అన్వేషించండి

Anjali: ప్రపోజ్ చేశాడని రాఖీ కట్టేశాను, ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా ఉంటాయి - అంజలి

Anjali: అంజలి.. కొన్నాళ్ల క్రితం పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తను ప్రొఫెషనల్‌గా బాధపడిన సందర్భం గురించి బయటపెట్టింది. అంతే కాకుండా తను సెన్సిటివ్ అని, ఒక విషయం వల్ల చాలా హర్ట్ అయ్యానని చెప్పుకొచ్చింది.

Actress Anjali: సినీ పరిశ్రమలో రూమర్స్ అనేవి చాలా కామన్. కానీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మాత్రం ఆ రూమర్స్‌ను తట్టుకోలేక బాధపడేవాళ్లు చాలామంది ఉంటారు. అందులో తను కూడా ఒకరని ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. పర్సనల్‌గా తన జీవితంలో సంతోషించే విషయాలు పెద్దగా లేకపోయినా ప్రొఫెషనల్‌గానే సంతోషం అయినా, బాధ అయినా చూశానని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రపోజల్స్ అనేవి కూడా చాలా కామన్ అయిపోతుంటాయి. ఇక తనకు ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ వచ్చిన లవ్ ప్రపోజల్స్ గురించి, దానికి తను రియాక్ట్ అయిన తీరు గురించి కూడా ప్రేక్షకులతో పంచుకుంది ఈ తెలుగమ్మాయి.

గాలిలో తేలిపోయాను..

‘‘ప్రొఫెషనల్‌గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ అంటే లవ్ ఇన్ షాపింగ్‌మాల్ మూవీ రిలీజ్ అయ్యి ఫస్ట్ డేనే సూపర్ హిట్ టాక్ వచ్చింది. నేను గాలిలో తేలిపోయాను. ఫస్ట్ సక్సెస్ అనేది అందరికీ స్పెషలే. నా లైఫ్‌లో అది నేను మర్చిపోలేని ఒక మూమెంట్. ఇంక తమిళంలో నా డెబ్యూ మూవీకి చాలా అవార్డులు వచ్చాయి. అప్పుడు కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది’’ అంటూ ప్రొఫెషనల్‌గా తన మొదటి సక్సెస్సే మర్చిపోలేని సంతోషానిచ్చింది అని తెలిపింది అంజలి. బాధపెట్టిన విషయం ఏంటంటే రూమర్స్ అని చెప్పింది. ‘‘మొదట్లో మనకు రూమర్స్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు, వాటిని సీరియస్‌గా తీసుకుంటాం’’ అంటూ అప్పట్లో తను రూమర్స్ గురించి ఫీల్ అయిన సందర్భాలను గుర్తుచేసుకుంది.

చాలా సెన్సిటివ్..

‘‘మొదట్లో నేను కూడా రూమర్స్‌ను చాలా సీరియస్‌గా తీసుకునేదాన్ని. కొన్నిరోజుల పాటు అది ఆలోచిస్తూ ఉండేదాన్ని. అలా ఎలా రాశారు నా గురించి, నన్ను అడిగితే నేను చెప్పేదాన్ని కదా అని అనుకునేదాన్ని. వాళ్లు మనల్ని అడిగి రాస్తే న్యూస్, అడగకుండా రాస్తే రూమర్స్ అని అప్పట్లో నాకు తెలియదు. అప్పుడు నేను చాలా హర్ట్ అయ్యాను. ఇప్పుడు అలవాటు అయిపోయింది. నేను చాలా సెన్సిటివ్. ఎక్కువ హర్ట్ అయిపోతాను. అప్పట్లో నాపై మొదటి రూమర్ వచ్చినప్పుడు బాగా హర్ట్ అయ్యాను’’ అని చెప్పుకొచ్చింది అంజలి. ఇక తను స్కూల్ చదువుతున్న రోజుల్లోనే తనకు వచ్చిన ప్రపోజల్‌కు సంబంధించి ఒక ఫన్నీ సందర్భాన్ని బయటపెట్టింది.

రాఖీ కట్టేశాను..

‘‘అది చాలా చిన్న వయసు. స్కూల్‌లో 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తూనే ఉంటే 10వ తరగతిలో రాఖీ కట్టేశాను. తను మాత్రం అన్నయ్య కాదు కన్నయ్య అని చెప్పి రాఖీ తీసి పడేసి వెళ్లిపోయాడు. తను అసలు దాని గురించి కేర్ చేయలేదు. దాని తర్వాత తనను నేనెప్పుడూ చూడలేదు’’ అని గుర్తుచేసుకుంది అంజలి. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ప్రపోజల్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఇండస్ట్రీలో వచ్చాక కూడా ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ ఏవీ సీరియస్ కాదు. ఫ్యాన్స్ ఎక్కువగా ఎమోషనల్‌గా ప్రపోజ్ చేస్తుంటారు. తమిళంలో షూటింగ్ స్పాట్స్‌కు వెళ్లినప్పుడు అలా నేను చాలా రిసీవ్ చేసుకున్నాను’’ అని తెలిపింది అంజలి.

Also Read: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్

టాప్ హెడ్ లైన్స్

Anna Lezhneva : పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
Anupama Parameswaran : నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
Korean Kanakaraju Trailer : అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
Lenin OTT : ఓటీటీలోకి అఖిల్ అక్కినేని కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి అఖిల్ అక్కినేని కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget