అన్వేషించండి

Anasuya Bharadwaj : 'హీరోలందరూ లైన్ వెయ్యడానికే అప్రోచ్ అవుతారని అనుకునేదాన్ని'

'అత్తారింటికి దారేది' సినిమాలో ఐటెం సాంగ్ రిజెక్ట్ చేయడం గురించి, 'ఆర్య 2' ఆఫర్​కి నో చెప్పడం గురించి యాంకర్ అనసూయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.

యాంకర్​గా కెరీర్ ప్రారంభించిన అందాల భామ అనసూయ భరద్వాజ్.. ప్రస్తుతం నటిగా బిజీగా మారిపోయింది. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులని అలరిస్తోంది. నిజానికి అనసూయ 2003లోనే 'నాగ' మూవీతోనే తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద కనిపించలేదు. కొన్నేళ్ల తర్వాత 'జబర్దస్త్' కామెడీ షోతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. మళ్లీ ఇప్పుడు వరుస సినిమాల్లో వెండితెర మీద రాణిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తిరమైన విషయాలను పంచుకుంది.

'నాగ' మూవీలో జూనియర్ ఆర్టిస్ట్ గా నటించి చాలా స్ట్రగుల్ అయిన తర్వాత జబర్దస్త్ షో ద్వారా తనకు బ్రేక్ వచ్చిందని చాలా మంది అనుకుంటున్నారని, అది నిజం కాదని అనసూయ తెలిపింది. దేవుడి దయ వల్ల ఎప్పుడూ స్ట్రగుల్ అవ్వలేదని, సినిమా చూడటానికి వెళ్తే అనుకోకుండా సినిమాలో నటించే అవకాశం వచ్చిందని, తనొక యాక్సిడెంటల్ యాక్టర్ అని చెప్పింది. ఇంట్లో తన తండ్రి చాలా స్ట్రిక్ట్ అని, సినిమాలు చూడటానికి కూడా ఇష్టపడరని, థియేటర్ కు వెళ్లనిచ్చేవారు కాదని, సమ్మర్ హాలిడేస్ లో మాత్రమే కేబుల్ కనెక్షన్ పెట్టించేవారని తెలిపింది.

"ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కాలేజీ బంక్ కొట్టి సికింద్రాబాద్ లోని ఒక థియేటర్ కు వెళ్ళినప్పుడు అక్కడ 'నాగ' షూటింగ్ జరుగుతోంది. సినిమాలో నటిస్తే 450 రూపాయలు ఇస్తామన్నారు. నేను ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు పెట్టే ఇడ్లీ, వడకు పడిపోయాను. తారక్, సునీల్ కాంబినేషన్​లో జరిగే సీన్ లో నటించాను. నేను వాళ్ళ వెనుక నిలబడి ఉంటాను" అని అనసూయ తెలిపింది. 'నాగ' సినిమాలో నటించినందుకు తనకు వచ్చిన 450 రూపాయలను తన తల్లికి ఇచ్చినట్లు చెప్పింది. 

Also Read: 'ఇలాంటి వాళ్లే రేపు రేపిస్ట్​లు అవుతారు'.. అనసూయ షాకింగ్ కామెంట్స్!

ఎంబీఏ పూర్తి చేసి జాబ్ చేస్తున్న టైంలో మూవీ ఆఫర్స్ వచ్చినా తిరస్కరించినట్లు అనసూయ వెల్లడించింది. అప్పుడే డైరెక్టర్ సుకుమార్ 'ఆర్య 2' సినిమాలో నటించమని అడిగితే నో చెప్పానని, ఇప్పటికీ ఆయన ఈ విషయాన్ని గుర్తు చేస్తుంటారని చెప్పింది. ఎంగేజ్మెంట్ తర్వాత సాక్షిలో న్యూస్ ప్రెజెంటర్​గా జాయిన్ అయ్యానని తెలిపింది. 'క్షణం' తను ఫస్ట్ సైన్ చేసిన ప్రాజెక్ట్ అని, 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా ముందు రిలీజ్ అయిందని చెప్పుకొచ్చింది. 

"నేను 2013లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్​తో యూఎస్ టూర్ చేశాను, ఆ టైమ్​లో అడివి శేష్ నన్ను అప్రోచ్ అయ్యాడు. హీరోలు అందరూ లైన్ వెయ్యడానికి అప్రోచ్ అవుతారు అనుకొని నేను శేష్​ని తెగ అవైడ్ చేసేసాను" అని అనసూయ భరద్వాజ్ తెలిపింది. మూడు నెలల తర్వాత అనుకోకుండా ఒక కాఫీ షాప్​లో శేష్​ను కలిస్తే, 'క్షణం' స్టోరీ నేరేట్ చేసినట్లుగా చెప్పింది.

'అత్తారింటికి దారేది' సినిమాలో స్పెషల్ సాంగ్ రిజెక్ట్ చేయడానికి గల కారణాలు కూడా అనసూయ వివరించింది. గుంపులో ఒకరిగా తను హైలైట్ అవ్వని సాంగ్​లో చెయ్యకూడదని అనుకున్నాని, అందుకే తిరస్కరించానని చెప్పింది. ఆ సమయంలో తాను 6 నెలల గర్భవతినని తెలిపింది. ఇంకా ఆమె మాట్లాడుతూ తాను పుట్టింది 1985 లో అయితే దాన్ని కాస్తా వికీపీడియాలో 1975 అని మార్చేస్తున్నారని, తన భర్త పేరు తీసేసి ఎవరో పేరు పెడుతున్నారని అనసూయ చెప్పుకొచ్చింది. 

కాగా, 'సోగ్గాడే చిన్నినాయనా' 'క్షణం' సినిమాల తర్వాత 'రంగస్థలం' లో రంగమ్మత్త పాత్ర అనసూయకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 'భీష్మ పర్వం' మూవీతో మలయాళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఆమె, 'పుష్ప' చిత్రంతో పాన్ ఇండియా దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఫ్లాష్ బ్యాక్ అనే తమిళ మూవీతో పాటుగా 'పుష్ప 2' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.

Also Read: KH 234 - ఇంట్రెస్టింగ్ టైటిల్​తో వస్తోన్న ఇద్దరు దిగ్గజాలు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget