అన్వేషించండి

Furiosa: ‘మ్యాడ్ మ్యాక్స్’ ఫ్రాంచైజ్ నుంచి మరో సినిమా - ఆ 15 నిమిషాల సీన్ కోసం 78 రోజులు షూటింగ్!

Furiosa A Mad Max Saga: ‘మ్యాడ్ మ్యాక్స్’ ఫ్రాంచైజ్‌కు చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఇందులో అయిదో మూవీగా తెరకెక్కింది ‘ఫ్యూరియోసా’. ఇందులో ఒక సీన్.. సినిమా మొత్తానికే హైలెట్ కానుందని మేకర్స్ చెప్తున్నారు.

Furiosa A Mad Max Saga: ‘మ్యాడ్ మ్యాక్స్’ మూవీ ఫ్రాంచైజ్‌కు హాలీవుడ్‌లో మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. హాలీవుడ్‌లో బెస్ట్ యాక్షన్ సినిమాలుగా సూపర్ హిట్ అందుకున్న సినిమాల్లో ‘మ్యాడ్ మ్యాక్స్’ ఫ్రాంచైజ్ కూడా ఒకటి. ఇక తాజాగా ఈ ఫ్రాంచైజ్ నుంచి అయిదో చిత్రం అయిన ‘ఫ్యూరియోసా’ విడుదలకు సిద్ధమయ్యింది. ఇప్పటికే ఈ మూవీని ప్రమోట్ చేయడానికి మేకర్స్ అంతా దీనికి సంబంధించిన విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. అదే సమయంలో ఈ సినిమాలో హైలెట్‌గా నిలిచే ఒక సీన్ కోసం 78 రోజులు షూట్ చేశారట మేకర్స్. కానీ మూవీలో ఆ సీన్ ఉండేది 15 నిమిషాలే అని చెప్తున్నారు.

మొదటిసారిగా..

హాలీవుడ్ మేకర్స్.. యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించే విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. అందుకే వారి యాక్షన్‌కు, ఫైట్స్‌కు ప్రేక్షకుల్లో సెపరేట్ క్రేజ్ ఉంటుంది. అందుకే ‘ఫ్యూరియోసా’ సినిమాలో క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కోసం 78 రోజుల పాటు 200 మంది స్టంట్ మెన్‌తో షూటింగ్ జరిపిందట మూవీ టీమ్. ఈ విషయాన్ని హీరోయిన్ అన్యా టెయిలర్ జాయ్, ప్రొడ్యూసర్ డాగ్ మిచెల్ స్వయంగా బయటపెట్టారు. ‘ఫ్యూరియోసా’ ట్రైలర్‌లో చూసిన దానికంటే సినిమాలో ఇంకా ఎక్కువే ఉంటుందని చెప్తూ.. ఈ సీక్వెన్స్ గురించి చెప్పుకొచ్చారు. ‘మ్యాడ్ మ్యాక్స్’ ఫ్రాంచైజ్‌లో అన్యా టెయిలర్ నటించడం ఇదే మొదటిసారి కావడంతో తన యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చాలా పెద్ద సీన్..

‘ఫ్యూరియోసా’లో ‘స్టెయిర్‌వే టు నోవేర్’ అనే యాక్షన్ సీక్వెన్స్ కోసం మేకర్స్ అంతా 78 రోజుల పాటు కష్టపడ్డారని చెప్పుకొచ్చింది అన్యా జాయ్. ఆ సీన్ కోసం మాత్రమే ఎందుకంతా కష్టపడుతున్నానమని దర్శకుడు జార్జ్ మిల్లర్‌తో అన్యాకు చర్చలు కూడా జరిగాయట. ‘‘ఎందుకంటే ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను ఎక్స్‌పర్ట్స్ ఎంత బాగా డిజైన్ చేశారో ప్రేక్షకులకు చూపించాలని ఫ్యూరియోసాను తాము ఎంత బాగా తెరకెక్కించామో అందరికీ తెలియడం ముఖ్యమని దర్శకుడు చెప్పారు. అంతే కాకుండా నా బలం ఏంటో కూడా ప్రేక్షకులకు చూపించాలి కదా’’ అని అన్యా టెయిలర్ జాయ్ తెలిపారు. అంత పెద్ద సీన్‌ను తన కెరీర్లోనే షూట్ చేయలేదని చెప్పింది.

ఆటోమేటిక్‌గా హైప్..

‘మ్యాడ్ మ్యాక్స్’ ఫ్రాంచైజ్‌లో ముందు వచ్చిన నాలుగు సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో ఆటోమేటిక్‌గా ‘ఫ్యూరియోసా’పై హైప్ ఏర్పడింది. ఇది మూవీ టీమ్‌కు ప్లస్ అయ్యింది. పైగా 78 రోజల పాటు 15 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ కోసం కష్టపడ్డారని తెలియగానే ఆ యాక్షన్ సీక్వెన్ ఎలా ఉంటుందో చూడాలని కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలయ్యింది. అన్యా టెయిలర్ జాయ్.. ఈ సినిమాలో యాడ్ అవ్వడం వల్ల తమకు చాలా ప్లస్ అయ్యిందని దర్శకుడు జార్జ్ మిల్లర్ తెలిపారు. తన వయసు చిన్నదే అయినా తను చాలా క్రమశిక్షణతో ఉంటుందని అన్నారు. ఇక ‘ఫ్యూరియోసా’లో అన్యా టెయిలర్ జాయ్‌కు జోడీగా క్రిస్ హెమ్స్వర్త్ నటించారు. ఈ మూవీ మే 23న ఆస్ట్రేలియాలో, మే 24న అమెరికాలో విడుదల కానుంది. ఇండియా రిలీజ్‌పై ఇంకా క్లారిటీ లేదు.

Also Read: షూటింగ్‌లో అమితాబ్‌ బచ్చన్‌తో గొడవ, స్పందించిన రామ్‌ గోపాల్‌ వర్మ - ఏమన్నారంటే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Cheapest Bikes in India: దేశంలో అత్యంత చవకైన బైక్‌లు ఇవే - బెస్ట్ మైలేజీ కూడా!
దేశంలో అత్యంత చవకైన బైక్‌లు ఇవే - బెస్ట్ మైలేజీ కూడా!
KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం, బీఆర్ఎస్ బాస్ వస్తారా?
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం, బీఆర్ఎస్ బాస్ వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడాSiraj Throw ball to Marnus Labuschagne | లబుషేన్ పై బాల్ గిరాటేసిన సిరాజ్ | ABP DesamAus vs Ind 2nd Test Day 1 Highlights | రెండో టెస్టులో టీమిండియాను ఆడేసుకుంటున్న ఆస్ట్రేలియా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Cheapest Bikes in India: దేశంలో అత్యంత చవకైన బైక్‌లు ఇవే - బెస్ట్ మైలేజీ కూడా!
దేశంలో అత్యంత చవకైన బైక్‌లు ఇవే - బెస్ట్ మైలేజీ కూడా!
KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం, బీఆర్ఎస్ బాస్ వస్తారా?
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం, బీఆర్ఎస్ బాస్ వస్తారా?
Earthquake: తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
Best Gaming Laptops: అమెజాన్‌లో మంచి డిస్కౌంట్ ఉన్న బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే - లిస్ట్‌లో హెచ్‌పీ, లెనోవో కూడా!
అమెజాన్‌లో మంచి డిస్కౌంట్ ఉన్న బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే - లిస్ట్‌లో హెచ్‌పీ, లెనోవో కూడా!
Ambulance Theft: రోగిని తరలిస్తూనే అంబులెన్స్ చోరీ - హైవేపై ఛేజ్ చేసి మరీ పట్టుకున్న పోలీసులు, వైరల్ వీడియో
రోగిని తరలిస్తూనే అంబులెన్స్ చోరీ - హైవేపై ఛేజ్ చేసి మరీ పట్టుకున్న పోలీసులు, వైరల్ వీడియో
Hyderabad:  హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో  మల్టీలెవల్ ఫ్లైఓవర్స్ - షాంఘై లుక్ వచ్చేస్తుందా ?
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మల్టీలెవల్ ఫ్లైఓవర్స్ - షాంఘై లుక్ వచ్చేస్తుందా ?
Embed widget