Nagarjuna New Movie : అభిమానికి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తున్న అక్కినేని నాగార్జున
కింగ్ అక్కినేని నాగార్జున కొత్త కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తన అభిమాని దర్శకత్వంలో ఆయన సినిమా చేయబోతున్నారు.
కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కు వీరాభిమానులు ఎంతో మంది ఉన్నారు. అందులో దర్శకుడు చందూ మొండేటి (Chandoo Mondeti) ఒకరు. అక్కినేని వంశం మీద ఆయన తన అభిమానాన్ని పలు సందర్భాల్లో పబ్లిక్‌గా చాటుకున్నారు. ఇప్పుడు తన అభిమాన కథానాయకుడితో సినిమా చేసే అవకాశాన్ని చందూ మొండేటి అందుకున్నారు.
చైతూతో హిట్ తీసిన ట్రాక్ రికార్డ్
'కార్తికేయ' (Karthikeya Movie) తో దర్శకుడిగా పరిచయమైన చందూ మొండేటికి ఆ వెంటనే అక్కినేని హీరో నాగ చైతన్య (Naga Chaitanya) తో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. మలయాళంలో క్లాసిక్ అనిపించుకున్న 'ప్రేమమ్'ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు. అయితే... ఆ తర్వాత సొంత కథతో నాగ చైతన్యతో చేసిన స్ట్రెయిట్ తెలుగు సినిమా 'సవ్యసాచి' ఆశించిన విజయం అందుకోలేదు. చందూ మొండేటి లెక్క తప్పింది. ఫ్లాప్ అని ట్రేడ్ వర్గాలు తేల్చాయి. అయినా సరే అభిమానిపై నాగార్జున నమ్మకం ఉంచారు.
'సవ్యసాచి' ఆశించిన రిజల్ట్ అందుకోకపోయినా... చందూ మొండేటి మేకింగ్, టేకింగ్‌కు మంచి పేరు వచ్చింది. సో... కథ నచ్చడం, 'ప్రేమమ్' వంటి హిట్ ఇచ్చి ఉండటంతో చందుకు నాగార్జున ఛాన్స్ ఇస్తున్నారని ఊహించవచ్చు.
నాగార్జునతో చందూ మొండేటి పోలీస్ సినిమా!
అక్కినేని నాగార్జున కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. 'కార్తికేయ 2' (Karthikeya 2 Movie) ప్రెస్మీట్లో ఈ విషయాన్ని దర్శకుడు కన్ఫర్మ్ చేశారు. ''నేను నాగార్జున గారికి ఒక పోలీస్ కథ చెప్పాను. అది ఆయనకు నచ్చింది. మేం ఇద్దరం కలిసి త్వరలో ఒక సినిమా చేయబోతున్నాం'' అని చందూ మొండేటి తెలిపారు. బహుశా... 'కార్తికేయ 2' తర్వాత నాగార్జునతో ఆయన సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.
Also Read : మళ్ళీ నిఖిల్‌ను వెనక్కి పంపారు - ఆగస్టు 12న కాదు, తర్వాత రోజున 'కార్తికేయ 2'
'ది ఘోస్ట్'... రెడీ ఫర్ రిలీజ్
ఇప్పుడు నాగార్జున రెండు సినిమాల విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అందులో ఒకటి హిందీ సినిమా 'బ్రహ్మాస్త్ర'. అది సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకొకటి ది ఘోస్ట్'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన చిత్రమిది. అక్టోబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : నాగ చైతన్య నవ్వితే డేటింగ్లో ఉన్నట్టేనా? ఆమెతో ప్రేమ నిజమేనా?
View this post on Instagram