Alia bhatt: ఆలియా భట్ కు వేధింపులు, ఎన్నోసార్లు ఏడ్చానన్న బాలీవుడ్ బ్యూటీ
Alia bhatt: సినీతారలపై రకరకాల గాసిప్స్ వస్తుంటాయి. ఒక్కోసారి ఆ ఊహాగానాలు మరింత శృతి మించుతాయి. అలాంటి ఫేక్ ప్రచారాలతో చాలా బాధపడ్డానని వెల్లడించింది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్.
Alia bhatt About Ranbir Kapoor: సినీ తారలకు సంబంధించి చిన్న విషయాలైనా ఇట్టే వైరల్ అవుతాయి. చక్కటి నటనతో ఆకట్టుకున్నా, చెత్త సినిమాలతో డిజాస్టర్ అందుకున్నా, ప్రేమలు, బ్రేకప్ లు అన్నింటినీ ప్రేక్షకులు గమనిస్తుంటారు. చక్కటి సినిమాలతో ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు పర్సనల్ లైఫ్ కు సంబంధించి విమర్శలు వస్తుంటాయి. తాజాగా తన గురించి, తన భర్త గురించి వచ్చిన ఫేక్ వార్తల గురించి బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ స్పందించింది. తమ గురించి ఏం తెలియకుండా కొన్ని వెబ్ సైట్స్ అడ్డగోలుగా వార్తలు రాయడం పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
ఫేక్ వార్తలు చూస్తే బాధ కలుగుతుంది- ఆలియా
బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor)తో కలిసి ఆలియా భట్ ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో పాల్గొన్నది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించింది. తన పర్సనల్ లైఫ్ గురించి వచ్చిన వార్తల గురించి స్పందించింది. తమ గురించి ఏం తెలియని కొంత మంది మాట్లాడిన మాటలను తలుచుకుని కంటతడి పెట్టింది. కొద్ది కాలం క్రితం తన భర్త తనను వేధిస్తున్నాడంటూ ఫేక్ న్యూస్ పబ్లిష్ చేశారని మండిపడింది. అంతే కాదు, తాను బరువు తగ్గడం కోసం, నా స్కిన్ మరింత తెల్లగా మారడం కోసం సర్జరీలు చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయని వెల్లడించింది. ఇలాంటి వార్తలను చూసినప్పుడు బాధ కలుగుతుందని ఆలియా ఆవేదన వ్యక్తం చేసింది.
రణబీర్ (Ranbir Kapoor)ను దారుణంగా విమర్శించారు- ఆలియా
కొంతకాలం పాటు ఫేక్ వార్తలతో మానసికంగా చాలా బాధపడ్డానికి చెప్పింది ఆలియా. నెమ్మదిగా వాటిని పట్టించుకోవడం మానేసినట్లు చెప్పింది. ఇప్పుడు ఎవరు ఎన్ని మాట్లాడినా వాటి గురించి పెద్దగా ఆలోచించడం లేదన్నది. గతంలో ఓసారి నా భర్తకు లిప్ స్టిక్ నచ్చదు అని చెప్తే, కొంత మంది సోషల్ మీడియా వేదికగా నానా రచ్చ చేశారని చెప్పుకొచ్చింది. టాక్సిన్ మెన్ అంటూ రణబీర్ పై వార్తలు రాశారని వెల్లడించింది. ఆయనకు నేను నేచురల్ గా కనిపించడం ఇష్టం ఉంటుందని, అందుకే లిప్ స్టిక్ వద్దని చెప్పాడంటూ వివరించింది. రణబీర్ చాలా మంచి వ్యక్తి అని చెప్పిన ఆలియా, ఇలాంటి ప్రచారాలు తమకు ఆవేదన కలిగిస్తాయని వెల్లడించింది.
రాహ ఫోటో లీక్ అయినప్పుడు ఏడ్చా- ఆలియా
ఇక తన కూతురు రాహ గురించి చాలా విషయాలు వెల్లడించింది ఆలియా. తన చిన్నారి ఫోటో ఆన్ లైన్ లో లీక్ అయిన సందర్భంగా ఎంతో బాధపడినట్లు చెప్పుకొచ్చింది. డెలివరీ తర్వాత ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ షూటింగ్ లో పాల్గొన్నట్లు చెప్పింది. “ఆ సమయంలో ఓవైపు షూటింగ్, మరోవైపు పాపను చూసుకోవడం కష్టంగా ఉండేది. ఆ సమయంలో రణబీర్ చాలా హెల్ఫ్ చేశాడు. తనే దగ్గరుంచి పాపను చూసుకునే వాడు. ఈ షూటింగ్ టైమ్ లోనే పాప ఫోటో బయకు వచ్చింది. అప్పుడు నాకు చాలా బాధ కలిగింది. కన్నీళ్లు కూడా వచ్చాయి” అని చెప్పింది. ప్రస్తుతం ఆలియా ‘జిగ్రా’ షూటింగ్ లో బిజీగా ఉంది.
Read Also: ఆ విషయంలో సంతృప్తి లేదు - అందుకే టాలీవుడ్ కు గ్యాప్ వచ్చింది: హన్సిక