Anil Sunkara: నన్ను ఇబ్బందిపెట్టగలరు కానీ భయపెట్టలేరు - నిర్మాత అనిల్ సుంకర కౌంటర్
Ooru Peru Bhairavakona: ‘ఊరు పేరు భైరవకోన’ ను నిర్మాతగా వ్యవహరించారు అనిల్ సుంకర. ఆయన ముందు సినిమాలను దృష్టిలో పెట్టుకొని కొందరు ఈ సినిమా రిలీజ్‌కు ఇబ్బందులు కలిగిస్తున్నవారికి ఆయన కౌంటర్ ఇచ్చారు.
Ooru Peru Bhairavakona Producer Anil Sunkara: యంగ్ హీరో సందీప్ కిషన్ ఎక్కువగా డిఫరెంట్ కథలతోనే హిట్లు కొట్టే ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ అదే క్రమంలో చాలా ఫ్లాపులను ఎదుర్కున్నాడు. ఫైనల్‌గా ‘ఊరు పేరు భైరవకోన’తో క్లీన్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ అందుకోవడం మొదలుపెట్టింది. కానీ ఈ మూవీ విడుదలకు ముందు ఎన్నో కష్టాలను ఎదుర్కుంది. ముందుగా ‘ఊరు పేరు భైరవకోన’కు రిలీజ్ డేట్ కష్టాలు వచ్చాయి. ఆ తర్వాత దీనికి లీగల్ కష్టాలు ఎదురయ్యాయి. ఫైనల్‌గా మూవీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ అందుకోవడంతో నిర్మాత అనిల్ సుంకర ఈ కష్టాలపై స్పందించారు.
వరుసగా కేసులు..
సెన్సార్ సెర్టిఫికెట్ లేకుండానే ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాకు ప్రీమియర్ షోలను ఏర్పాటు చేశారని, అందుకే షోలను వెంటనే నిలిపివేయాలని సినిమాపై కోర్టులో కేసు ఫైల్ అయ్యింది. అంతే కాకుండా ‘ఏజెంట్’ సినిమా సమయంలో నష్టాలు రావడంతో ‘ఊరు పేరు భైరవకోన’ ప్రసార హక్కులకు సంబంధించి ఒక అగ్రిమెంట్ చేసుకున్నామని, ఆ అగ్రిమెంట్‌ను నిర్మాత ఫాలో అవ్వలేదని ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా కోర్టుకెక్కారు. ఇన్ని కష్టాలను దాటి ‘ఊరు పేరు భైరవకోన’ ప్రేక్షకుల ముందుకు రావడంతో మూవీ టీమ్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. వీటిపై ఫైనల్‌గా నిర్మాత అనిల్ సుంకర స్పందించారు కూడా.
డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు..
‘‘నా నుండి సినిమా కొన్న ఒకరు నష్టపోయారు. అదంతా ఇంకా నా మైండ్‌లో ఉంది. ఎన్‌ఆర్ఏ (నాన్ రిఫండెబుల్ అడ్వాన్స్) ప్రకారం వారు సినిమాను కొన్నారు. దీన్ని బట్టి నేను డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మానవత్వంతో ఆలోచించి సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. ప్రతీ బిజినెస్‌లో లాభం, నష్టం అనేవి కామన్. లాభాలు వచ్చినప్పుడు నాదే మొత్తం అంటూ వెనకేసుకొని, నష్టం వచ్చినప్పుడు వేరే వారిపై తోసేయడం కరెక్ట్ కాదు. మీరు నన్ను ఇలాంటి కేసులతో ఇబ్బందిపెట్టవచ్చు. కానీ భయపెట్టలేరు’’ అని కేసులు పెడుతున్న వారిపై ఫైర్ అయ్యారు అనిల్ సుంకర.
‘ఏజెంట్’ వల్లే..
అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘ఏజెంట్’ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు అనిల్ సుంకర. కానీ ఆ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో దానికి కనీసం కలెక్షన్స్ కూడా రాలేదు. సినిమాపై వస్తున్న విమర్శలకు కూడా అప్పట్లో అనిల్ సుంకర స్పందించారు. సరైన స్క్రిప్ట్ లేకుండా ‘ఏజెంట్’ను ప్రారంభించడం వల్లే ఇలా జరిగిందని, తప్పంతా మేకర్స్‌దే అని ఒప్పుకున్నారు. ఇక ‘ఏజెంట్’ తర్వాత నిర్మిస్తున్న చిత్రం కావడంతో చాలామంది ‘ఊరు పేరు భైరవకోన’ను టార్గెట్ చేశారు. అయినా ఎన్నో కష్టాలను దాటుకుంటూ ఫిబ్రవరీ 16న విడుదలయిన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటోంది.
Also Read: ఊరు పేరు భైరవకోన రివ్యూ: వరుస ఫ్లాపుల తర్వాత సందీప్ కిషన్‌కు హిట్ వచ్చేనా? సినిమా ఎలా ఉందంటే?