అన్వేషించండి

Anasuya Bharadwaj: అనసూయ సినిమాకు భారీ డిమాండ్ - బాలీవుడ్, కోలీవుడ్‌లో రీమేక్ రైట్స్ కోసం పోటీ

Ari Movie: అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో జయశంకర్ దర్శకత్వం వహించిన చిత్రమే ‘అరి’. కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ రీమేక్ రైట్స్ కోసం బాలీవుడ్, కోలీవుడ్ స్టార్లు పోటీపడుతున్నట్టు సమాచారం.

Ari Movie: సినిమాలో కంటెంట్ ఉంటే చాలు.. అది తక్కువ బడ్జెట్ చిత్రమైనా కూడా దానిని రీమేక్ చేయడానికి ఇతర భాషల స్టార్లు ముందుకు వస్తారు. ప్రస్తుతం అనసూయ లీడ్ రోల్‌లో నటిస్తున్న మూవీకి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. యాంకర్ నుండి యాక్టర్‌గా మారిన అనసూయ చేతిలో పలు సినిమాలు ఉండగా.. అందులో ‘అరి’ (Ari) కూడా ఒకటి. ఈ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే కోలీవుడ్, బాలీవుడ్ నుండి దీని రీమేక్ కోసం పోటీ మొదలయ్యిందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే దీని రీమేక్ రైట్స్‌ కోసం ఒక బాలీవుడ్ స్టార్ లైన్‌లో ఉండగా.. తాజాగా ఒక కోలీవుడ్ హీరో కూడా ఇందులో యాడ్ అయ్యాడని సమాచారం.

కోరికలు తీరడం కోసం..

షడ్రుచులు, అరిషడ్వర్గాలు అనే కొత్త రకం కాన్సెప్ట్‌తో ‘అరి’ తెరకెక్కింది. ఈ సినిమాలో వినోద్ వర్మ లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. మనుషుల్లో ఉండే లోతైన కోరికలను తీర్చే పాత్రలో వినోద్ వర్మ కనిపించనున్నాడు. ఇక కోరికలు తీరాలి అనుకునేవారు ఒక్కొక్కరుగా వచ్చి తనకు చెప్పుకుంటారు. అదే సమయంలో వారందరి చేత నేరాలకు పాల్పడేలా చేస్తాడు వినోద్ వర్మ. ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలా మలుపులు తిరుగుతాయి అనేది మిగిలిన కథ. అలా కోరిక తీరడం కోసం తన వద్దకు వచ్చే ఒక పాత్రలో అనసూయ భరద్వాజ్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదల అవ్వగా.. మూవీ రిలీజ్‌కు మాత్రం సమయం పడుతుంది. ఇంతలోనే ‘అరి’ రీమేక్ గురించి టాలీవుడ్‌లో చర్చలు మొదలయ్యాయి.

హైదరాబాద్‌కు వచ్చినప్పుడు..

‘పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించిన చిత్రమే ‘అరి’. ఈ సినిమా దాదాపు రెండేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటోంది. 2023 మార్చిలో దీని ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది. కానీ పలు కారణాల వల్ల ‘అరి’ మాత్రం ఇంకా థియేటర్లలో విడుదల అవ్వలేదు. ఇంకా విడుదల అవ్వకముందే ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం కోలీవుడ్ నుండి శివకార్తికేయన్, బాలీవుడ్ నుండి అభిషేక్ బచ్చన్ పోటీకి దిగారని సమాచారం. శివకార్తికేయన్.. తాజాగా తన మూవీ ‘అయలాన్’ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. అదే సమయంలో ఒకానొక సందర్భంలో దర్శకుడు జయశంకర్‌ను కలిశాడు. అప్పుడే ‘అరి’ గురించి తెలుసుకున్నాడు. శివకార్తికేయన్‌కు ‘అరి’ బాగా నచ్చడంతో దీని రీమేక్‌కు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

తెలుగు ప్రేక్షకుల ఎదురుచూపులు..

ఇక బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ సైతం ‘అరి’ రీమేక్ రైట్స్ కావాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ మూవీ ట్రైలర్ విడుదల అయినప్పటి నుండే ‘అరి’ రీమేక్ రైట్స్ కోసం ఎదురుచూడడం మొదలుపెట్టాడు అభిషేక్. ఇక కోలీవుడ్, బాలీవుడ్ సైతం ఎగబడుతున్న ఈ మూవీ ఎలా ఉంటుందా అని తెలుగు ప్రేక్షకులు ఎదురుచూడడం మొదలుపెట్టారు. ‘అరి’లో వినోద్ వర్మ, అనసూయతో పాటు సాయి కుమార్, వైవా హర్ష, శుభలేక సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్, సురభి ప్రభావతి కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆర్‌వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మాతలుగా ‘అరి’ తెరకెక్కింది.

Also Read: క్లైమాక్స్‌లో రియల్ జగన్ ఎంట్రీ - 'యాత్ర 2'పై ఆడియన్స్ ఏమంటున్నారంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Embed widget