెరీర్‌లో ల్యాండ్ మార్క్ చిత్రంగా మిగిలిపోవాల్సింది. కానీ సినిమా కంటెంట్ చాలా మందికి నచ్చక.. దీనికి యాంటీ హిందు ఫిల్మ్ అని ట్యాగ్ ఇచ్చారు. ఎంత వ్యతిరేకత ఎదురయినా.. ఈ మూవీని థియేటర్లలో విడుదల చేశారు మేకర్స్. కానీ ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. అందుకే కొన్నిరోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్.. ‘అన్నపూర్ణి’ని కేవలం తమిళంలో మాత్రమే కాకుండా ఇతర సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా స్ట్రీమ్ చేసింది. కానీ దానివల్ల వ్యతిరేకత మరింత పెరిగిపోయింది. చాలామంది నెట్‌ఫ్లిక్స్‌ను ట్యాగ్ చేసి సినిమాను స్ట్రీమింగ్ నుండి తీసేయమని రచ్చ చేశారు. దీంతో వేరేదారి లేక ఈ మూవీని తొలగించింది నెట్‌ఫ్లిక్స్.
కాంట్రవర్షియల్ డైరెక్టర్..
‘అన్నపూర్ణి’ వివాదంపై దర్శకుడు గానీ, నయనతార గానీ ఇప్పటివరకు స్పందించడానికి ముందుకు రాలేదు. కేవలం నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ మాత్రమే అందరి ముందుకు వచ్చి క్షమాపణ చెప్పింది. ఇక ఇతర ఫిల్మ్ మేకర్స్ కూడా ఈ వివాదంపై స్పందించాలని అనుకోలేదు. ఇంతలోనే అమీర్ సుల్తాన్ చేసిన స్టేట్‌మెంట్ వివాదాన్ని మరింత పెద్దగా చేసేలా ఉంది. మధ్యలోకి రజనీకాంత్ పేరును తీసుకురావడంతో తన ఫ్యాన్స్ కచ్చితంగా రియాక్ట్ అవుతారని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక కాంట్రవర్షియల్ చిత్రాలను తెరకెక్కించే అమీర్ సుల్తాన్.. ఇంతకు ముందు కూడా పలు వివాదాల్లో ఇలాంటి కాంట్రవర్షియల్ స్టేట్‌మెంట్స్ చేశారు. మరి ఇప్పుడు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
Also Read: 'యాత్ర 2'లో వైఎస్ షర్మిల - అన్నయ్య సినిమాలో చెల్లికి చోటు లేదా?