Allu Arjun New House: అల్లు అర్జున్ కొత్తిల్లు @ 100 కోట్లు - ఫీచర్స్ ఏమిటో తెలుసా?
Allu Arjun House Cost In Hyderabad: మెగాస్టార్ చిరంజీవి ఇంటికి దగ్గరలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఆ ఇంటి కోసం దాదాపు వంద కోట్లు అయ్యిందట. అందులో ఫీచర్స్ తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు. అదేంటి? అంత పెద్ద స్టార్ హీరోకి ఇప్పటి వరకు ఇల్లు లేదా? అని కొంత మందికి సందేహం రావచ్చు. అల్లు వారిది ఉమ్మడి కుటుంబం. ప్రముఖ నిర్మాత అయినటువంటి తండ్రి అల్లు అరవింద్, ఇంకా అన్నదమ్ములతో కలిసి ఉంటారు. ఇప్పుడు ఆయన తనకంటూ ప్రత్యేకంగా ఓ ఇల్లు కట్టుకుంటున్నారు. అదీ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి సమీపంలో! ఆ ఇంటి ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?
అల్లు అర్జున్ హౌస్ @ 100 కోట్లు!
అవును... మీరు చదివింది నిజమే! అల్లు అర్జున్ కొత్త ఇంటి కోసం అక్షరాలా వంద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. 'పుష్ప'తో ఆయనకు పాన్ ఇండియా మార్కెట్ ఏర్పడింది. ఒక్కో సినిమాకు వందల కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారు నిర్మాతలు. సో... ఇంటి కోసం వంద కోట్లు ఖర్చు చేయడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదని చెప్పాలి.
Also Read: Purple Halcyon: ఇన్‌స్టాలో సబ్‌స్క్రిప్షన్‌తో నెలకు కోటి సంపాదించిన కేరళ కుట్టి... ఇప్పుడు ఏమైందో తెలుసా?
అల్లు అర్జున్ ఇంటి విషయానికి వస్తే... నాలుగు వేల చదరపు గజాల విశాలమైన స్థలంలో నిర్మాణం జరుగుతోంది. ఇంటర్నేషనల్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మోడ్రన్ డిజైన్స్ కలబోతగా ఇల్లు నిర్మాణం చేపట్టారట.
అల్లు అర్జున్ ఇంటిలో స్పెషల్ ఫీచర్స్ ఏంటి?
అల్లు అరవింద్ తన ఇంటిలో అల్లు గార్డెన్ ఏర్పాటు చేశారు. ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. అదీ మనవళ్లు మనవరాళ్ల కోసం! ఇప్పుడు అల్లు అర్జున్ సైతం తన ఇంటిలో స్విమ్మింగ్ పూల్ ఉండేలా చూస్తున్నారు. అలాగే, ఒక ప్రైవేట్ థియేటర్, వర్కవుట్స్ చేయడం కోసం ఇంటిలో జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇంకా హై ఎండ్ సెక్యూరిటీ సిస్టమ్ వంటి స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయట. 2026 ఆఖరిలో ఆ ఇంటిలో బన్నీ అడుగు పెడతారని తెలుస్తోంది. మరోవైపు ముంబైలో బన్నీ ఓ ఇల్లు కొన్నారని వచ్చిన వార్తల్లో నిజం లేదట. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాకా' కోసం అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారట.
Before You Go
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
ట్రెండింగ్ వార్తలు






















