అన్వేషించండి

Kantara Chapter 1 Review : 'కాంతార చాప్టర్ 1' ఓ అద్భుతం - రిషబ్ శెట్టి టీంపై అల్లు అర్జున్ ప్రశంసలు

Allu Arjun: రిషబ్ శెట్టి 'కాంతార చాప్టర్ 1' మూవీపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. గురువారం రాత్రి మూవీ చూశానని అద్భుతంగా ఉందంటూ మూవీ టీంను అభినందించారు.

Allu Arjun Review On Kantara Chapter 1: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి రీసెంట్ మూవీ 'కాంతార చాప్టర్ 1' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెెలిసిందే. రిషబ్ మూవీలో హీరోగా నటిస్తూనే దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. సెలబ్రిటీల నుంచి క్రిటిక్స్ వరకూ అందరూ సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజాగా... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీని చూసి టీంను అప్రిషియేట్ చేశారు.

అద్భుతమైన సినిమా

'కాంతార చాప్టర్ 1' అద్భుతమైన సినిమా అని అల్లు అర్జున్ ప్రశంసించారు. 'గురువారం రాత్రి కాంతార చాప్టర్ 1 చూశాను. వావ్, ఎంత అద్భుతమైన సినిమా. దాన్ని చూస్తూ నేను ఒకింత అయోమయంలో ఉన్నాను. రచయిత, దర్శకుడు, నటుడిగా వన్ మ్యాన్ షో చేసినందుకు రిషబ్ గారికి అభినందనలు. ఆయన ప్రతీ క్రాఫ్ట్‌లోనూ రాణించారు. రుక్మిణీ వసంత్ నటన అద్భుతం. జయరాం, గుల్షన్ దేవయ్య, ఇతర టెక్నికల్ టీం వర్క్ సూపర్‌గా ఉంది.

ముఖ్యంగా అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్, అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ, ధరణి గంగే ఆర్ట్ డైరెక్షన్, అర్జున్ రాజ్ స్టంట్స్, ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదూర్ ఇలా టీం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు. నిజానికి ఆ ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే మాటలు సరిపోవు.' అంటూ 'X'లో రాసుకొచ్చారు.

Also Read : ఓటీటీలోకి 'కొత్త లోక: చాప్టర్ 1' - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది... ఎప్పటి నుంచో తెలుసా?

అక్టోబర్ 2న పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన మూవీ రూ.1000 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ రూ.818 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఒక్క తెలుగు వెర్షనే రూ.100 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఈ ఏడాది అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసినట్లు మూవీ టీం వెల్లడించింది. ఇక ఇంగ్లీష్‌లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్ 2 గంటల 14 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. 

మూవీలో రిషబ్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే జయరాం, గుల్షన్ దేవయ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిిరంగదూర్ ప్రొడ్యూస్ చేయగా... అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Raaka Update : అల్లు అర్జున్ రాకా నుంచి సీక్రెట్ పోస్టర్ - 37 డీకోడ్ చేస్తే...
అల్లు అర్జున్ రాకా నుంచి సీక్రెట్ పోస్టర్ - 37 డీకోడ్ చేస్తే...
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఇరుముడి To తుడక్కమ్... ఒకే రోజు 12 సినిమాలు స్ట్రీమింగ్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - బ్లాక్ బస్టర్ ఇరుముడి To తుడక్కమ్... ఒకే రోజు 12 సినిమాలు స్ట్రీమింగ్
Tholubommalu Series OTT : ఓటీటీలోకి వచ్చేసిన జెన్ జీ యూత్ డ్రామా సిరీస్ తోలుబొమ్మలు - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన జెన్ జీ యూత్ డ్రామా సిరీస్ తోలుబొమ్మలు - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Aakasamlo Oka Tara Release Date : దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal: అస్సలాము అలైకుమ్ వీడియో రగడ - పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో పై బదిలీ వేటు!
అస్సలాము అలైకుమ్ వీడియో రగడ - పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో పై బదిలీ వేటు!
Aakasamlo Oka Tara Release Date : దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
Eshwar Sai Madhuri Rathod : ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
Russia Sanctions Bill: భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం
భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం
Ganesha Visarjan Date time 2026: గణేష్ నిమజ్జనం సెప్టెంబర్ 24 or 25? అనంత చతుర్ధశి ఎప్పుడొచ్చింది?
గణేష్ నిమజ్జనం 2026: సెప్టెంబర్ 24, 25లో ఏది సరైన తేదీ? అనంత చతుర్ధశి ఎప్పుడొచ్చింది?
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Narendra Modi birthday 2026: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం - 'సేవా పఖ్వాడా'తో దేశవ్యాప్త ఉత్సవాలు.. వికసిత్ భారత్ వైపు అడుగులు!
ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం - 'సేవా పఖ్వాడా'తో దేశవ్యాప్త ఉత్సవాలు.. వికసిత్ భారత్ వైపు అడుగులు!
AP local body elections 2026: స్థానిక పోరులో వైఎస్‌ఆర్‌సీపీ భయం - పోటీ చేయకపోతే శత్రువులే! తాడేపల్లి ఒత్తిడిపై క్యాడర్ ఆందోళన!
స్థానిక పోరులో వైఎస్‌ఆర్‌సీపీ భయం - పోటీ చేయకపోతే శత్రువులే! తాడేపల్లి ఒత్తిడిపై క్యాడర్ ఆందోళన!
Embed widget