అన్వేషించండి

Allari Naresh: నా బ్రేకప్ స్టోరీలు నాన్నకు తెలుసు, ఆయన చనిపోయాక చాలా మారాను - ఎమోషనలైన అల్లరి నరేశ్

Allari Naresh: ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు అల్లరి నరేశ్. తాజాగా ‘ఆ ఒక్కటి అడక్కు’ ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో తన తండ్రితో ఎంత క్లోజ్‌గా ఉండేవాడో బయటపెట్టాడు.

Allari Naresh About Father EVV Satyanarayana: ఒకప్పుడు కామెడీ దర్శకుడిగా, కమర్షియల్ డైరెక్టర్‌గా ఎనలేని స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు ఈవీవీ సత్యనారాయణ. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లరి నరేశ్. తండ్రి కామెడీ సినిమాలు తెరకెక్కించడంతో ఫేమస్ అయితే... అల్లరి నరేశ్ కామెడీ సినిమాల్లో నటిస్తూ ఫేమస్ అయ్యాడు. ఇప్పటికే తను ఒక మూవీలో నటిస్తున్నాడు అంటే ప్రేక్షకులంతా తన నుండి కామెడీనే ఆశిస్తారు. అందుకే త్వరలో ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే చిత్రంతో రానున్నాడు అల్లరి నరేశ్. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేశ్... తన తండ్రి గురించి గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.

చాలా మారింది..

‘‘నాన్న చనిపోయిన తర్వాత నేను చాలా డౌన్ అయిపోయాను. బయటికి వెళ్లడం, కలవడం మానేశాను. ఇదివరకు ప్రతీచోట ఉండేవాడిని. ఏదైనా పార్టీ ఉంటే వెళ్లిపోయేవాడిని. ఇప్పుడేమో ఫ్రెండ్స్ వచ్చి 'నాలుగు సంవత్సరాల నుండి పిలుస్తున్నా రావడం లేదు, తర్వాత నుండి పిలవము' అని తిడుతున్నారు. అప్పుడు నాన్న చనిపోతారని అనుకోలేదు. నాన్న ఉన్నంత వరకు తెలియలేదు... ఆ తర్వాత బాధ్యతలు అన్నీ నాపై, రాజేశ్‌ పైనే పడ్డాయి. కొన్నిరోజులు కష్టంగా గడిచింది. ఒకటిన్నర సంవత్సరం వరకు నేను సైలెంట్ అయిపోయాను. ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేయడం ప్రారంభించాను. ఇదివరకు సెట్‌లో హడావిడి, గోల చేసి అందరితో మాట్లాడేవాడిని. ఇప్పుడు ఎక్కువగా గమనించడం, వినడం మొదలుపెట్టాను’’ అంటూ తనలో వచ్చిన మార్పుల గురించి బయటపెట్టాడు అల్లరి నరేశ్.

నాన్నతో క్లోజ్..

తన తండ్రితో క్లోజ్‌గా ఉండే సందర్భాలను గుర్తుచేసుకున్నారు అల్లరి నరేశ్. ‘‘నేను ఎక్కడికి వెళ్లినా నాన్నతో చెప్పేవాడిని. కానీ ఒక్కొక్కసారి ఫ్రెండ్స్‌తో పబ్స్‌కు వెళ్తున్నామని చెప్పలేం కదా. నాన్నతో హ్యాపీగా ఉండేవాడిని. నేను ఏదైనా షేర్ చేసుకునే మనిషి ఆయనే. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, తను నన్ను రిజెక్ట్ చేసింది, ఒక అమ్మాయి నాకు లవ్ లెటర్ ఇచ్చింది, బ్రేకప్స్‌తో సహా అన్నీ ఆయనతో చెప్పుకునేవాడిని. నువ్వు నా ముందు యాక్టింగ్ చేయడం లాంటివి వద్దు, ఫ్రెండ్లీగా ఉందాం అనేవారు. తప్పు చేసినా చెప్పేయండి అని స్వేచ్ఛ ఇచ్చారు. యాక్టింగ్ చేస్తా అన్నప్పుడు కూడా ఎందుకు, వద్దు అని ఏం అనలేదు’’ అని చెప్పుకొచ్చాడు.

మల్టీ స్టారర్ చేస్తాం..

తన తండ్రిపై ఇష్టంతోనే కూతురికి ఈవిక అని పేరు పెట్టుకున్నానని చెప్పాడు అల్లరి నరేశ్. తండ్రితో ఎంత క్లోజ్‌గా ఉంటాడో, తన తల్లితో కూడా అంతే క్లోజ్‌గా ఉంటానని అన్నాడు. తన తల్లి సినిమా చూసిన తర్వాత నచ్చకపోతే మొహం మీదే చెప్పేస్తుందని, పెద్ద క్రిటిక్ అని చెప్తూ నవ్వాడు. తన అన్న ఆర్యన్ రాజేశ్ అయితే సినిమాల్లో అనుకున్నంత సక్సెస్ సాధించలేక కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా కూడా ఉన్నాడు. వారిద్దరూ కలిసి నటించే ఐడియా ఉందని తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో అల్లరి నరేశ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అన్నాదమ్ముళ్ల కథతో ఆర్యన్ రాజేశ్‌తో కలిసి మల్టీ స్టారర్ చేయాలని అనుకుంటున్నానని మనసులోని మాటను బయటపెట్టాడు.

Also Read: పెద్ద టీవీ ఛానెల్ వ్యక్తి రూమ్ బుక్ చేస్తా వచ్చేయ్ అన్నాడు, వాడికి అలా బుద్ధి చెప్పా: వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget