అన్వేషించండి

Shah Rukh Khan: ‘జవాన్’ ట్రైలర్‌లో ఆలియా భట్ కావాలన్నా షారుఖ్ - ఇదిగో ఆమె ఇలా స్పందించింది!

తాజాగా షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘జవాన్’ కోసం ఆలియా భట్ రిఫరెన్స్ తీసుకున్నాడు దర్శకుడు అట్లీ. అది కూడా ట్రైలర్‌లోనే ఆ రిఫరెన్స్ ఉన్నట్టుగా చూపించారు.

రోజుల్లో ఒక స్టార్ హీరో సినిమాలో మరో హీరో సినిమా రిఫరెన్స్ ఉండడం కామన్ అయిపోయింది. అలా ఉంటేనే కామన్ ఫ్యాన్స్‌లో కూడా ఒక విధమైన ఆసక్తిని క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయని మేకర్స్ భావిస్తున్నారు. తాజాగా షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘జవాన్’ కోసం ఆలియా భట్ రిఫరెన్స్ తీసుకున్నాడు దర్శకుడు అట్లీ. అది కూడా ‘జవాన్’ ట్రైలర్‌లోనే ఆ రిఫరెన్స్ ఉన్నట్టుగా చూపించారు. దీంతో ‘జవాన్’ లాంటి పాన్ ఇండియా చిత్రంలో తన పేరు ప్రస్తావించడంపై ఆలియా భట్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది.

ఈ స్నేహం ఇప్పటిది కాదు..

‘ప్రపంచం మొత్తానికి కావాల్సింది ఎస్‌ఆర్‌కే’ అంటూ షారుఖ్‌ను ట్యాగ్ చేసింది ఆలియా భట్. అంతే కాకుండా ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందని, సెప్టెంబర్ 7 అనేది చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుందని ఆలియా పోస్ట్ చేసింది. షారుఖ్, ఆలియాల స్నేహం ఇప్పటిది కాదు. వీరిద్దరు 2016లో విడుదలయిన‘డియర్ జిందగీ’ అనే చిత్రంలో కలిసి నటించారు. ఇది పూర్తిగా ఒక లేడీ ఓరియెంటెడ్ కథ అయినా కూడా ఆలియాపై ఉన్న అభిమానంతో అందులో చిన్న పాత్రను చేయడానికి షారుఖ్ ఒప్పుకున్నాడు. అప్పటినుంచి ఆలియా నటించే ప్రతీ చిత్రానికి సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు. అదే విధంగా సెప్టెంబర్ 7న విడులదవుతున్న షారుఖ్ చిత్రాన్ని సపోర్ట్ చేయడానికి ఆలియా ముందుకొచ్చింది. ఈ మూవీలో షారుఖ్‌కు జోడీగా నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. సౌత్‌లో ఎన్నో చిత్రాల్లో నటించి లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయన్‌కు హిందీలో ఇదే మొదటి చిత్రం.

అందరూ ఆశ్చర్యపోయేలా అట్లీకి అవకాశం..

మామూలుగా షారుఖ్ ఖాన్ సినిమా విడుదల అవుతుంది అనగానే ఒక రకమైన పండగ వాతావరణం అనేది బాలీవుడ్‌లో ఆటోమేటిక్‌‌గా స్టార్ట్ అవుతుంది. సినిమా పాజిటివ్ టాక్‌తో స్టార్ట్ అవ్వకపోయినా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధించే బాలీవుడ్ హీరోల్లో షారుఖ్ కూడా ఒకరు. కానీ ఈసారి పరిస్థితి అంతా వేరేలా ఉంది. షారుఖ్ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించినా.. ఎప్పుడూ సౌత్ డైరెక్టర్‌తో చేయి కలపలేదు. మొదటిసారి అట్లీ లాంటి తమిళ దర్శకుడితో తను చేస్తున్న చిత్రం ‘జవాన్’. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. అట్లీకి ఇప్పటివరకు తమిళంలో తప్పా వేరే భాషల్లో చిత్రాలను తెరకెక్కించలేదు. అంతే కాకుండా తనకు అరడజను సినిమాలను డైరెక్ట్ చేసిన అనుభవం లేదు. అయినా కూడా తనను నమ్మి అవకాశాన్ని అందించాడు షారుఖ్. ఈ బాలీవుడ్ బాద్‌షా అట్లీకి ఇచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించాడు అని చెప్పడానికి ఇటీవల విడుదలయిన ‘జవాన్’ ట్రైలరే సాక్ష్యం.

ట్రైలర్‌తో అంచనాలు ఓ రేంజ్‌లో..

‘జవాన్’ ఫస్ట్ లుక్ దగ్గర నుంచి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక తాజాగా విడుదలయిన ట్రైలర్ ఈ అంచనాలను ఒక రేంజ్‌లో తీసుకెళ్లి కూర్చోపెట్టింది. ఈ ట్రైలర్‌లో షారుఖ్ అనేక షేడ్స్‌లో, అనేక గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. కానీ ఈ ట్రైలర్‌ను బట్టి చూస్తే తండ్రి, కొడుకుల పాత్రలో షారుఖ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇక ఇందులోని ఎన్నో డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. అందులో ఒకటి ‘నాకయితే ఆలియా భట్ కావాలి’ అంటూ షారుఖ్ చెప్పే డైలాగ్ కూడా ఒకటి. ‘జవాన్’ లాంటి సినిమాలో తన రిఫరెన్స్ ఉండడంపై ఆలియా భట్ తాజాగా స్పందించింది. 

Also Read: కప్పు కాదు, మనసులు గెలుచుకున్నారు - ‘బి‌గ్ బాస్’లో ప్రేక్షకులు మెప్పు పొందిన కంటెస్టెంట్స్ వీరే!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget