అన్వేషించండి

Chuttamalle Song: ‘దేవర’ పాట కాపీనా? అనిరుధ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ - ఒరిజినల్ సాంగ్ అదేనంటూ ట్రోల్స్

Devara Second Single: ‘దేవర’ మూవీ నుండి రెండో పాట విడుదలయ్యింది. ‘చుట్టమల్లే’ అంటూ సాగే ఈ పాటను కొంతమంది మ్యూజిక్ లవర్స్ ఎంజాయ్ చేస్తుండగా మరికొందరు మాత్రం ఇందులోని ఓ తప్పును వెతికారు.

Chuttamalle Song From Devara: ఈరోజుల్లో ఒక తెలుగు సినిమాలోని సీన్.. వేరే సినిమాలోని సీన్‌తో కాస్త పోలిక ఉన్నా చాలు.. అది కాపీ అంటూ సోషల్ మీడియాలో మేకర్స్‌పై మీమ్స్, ట్రోల్స్ వచ్చేస్తున్నాయి. సీన్ మాత్రమే కాదు.. పాటలు కూడా అంతే. అందుకే దర్శకుల కంటే మ్యూజిక్ డైరెక్టర్స్‌పైనే ఎక్కువగా ట్రోల్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మ్యూజిక్‌లో లోపాలను వెతికి ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్‌పైన అయితే మీమ్స్ క్రియేట్ చేస్తారు కంటెంట్ క్రియేటర్స్. ఇప్పుడు అనిరుధ్ రవిచందర్‌పై కూడా అలాంటి ట్రోల్సే వస్తున్నాయి. ‘దేవర’లో రెండో పాట విడుదల అవ్వగానే ఆ ట్యూన్ తనది కాదని డిసైడ్ చేసేస్తున్నారు.

గంటల్లోనే వైరల్..

కొరటాల శివ, ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ‘ఫియర్ సాంగ్’ విడుదలయ్యి మాస్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు యూత్ కోసం రెండో పాటను విడుదల చేశారు. ఎన్‌టీఆర్, జాన్వీ కపూర్ మధ్య సాగే రొమాంటిక్ సాంగ్ ఇది. ‘చుట్టుమల్లే’ పాట విడుదల అవ్వగానే చాలామంది మ్యూజిక్ లవర్స్ దీనిని విపరీతంగా ఎంజాయ్ చేశారు. కొన్ని గంటల్లోనే మిలియన్స్ వ్యూస్, లైక్స్ వచ్చాయి. కానీ కొందరు మాత్రం ఈ పాటను ఎక్కడో విన్నట్టు ఉందే అంటూ వేరే పాటతో పోలుస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

ఆ పాటతో పోలికలు..

ఒకప్పుడు యూట్యూబ్‌లో శ్రీలంకకు చెందిన సిన్హాలా లాంగ్వేజ్‌లో విడుదలయిన ఒక పాట విపరీతంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే ‘మనికే మగే హితే’. ఆ పాటతో పాటు పాడిన సింగర్ కూడా చాలా ఫేమస్ అయిపోయింది. కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ పాటే వినిపించింది. దానిపై పాపులర్ సెలబ్రిటీలు సైతం రీల్స్ చేశారు. ఇక ‘దేవర’ నుంచి తాజాగా విడుదలయిన ‘చుట్టమల్లే’ పాట కూడా ‘మనికే మగే హితే’ పాటలాగానే ఉందంటూ మీమ్స్ వస్తున్నాయి. ట్యూన్ కూడా అంతా సేమ్ ఉందంటూ కొందరు అనిరుధ్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

ఆ సినిమాకు కూడా..

మామూలుగా ఇతర సంగీత దర్శకులతో పోలిస్తే అనిరుధ్ రవిచందర్‌పై అంతగా ట్రోల్స్ రావు. కానీ ఎప్పుడో ఒకసారి ట్యూన్స్‌ను కాస్త ఇన్‌స్పైర్ అవుతూ తాను కూడా ట్రోల్ కంటెంట్ అవుతాడు. ఇంతకు ముందు తను సంగీతం అందించిన ‘విక్రమ్’ మూవీపై కూడా ఇలాగే ట్రోల్స్ వచ్చాయి. లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించిన ‘విక్రమ్’కు అనిరుధ్ అందించిన సంగీతం హైలెట్ అని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ కొన్నాళ్ల తర్వాత అందులోని మ్యూజిక్, ఒక ఫారిన్ ఆల్బమ్‌లోని మ్యూజిక్ ఒకేలా ఉందని బయటపడడంతో అనిరుధ్‌పై ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు ‘దేవర’ పాటతో మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నాడు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్.

Also Read: 'దేవర' సెకండ్‌ సింగిల్‌ వచ్చేసింది - ఎన్టీఆర్‌, జాన్వీల రొమాన్స్‌ మామూలుగా లేదుగా, ఆకట్టుకుంటున్న సాంగ్

టాప్ హెడ్ లైన్స్

Agadha Trailer Review : అగధ అంటే ఏంటో తెలుసా? - ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ
అగధ అంటే ఏంటో తెలుసా? - ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ
Nithiin Nani : హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
This Week OTT Movies : లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్
లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్
This Week Theatrical Movies : ఈ వారం థియేట్రికల్ రిలీజెస్ - మెగా ప్రిన్స్ మూవీతో పాటు రొమాంటిక్ డ్రామా... ఒక్క రోజే 8 సినిమాలు
ఈ వారం థియేట్రికల్ రిలీజెస్ - మెగా ప్రిన్స్ మూవీతో పాటు రొమాంటిక్ డ్రామా... ఒక్క రోజే 8 సినిమాలు

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Nithiin Nani : హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Embed widget