'పెదకాపు'లో నా క్యారెక్టర్ చూసి ఇక ఆపు తల్లీ అంటారు, ఆ విషయాలు ఇక్కడ వద్దు: అనసూయ
'పెదకాపు' చిత్ర ట్రైలర్ లాంచ్ సందర్భంగా మూవీ టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో అనసూయ రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'విరాట్ కర్ణ' హీరోగా వెండితెరకి పరిచయం అవుతూ తెరకెక్కిన తాజా చిత్రం 'పెదకాపు'. 'జయ జానకి నాయక', 'అఖండ' వంటి సక్సెస్ఫుల్ సినిమాలను నిర్మించిన ద్వారకా క్రియేషన్స్ అధినేత నిర్మాత రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ సామాజిక వర్గానికి సంబంధించిన టైటిల్ ని తన సినిమాకు పెట్టి సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశారు.
ట్రైలర్ లాంచ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో హీరో హీరోయిన్ తో పాటు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, అనసూయ భరద్వాజ్ పాల్గొన్నారు. సినిమాలో అనసూయ ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో అనసూయ రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
తన క్యారెక్టర్ గురించి అనసూయ మాట్లాడుతూ.. "నేను ఏ సినిమాలో క్యారెక్టర్ చేసిన నేను నా ఆడియన్స్ ని బోర్ కొట్టించకూడదు. డిసప్పాయింట్ చేయకూడదు. ఆడియన్స్ లో నేను ఉండాలి. నన్ను నేను చూసుకోకుండా పాత్రను చూసుకునేలా ఉండాలి. ప్రతిసారి నాకు అలానే జరిగింది. రంగస్థలం చేసినా కూడా అంతే. సినిమాలో అత్తా అని పిలిపించొద్దు, కావాలంటే అక్కా అని పిలిపించండి. లేకుంటే రంగమ్మా అని పిలిపించండి అని.. ఎందుకంటే చాలా మంది మీడియా వాళ్ళు వేరే విధంగా రాస్తుంటారు. ఆ టైంలో నాకు మదర్ క్యారెక్టర్స్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడే యాక్టర్ గా చేస్తున్నప్పుడు నా భయాలు నాకు ఉండేవి. కానీ నేను డబ్బింగ్ థియేటర్లో డబ్బింగ్ చెబుతున్నప్పుడు నాకు అనసూయ కనిపించలేదు. అక్కడ రంగస్థలం, ఊరు, పాత్రలే కనిపించాయి. అలాగే ఈ సినిమాలో కూడా ఈ క్యారెక్టర్ చాలా ఇష్టంతో చేశాను. మిగతావన్నీ సినిమా చూసిన తర్వాత మీరే ఇంకా ఆపు తల్లి అని మాట్లాడుతారు" అని సినిమాలో తన పాత్ర బాగుంటుందని ఈ సందర్భంగా అనసూయ చెప్పారు.
ఆ తర్వాత రిపోర్టర్ సురేష్ కొండేటి చోటా కె నాయుడుని.. ‘‘హీరోయిన్స్ అంతా మీకు ఫ్యాన్స్ అనసూయతో సహా. మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు. అది ఎలా సాధ్యమని అడిగితే?.." అది నేను వాళ్లకి ఇచ్చే రెస్పెక్ట్. పురుషుల కంటే ఆడవాళ్ళకి నేను ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాను. బేసిగ్గా నాకు మా అమ్మంటే చాలా ఇష్టం. సో మా అమ్మ లాగే ఆడపిల్లలంటే చాలా ఇష్టం" అని బదులిచ్చారు. ఆ తర్వాత ఇదే విషయాన్ని అనసూయని అడిగితే.." చోటా ఆడవాళ్లను అలాగే ట్రీట్ చేస్తారు. ప్రతి మహిళను ఆయన ఎంతో గౌరవిస్తారు. ఒకరినొకరు మెచ్చుకుంటూ ఉంటే హ్యాపీగా ఉంటాం. ఆ వాతావరణం బాగుంటుంది. అవుట్ ఫుట్ కూడా బాగా వస్తుంది" అని అనసూయ అన్నారు.' మీరు కూడా లైఫ్ లో కొంతమందిని తిడుతూ ఉంటారు, కొంతమందిని పొగుడుతూ ఉంటారు కదా? మరి తిట్టుకోవడం ఎందుకని అడిగితే.. "ఇక్కడ శ్రీకాంత్ అడ్డాల సినిమా కాబట్టి, ఇక్కడ కాకుండా వేరే సినిమాకి మనం అలా మాట్లాడుకుందాం. ఇప్పుడు దీని గురించి మాత్రమే మాట్లాడదాం" అంటూ సమాధానం ఇచ్చింది అనసూయ.
Also Read : నాగచైతన్య బాటలో విజయ్ దేవరకొండ - కానిస్టేబుల్‌గా రౌడీ బాయ్?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial