అన్వేషించండి

Aishwarya Abhishek Bachchan: అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకోనున్నారా? అమితాబ్ బచ్చన్ పోస్ట్‌కు అర్థం ఏమిటీ?

Aishwarya Rai : అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకోబోతున్నారని బాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతలోనే అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ పలు అనుమానాలు దారితీస్తోంది.

సినీ పరిశ్రమలో ఏదైనా జంట విడిపోతుందేమో అని చెప్పడానికి ముందుగా వారి సోషల్ మీడియానే సాక్ష్యంగా నిలుస్తుంది. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకునే ముందు సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్‌ఫాలో అవ్వడం ట్రెండ్‌గా మారింది. తాజాగా మరో బాలీవుడ్ జంట కూడా విడిపోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. వారు మరెవరో కాదు.. మాజీ మిస్ యూనివర్స్ ఐశ్వర్య రాయ్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్. బాలీవుడ్ సర్కిల్లో గతకొంతకాలంగా ఈ వార్తలు వైరల్ అవుతుండగా.. తాజాగా అమితాబ్ బచ్చన్.. ఐశ్వర్య రాయ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశారు. అంతే కాకుండా ట్విటర్‌లో ఆయన షేర్ చేసిన పోస్ట్ కూడా పలు అనుమానాలకు దారితీస్తోంది.

అంతా అయిపోయింది..
ఇన్‌స్టాగ్రామ్‌లో ఐశ్వర్య రాయ్‌ను అమితాబ్ బచ్చన్ అన్‌ఫాలో చేశారని వార్తలు వచ్చిన తర్వాత ట్విటర్‌లో ఆయన చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ‘అంతా అయిపోయింది’ అన్నట్టుగా అర్థం వచ్చేలా ఒక కొటేషన్‌ను షేర్ చేశారు బిగ్ బీ. అంతా అయిపోయింది అంటే ఏంటి అర్థం? అసలు అమితాబ్ దేని గురించి మాట్లాడుతున్నారు? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే అమితాబ్ ముందు నుంచి ఐశ్వర్యను ఫాలో చేయడం లేదా లేక ఈమధ్యే అన్‌ఫాలో చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొదటినుంచి ఐశ్వర్య రాయ్, అమితాబ్ బచ్చన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవ్వడం లేదని మరికొందరు అనుకుంటున్నారు.

పెళ్లి రింగ్ కనిపించడం లేదు..
అమితాబ్ బచ్చన్ ట్వీట్ మాత్రమే కాదు.. అభిషేక్ ప్రవర్తన కూడా విడాకుల వార్తలు నిజమే అనిపించేలా చేస్తోంది. తాజాగా ఒక సమావేశంలో పాల్గొన్న అభిషేక్.. తన పెళ్లి రింగ్‌ను పెట్టుకోలేదు. సాధారణంగా అభిషేక్.. తన పెళ్లి రింగ్‌ను ఎప్పుడూ తీసేయడని, కానీ ఈమధ్య ఆయన చేతికి ఆ రింగ్ కనిపించడం లేదని సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్‌లో గతకొంతకాలంగా ఈ వార్తలు వైరల్ అవుతున్నా.. బచ్చన్ ఫ్యామిలీ మాత్రం ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడానికి ముందుకు రాలేదు. ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వారు బిజీగా గడిపేస్తున్నారు. ఐశ్వర్య కూడా మళ్లీ ఫామ్‌లోకి రావడానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఒకట్రెండు చిత్రాల్లో నటించినా.. మళ్లీ యాక్టింగ్‌కు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 

ఇప్పటికే చాలాసార్లు..
2007లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ కలిసి నటించిన ‘గురూ’ షూటింగ్ సమయంలో ఐశ్వర్యతో ప్రేమలో పడిన అభిషేక్..  ఆ చిత్రం పూర్తయిన తర్వాత తనకు ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఆరాధ్య అనే పాప కూడా ఉంది. ఇక పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసిన ఐశ్వర్య.. ఆరాధ్య పుట్టిన తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే ఆలోచనలో పలు సినిమాల్లో నటించినా.. ఎందుకో మళ్లీ బ్రేక్ తీసుకొని ప్రస్తుతం యాక్టింగ్‌కు దూరం ఉంటోంది. అయితే అభిషేక్, ఐశ్వర్యలు విడిపోతారని వార్తలు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకు ముందు ఎనిమిది సార్లు వీరిద్దరు విడాకులు తీసుకుంటారని బాలీవుడ్‌లో రూమర్స్ వచ్చాయి. ఇది కూడా అలాంటిదే అయ్యిండొచ్చని ఐశ్వర్య ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు.

Also Read: ‘డెవిల్’ కోసం కళ్యాణ్‌రామ్‌కు 90 స్పెషల్ కాస్ట్యూమ్స్‌ - ఇటలీ నుంచి తెప్పిన మోహైర్ ఊల్‌తో!

టాప్ హెడ్ లైన్స్

Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget