Ari Movie Trailer: అనసూయ 'అరి' ట్రైలర్ వచ్చేసింది - డిఫరెంట్ సైకో మైథలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉంటుందంటే?
Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ సైకో మైథలాజికల్ థ్రిల్లర్ 'అరి' మూవీ నుంచి ట్రైలర్ వచ్చేసింది. ఈ నెల 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Anasuya Bharadwaj's Ari Movie Trailer Released: ఫేమస్ యాంకర్, హీరోయిన్ అనసూయ, సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సైకో మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ 'అరి'. దాదాపు ఏడేళ్ల క్రితమే పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ వివిధ కారణాలతో వాయిదా పడింది. ఇటీవల రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్ లేటెస్ట్‌గా ట్రైలర్ రిలీజ్ చేశారు.
అరిషడ్వర్గాలపై డిఫరెంట్ స్టోరీ
ఈ మూవీకి 'పేపర్ బాయ్' జయశంకర్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ఆయన ఎంచుకున్నారు. అరిషడ్వర్గాల అంశానికి మైథలాజికల్ టచ్ ఇస్తూ మూవీని తెరకెక్కించారు. 'అరి' అంటే శత్రువు అని అర్థం. ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుని జననం నుంచి ప్రారంభమైన ట్రైలర్ నేటి ఆధునిక సమాజంలో జరిగే దానికి టచ్ చేస్తూ ఎండ్ అవ్వడం హైప్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఓ ట్రైలర్ రిలీజ్ చేయగా తాజాగా వచ్చిన ట్రైలర్ మరింత ఆసక్తిని పెంచేసింది.
ట్రైలర్ ఎలా ఉందంటే?
'భూలోకంలో జన్మించాలన్న శ్రీకృష్ణుని సంకల్పం తెలుసుకున్న స్వర్గంలో ఆరుగురు దేవతలు తమను కూడా భూలోకం తీసుకెళ్లమని శ్రీకృష్ణుని వేడుకున్నారు. అవే అరిషడ్వర్గాలు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు.' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. 'ఇక్కడ అందరి కోరికలు తీర్చబడును' అంటూ ఓ లైబ్రేరియన్ యాడ్ ఇవ్వగా దాని ఆధారంగా చాలామంది అతన్ని కన్సల్ట్ అవుతారు. లైబ్రరీ, అక్కడ రివీల్ అయ్యే ఏడుగురి జీవితాలను ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్‌గా చూపించారు.
ప్రపంచంలో ఉండే మనుషులందరిలోనూ ఉండే అరిషడ్వర్గాలకు వారి కోర్కేలు ప్రతీకలుగా కనిపిస్తాయి. ఒకరికి భర్తను చూడాలనే కోరిక, నిధి కోసం ఒకరి కోరిక, పెళ్లి కోసం మరొకరి కోరిక, అందం కోసం ఓ అమ్మాయి కోరిక వీటన్నింటినీ సస్పెన్స్‌గా చూపించారు. అసలు అందరి కోర్కేలు తీర్చాలనుకునే బాధ్యత తీసుకున్నది ఎవరు? ఆ యాడ్ ఎందుకు వేశారు? కోర్కెలు తీర్చాలంటూ తన వద్దకు వచ్చిన వారికి సదరు వ్యక్తి ఇచ్చే టాస్కులు ఏంటి? అరిషడ్వర్గాలకు వీరికి సంబంధం ఏంటి? ఇందులో అనసూయ పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
Also Read: రష్మికతో ఎంగేజ్మెంట్ వార్తలు! - ఫస్ట్ టైం ఆ ఆలయానికి విజయ్ దేవరకొండ
రిలీజ్ ఎప్పుడంటే?
దసరా సందర్భంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ నెల 10న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అనసూయతో పాటు సీనియర్ హీరో సాయికుమార్, వినోద్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాసరెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, అక్షయా శెట్టి, రిధిమా పండిట్, వాసు ఇంటూరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్వీ రెడ్డి సినిమాస్ బ్యానర్‌పై రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు, శేషు మారంరెడ్డి సంయుక్తంగా మూవీని నిర్మించారు. ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ చేయడానికి ముందే పలు అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శించగా 25 అవార్డులు వరించాయి. పలువురు రాజకీయ సినీ ప్రముఖులు, పీఠాధిపతులు మూవీని చూసి ప్రశంసించారు.






















