Allu Arjun: ఏపీ రాజకీయాలపై అల్లు అర్జున్ షాకింగ్ పోస్ట్ - తన మద్దతు ఆయనకేనని వెల్లడి
Allu Arjun: ఏపీ రాజాకీయాలపై స్టార్ హీరో అల్లు అర్జున్ షాకింగ్ పోస్ట్ చేశాడు. ఈ ఎన్నికల్లో తన మద్దతు ఆయనకే అంటూ సోషల్ మీడియలో పోస్ట్ చేశాడు. దీంతో బన్నీ పోస్ట్ హాట్‌టాపిక్‌గా నిలిచింది.
Allu Arjun Shocking Post on AP Elections 2024: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈసారి ఎన్నికల ప్రచారంలో సినీ ప్రముఖుల హడావుడి కనిపిస్తుంది. దీంతో రోజురోజుకు ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టైం చూసి మెల్లిమెల్లిగా స్టార్ హీరోలు, నటులు బయటకు వస్తూ జనసేన పార్టీకే మద్దతు తెలుపుతున్నారు. మొన్నటి వరకు సినీ ఇండస్ట్రీ పెద్దలు ఎవరికి మద్దతు ఇస్తారనే అంశంపై సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలో అందరి చూపు ఏపీ రాజకీయాలపైనే పడింది.
ఈసారి వైఎస్సార్ సీపీని గెలవకుండ చేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల బరిలో దిగాయి. ఇక దీంతో ఎవరికి వారు గెలుపు తమదే అన్న ధీమాతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈసారి కూడా ఏపీ సీఎం పీఠం వైఎస్ జగన్‌దే అనే గట్టి వాదనలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ పెద్దల మద్దతు కూడా వైఎస్సార్‌సీపీకేనా? అనే సందేహం ఉండేది. కానీ, అందరి అంచనాల తలకిందులు చేస్తూ మెల్లిమెల్లిగా ఇండస్ట్రీవర్గాలు పావులు కదుపుతున్నాయి. ఒక్కొక్కరుగా బయటకు వస్తూ జనసేనకు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు మద్దతు తెలపడంతో ఏపీ రాజకీయ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుందంటున్నారు.
ఇప్పటికే మెగా హీరోలంతా పిఠాపురంలో పవన్ తరపున ప్రచారంలోకి దిగారు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్‌లు నేరుగా ప్రచారంలోకి దిగి పవన్‌కే ఓటేయాలని కోరుతున్నారు. ఇక అదను చూసి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడికే తన మద్దతు అంటూ వీడియో సందేశం ఇచ్చారు. మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా తన బాబాయ్‌కే ఓటేయండంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపు నిచ్చారు. ఇప్పుడు తాజాగా మరో మెగా హీరో పవన్‌కే తన మద్దతు అని తేల్చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సపోర్టు కూడా పవన్ కళ్యాణ్‌కే అంటూ సైలెంట్‌గా పోస్ట్ చేశారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు.
అల్లు అర్జున్ తన పోస్ట్‌లో "పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రయాణం విజయవంతంగా సాగాలని హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఎంచుకున్న మార్గం, ప్రజలకు సేవ చేయాలనే మీ నిబద్ధతకు నేను ఎంతో గర్శిస్తున్నాను. ఒక కుటుంబ సభ్యుడిగా నా మద్దతు ఎప్పుడూ మీకే ఉంటుంది. మీ ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేరాలని ఆశిస్తున్నాను" అంటూ బన్నీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అతడి పోస్ట్ హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇక మెగా హీరోలంతా జనసేనకు మద్దతుగా ముందుకు వస్తుండంటంతో ప్రతిపక్ష పార్టీలో గుబులు మొదలైందని రాజకీయా వర్గాలు చర్చించుకుంటున్నారు. ఇక మరోవైపు హీరో నాని సైతం జనసేనకు తన మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఇక జబర్దస్త్ కమెడియన్స్ అంత పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కు మద్దతు ఇస్తూ జనసేన పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. ఇలా సినీ ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా జనసేనకు సపోర్టు చేస్తూ బయటకు వస్తుండటంతో ఏపీ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి.