అన్వేషించండి

Alekhya Chitti: పచ్చళ్ళ బిజినెస్ పెట్టక ముందూ ఇంతే... అలేఖ్య బ్లాక్ మెయిలింగ్ నేచర్ ఎక్స్‌పోజ్ చేసిన అవి ఫుడ్స్

Alekhya Chitti Pickles: కస్టమర్లను బూతులు తిట్టిన ఆడియోలు వైరల్ అయ్యాక అలేఖ్య వ్యవహార శైలిని చూసి జనాలు ఆశ్చర్యపోయారు. పచ్చళ్ల బిజినెస్ పెట్టక ముందు నుంచి ఆవిడ అంతేనని అవి ఫుడ్స్ ఓనర్ వీడియో చేశారు. 

అలేఖ్య... ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాలలో పాపులర్. ఒక్కటా రెండా... లక్షల సంఖ్యలో ఆవిడ మీద సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. వేల సంఖ్యలో ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి.‌ అలేఖ్యతో పాటు ఆవిడ అక్కచెల్లెళ్ళు సుమ, రమ్య మోక్ష సారీ చెప్పడంతో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని అందరూ భావించారు. అయితే అవి ఫుడ్స్ ఓనర్ చేసిన వీడియో కొత్త చర్చకు దారి తీసింది.

బిజినెస్ స్టార్ట్ చేయకముందు కూడా బ్లాక్ మెయిల్!
అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అలేఖ్యకు చాలా తల పొగరు పెరిగిందని సోషల్ మీడియాలో విమర్శించిన జనాల సంఖ్య తక్కువేం కాదు. అయితే ఆవిడ గురించి తమకు ఎప్పుడో తెలుసని అవి ఫుడ్స్ ఓనర్ అంటున్నారు.

అలేఖ్య చిట్టి పికిల్స్ స్టార్ట్ చేయక ముందు సోషల్ మీడియాలో సుమ కంచర్ల, అలేఖ్య చిట్టి కంచర్ల, రమ్య మోక్ష కంచర్ల సిస్టర్స్ చాలా పాపులర్. వాళ్లకు ఉన్న ఫాలోయింగ్ చూసి తమ పికిల్స్ ప్రమోట్ చేయమని అప్రోచ్ అయ్యామని...  సుమ కంచర్ల ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రమోట్ చేశారని, తమ ప్రోడక్ట్ గురించి వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారని అవి ఫుడ్స్ ఓనర్ తెలిపాడు. అలేఖ్య మాత్రం తమను చాలా ఇబ్బంది పెట్టిందన్నారు.

తమ పికిల్స్ ప్రమోట్ చేయడం కోసం అలేఖ్య మూడు వేలు అడిగితే అంత ఇవ్వలేమని చెప్పడంతో చివరకు రెండు వేల రూపాయలకు ఓకే చేసిందని, అయితే ప్రమోషనల్ వీడియోలో పది అంకెల ఫోన్ నెంబర్ బదులు 11 నెంబర్లు ఇచ్చిందని అవి ఫుడ్స్ ఓనర్ ఒక వీడియో చేశాడు. అలేఖ్యకు ప్రమోషనల్ వీడియోలో ఎడిట్స్ ఉన్నాయని చెప్పడంతో పాటు మార్పులు చేయమని అడగడంతో మరొక వెయ్యి రూపాయలు డిమాండ్ చేయడంతో తాము అంత ఇవ్వలేనని అన్నామని, తమకు ఎటువంటి ప్రమోషన్ అవసరం లేదని, వెయ్యి రూపాయలు ఇవ్వలేమని చెబితే నెగటివ్ పబ్లిసిటీ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసినట్లు అవి ఫుడ్స్ ఓనర్ చెప్పాడు. తాను చెప్పింది నిజమేనని నిరూపించడానికి అలేఖ్యతో చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్స్ కూడా వీడియోలో చూపించారు.

Also Readమంట పెట్టిన పచ్చళ్లు... అలేఖ్యపై ఎందుకంత ద్వేషం? చిట్టి పికిల్స్ కాంట్రవర్సీకి పునాది ఎక్కడ? ఆగేది ఎప్పుడు?

అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ తర్వాత జనాలు అందరికీ వాళ్ల గురించి తెలిసిందని, తనకు మాత్రం ఎప్పుడో తెలుసని అవి ఫుడ్స్ ఓనర్ ఇప్పుడు వీడియో చేయడంతో వైరల్ అవుతోంది. ఏడాది క్రితం అలేఖ్యతో జరిగిన చాటింగ్ ఇప్పుడు బయట పెట్టడానికి కారణం కేవలం ప్రస్తుతం వాళ్లలో ఉన్న నెగెటివిటీ కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుండు మీద కారం చల్లినట్లు అలేఖ్య ముందు నుంచి ఇంతేనని అవి ఫుడ్స్ ఓనర్ వీడియో చేయడం వల్ల ఆవిడ ఇమేజ్ మరింత డామేజ్ అవుతోంది.

Also Readఅలేఖ్య చిట్టి పర్సనల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కు ఏమైంది? చెల్లెలు రమ్య మోక్ష అకౌంట్‌లో ఎందుకు వీడియో పోస్ట్‌ చేశారు?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Manchu Manoj Vs Vishnu Manchu: మనుషుల్ని పంపించిన విష్ణు... దాసరి వర్ధంతి సాక్షిగా మంచు బ్రదర్స్ విబేధాలు
మనుషుల్ని పంపించిన విష్ణు... దాసరి వర్ధంతి సాక్షిగా మంచు బ్రదర్స్ విబేధాలు
Karuppu OTT : సూర్య కరుప్పు ఓటీటీ రిలీజ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
సూర్య కరుప్పు ఓటీటీ రిలీజ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Manchu Manoj Cleans Dasari Ghat: దాసరి ఘాట్ క్లీనింగ్... ఉదయం ఏడింటికి వెళ్లిన మంచు మనోజ్... దర్శకరత్నకు నివాళులు
దాసరి ఘాట్ క్లీనింగ్... ఉదయం ఏడింటికి వెళ్లిన మంచు మనోజ్... దర్శకరత్నకు నివాళులు

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Indian tourists Vietnam: రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
Actor Sathyendra Death: 60 సినిమాల్లో నటించాడు - చనిపోతే చూసేందుకు కుటుంబం కూడా రాలేదు - సత్యేంద్ర దుస్థితి ఇదే!
60 సినిమాల్లో నటించాడు - చనిపోతే చూసేందుకు కుటుంబం కూడా రాలేదు - సత్యేంద్ర దుస్థితి ఇదే!
Regional sentiment gimmicks ahead of GHMC Elections | GHMC ఎన్నికలే టార్గెట్టా? తెలంగాణ సెంటిమెంటు, సెట్లర్ ఓటు, కొత్త రాజకీయ సమీకరణాలు
GHMC ఎన్నికలే టార్గెట్టా? తెలంగాణ సెంటిమెంటు, సెట్లర్ ఓటు, కొత్త రాజకీయ సమీకరణాలు
DK Shivakumar Swearing In Ceremony:యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
Tesla Launches Y Premium Variant: టెస్లా మోడల్ వై లైనప్ లో మార్పులు: కొత్త ప్రీమియం వేరియంట్ లాంచ్.. ధర ఏకంగా రూ. 10 లక్షలకు పైగా తగ్గింపు
టెస్లా మోడల్ వై లైనప్ లో మార్పులు: కొత్త ప్రీమియం వేరియంట్ లాంచ్.. ధర ఏకంగా రూ. 10 లక్షలకు పైగా తగ్గింపు
Embed widget