Music Shop Murthy: సినిమా నచ్చకపోతే నాకు ఫోన్ చేసి బూతులు తిట్టండి.. ఇదే నా నెంబర్: అజయ్ ఘోష్
Music Shop Murthy: అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మ్యూజిక షాప్ మూర్తి'. జూన్ 14న ఈ మూవీ రిలీజ్ కానుంది. అయితే, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అజయ్ ఘోష్ తన ఫోన్ నంబర్ చెప్పేశారు.
Ajay Gosh's Music Shop Pre Release Event: అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన 'మూవీ మ్యూజిక్ షాప్ మూర్తి'. జూన్ 14న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ మొదలు పెట్టిన సినిమా టీమ్.. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న యాక్టర్ అజయ్ ఘోష్ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు. అందరికీ సినిమా కచ్చితంగా నచ్చుతుందని, సినిమా చూడాలని చెప్పారు. అంతేకాదు సినిమా బాగలేకపోతే తనకు ఫోన్ చేసి బూతులు తిట్టాలని అని కూడా అన్నారు. పబ్లిక్‌గా తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేశారు అజయ్ ఘోష్.
నా ఫోన్ నంబర్ ఇదే..
"ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అందుకే మీ ఇంటికి దగ్గర్లోని థియేటర్లకు వెళ్లి చూడండి. నచ్చకపోతే 9290117666 నా నంబర్. దీనికి ఫోన్ చేసి నన్ను బూతులు తిట్టండి. ఎందుకంటే ఈ సినిమాలో ప్రతి మనిషి జీవితం ఉంటుంది. ఇలాంటి సినిమాలను మీరు కచ్చితంగా ఆదరిస్తారు. కాబట్టి అందరూ సినిమా చూడండి. చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాను. ఈ మ్యూజిక్ షాప్ మూర్తి జీవితం మీ చేతుల్లో ఉంది. ఈ సినిమా కుటుంబంతో కలిసి చూసే సినిమా. ప్రతి ఒక్కరికి కచ్చితంగా నచ్చుతుంది. వందల కోట్లు పెట్టి సినిమా కంటే కంటెంట్ ఉన్న సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ సినిమాలో కంటెంట్ ఉంది. చాందినీ చౌదరి కూడా సినిమాలో అద్భుతంగా నటించింది" అని అన్నారు అజయ్ ఘోష్.
#MusicShopMurthy - 9290117666 is my number. Watch our movie in theatres with your family and if you don't like the movie, call me on my number and abuse, says Ajay Ghosh. pic.twitter.com/ky15xytFrl
— Aakashavaani (@TheAakashavaani) June 13, 2024
ఈ సినిమాలో అజయ్ ఘోష్ ప్రధాన పాత్ర పోషించారు. సినిమాకి శివ పాలడుగు దర్శకత్వం వహించారు. హర్ష గారపాటి, రంగారావు గారపాటి ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. చాందినీ చౌదరి, ఆమని తదితరులు ఉన్నారు. ఈ సినిమా కామెడీ జోనర్ లో రానుంది. అంతే కాకుండా ఎమోషన్స్ కూడా ఉన్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. అందులోని డైలాగులు టచ్చింగ్ గా ఉంటాయి. 50 ఏళ్ల వయసులో హీరో డీజే అవ్వాలని ప్రయత్నం చేస్తుంటాడు అనే విషయం ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అజయ్ ఘోష్ ఎంతో కష్టపడి ఈ స్టేజ్ కి వచ్చారు. ఆయన తన అనుభవాలను ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో కూడా పంచుకున్నారు. కిళ్లీలు, సిగరెట్లు అమ్మి ఈ స్టేజ్ కి వచ్చానని చెప్పారు. 'రంగస్థలం', 'ఈగల్', ‘మంగళవారం’ తదితర సినిమాల్లో అజయ్ ఘోష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ మూవీ ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు.
Also Read: అయ్యో రామ.. కరణ్ జోహార్ పేరుతో సినిమా టైటిల్ - ఆగ్రహంతో కోర్టు మెట్లెక్కిన బాలీవుడ్ దిగ్గజం