Amitabh Bachchan: తెలుగు ప్రేక్షకుల మధ్య కూర్చొని ‘కల్కి 2898 ఏడీ’ చూడాలని ఉంది - అమితాబ్ బచ్చన్
Amitabh Bachchan: ‘కల్కి 2898 ఏడీ’లో అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్‌ను తెగ ప్రశంసిస్తున్నారు ప్రేక్షకులు. మూవీ ఇంతలా సక్సెస్ అవ్వడంతో నాగ్ అశ్విన్, అమితాబ్ ఒక స్పెషల్ పోడ్కాస్ట్ సిద్ధం చేశారు.
Amitabh Bachchan About Kalki 2898 AD: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’.. ప్రేక్షకులను విపరీతంగా ఇంప్రెస్ చేసేస్తోంది. ఇందులో హీరోగా నటించింది ప్రభాసే అయినా.. ఈ సినిమాలో నటించిన ప్రతీ ముఖ్య పాత్ర ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇక ప్రభాస్‌తో సమానంగా అందరి దృష్టిని ఆకర్షించిన క్యారెక్టర్ అశ్వద్ధామ. ఇలాంటి ఒక కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్‌ను రంగంలోకి దించాడు నాగ్ అశ్విన్. ఈ పాత్ర ఆడియన్స్‌కు బాగా రీచ్ అయ్యింది. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్.. అమితాబ్‌ను ఇంటర్వ్యూ చేశారు.
దర్శకుడితో పోడ్కాస్ట్..
ఇప్పటికే ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్‌కు ముందు మూవీ టీమ్ అంతా కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అందులో మూవీ గురించి ఎన్నో విశేషాలను పంచుకున్నారు. సినిమా ప్రేక్షకులకు ఎక్కువగా రీచ్ అవ్వడానికి ఈ ఇంటర్వ్యూలో చాలా హెల్ప్ అయ్యింది. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ టాక్ అందుకుంది. అందుకే నాగ్ అశ్విన్, అమితాబ్ బచ్చన్ కలిసి ఒక స్పెషల్ పోడ్కాస్ట్‌లో పాల్గొన్నారు. తాజాగా ఆ పోడ్కాస్ట్‌కు సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది. అందులో అమితాబ్ చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ ఫ్యాన్స్‌ను సంతోషపెడుతున్నాయి.
ప్రశంసలు నాకు కాదు..
‘‘కల్కి 2898 ఏడీకు వస్తున్న ప్రశంసలు నాకు రావడం లేదు. అందులోని నా పాత్రకు, ఆ కాన్సెప్ట్‌కు వస్తున్నాయి’’ అని చెప్పుకొచ్చారు అమితాబ్ బచ్చన్. అసలు ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్ ఏంటని, తనకు అర్థం కావడం లేదని నాగ్ అశ్విన్‌ను అడిగారు. ‘‘ఇది మహాభారతంలో జరిగే చివరి ఘట్టం’’ అని క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ‘‘నువ్వు అసలు దీపికా పదుకొనే పాత్ర గురించి ఎలా ఆలోచించావు, దాని గురించి నీకు ఎలా ఐడియా వచ్చింది. అది కథలో నువ్వు ఊహించుకున్న విషయమా’’ అంటూ సుమతి క్యారెక్టర్‌ను ఉద్దేశించి అడిగారు అమితాబ్ బచ్చన్.
View this post on Instagram
హైదరాబాద్‌లో చూడాలి..
‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకొనె నిప్పుల్లో నడుచుకుంటూ వెళ్లే సీన్ గురించి గుర్తుచేసుకున్నారు అమితాబ్ బచ్చన్. ‘‘తరువాతి అవతారం తనలో ఉంచుకున్న ఆ మనిషి అగ్నిపరీక్షలోకి వెళ్తుంది. అందులో సుమతి.. నిప్పుల మధ్య నుండి నడవడం చూపించావు. కానీ తనకు ఏమీ జరగదు. దీని గురించి కొంతమంది యువతను ఎంపిక చేసుకొని కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పాలి. సినిమా ఎలా ఉంది భయ్యా అని అడగాలి. వాళ్లు బాగుంది అని చెప్తారా, నాకేం అర్థం కాలేదు అని చెప్తారా చూడాలి. హైదరాబాద్‌లో తెలుగు ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడాలని ఉంది. ఎందుకంటే వాళ్లు సినిమా చూసి పిచ్చెక్కిపోయుంటారు’’ అని తన కోరికను బయటపెట్టారు అమితాబ్.
Also Read: 'కల్కి 2898 AD' మూవీపై మహేష్ బాబు లేట్ రివ్యూ - ప్రతి ఫ్రేం కళాఖండం, నాగ్ అశ్విన్ రిప్లై చూశారా?