అన్వేషించండి

'ఏజెంట్' డైరెక్టర్​కి గోల్డెన్ ఛాన్స్ - ఏకంగా కోలీవుడ్ స్టార్​తో పాన్ ఇండియా మూవీ?

'ఏజెంట్' తో భారీ డిజాస్టర్ అందుకున్న సురేందర్ రెడ్డి ఇప్పుడు ఏకంగా కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్​తో పాన్ ఇండియా ప్రాజెక్టు చేనున్నట్లు సమాచారం.

టాలీవుడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డికి గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. రీసెంట్ గా 'ఏజెంట్'తో భారీ డిజాస్టర్ ఇచ్చిన ఈ దర్శకుడితో ఇక ఏ హీరో సినిమా చేయడనే వాదనల నేపథ్యంలో.. ఓ తమిళ స్టార్ హీరో సురేందర్ రెడ్డితో సినిమా చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ కోలీవుడ్ స్టార్ హీరో ఎవరు? డీటెయిల్స్​లోకి వెళ్తే.. సురేందర్ రెడ్డి దర్శకుడిగా రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఈ రెండు దశాబ్దాలలో ఆయన చేసిన సినిమాలు పది మాత్రమే. ఆ పది సినిమాల్లో సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ. కానీ ఈ డైరెక్టర్ తీసిన 'అతనొక్కడే', 'కిక్', 'రేసుగుర్రం' వంటి సినిమాలు భారీ సక్సెస్ అందుకొని దర్శకుడిగా సురేందర్ రెడ్డి రేంజ్ పెంచాయి.

ఇక చివరిగా రామ్ చరణ్ తో తెరకెక్కించిన 'ధృవ' తర్వాత సురేందర్ రెడ్డికి ఇప్పటివరకు మరో సక్సెస్ రాలేదు. మెగాస్టార్​తో తీసిన 'సైరా నరసింహారెడ్డి' భారీ విజయాన్ని అందుకుంటుంది అనుకుంటే ఆ సినిమా అంతగా విజయాన్ని పొందలేదు. దాని నుంచి తేరుకునేలోపే అఖిల్​తో తీసిన 'ఏజెంట్' సురేందర్ రెడ్డి స్థానాన్ని మరింత దిగజార్చింది. అఖిల్ మార్కెట్​ను ఏ మాత్రం పట్టించుకోకుండా 'ఏజెంట్' సినిమా కోసం భారీగా ఖర్చు చేసి నిర్మాతలకు నష్టాలను మిగిల్చాడు సురేందర్ రెడ్డి. దాంతో ఇతనితో సినిమాలు చేసేందుకు హీరోలు, నిర్మాతలు ముందుకు రాలేదు. ఏజెంట్ రిజల్ట్ చూసి అందరూ సూరితో సినిమాలు చేసేందుకు వెనకాడతారని అనుకున్నారు.

కానీ అనూహ్యంగా సురేందర్ రెడ్డి ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో తో సినిమా లైన్​లో పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డితో సినిమా చేసేందుకు ఏకంగా ఇద్దరు హీరోలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరు విక్టరీ వెంకటేష్ కాగా మరొకరు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్. కొన్ని వారాల క్రితం సురేందర్ రెడ్డి వెంకటేష్​కి ఓ కథ వినిపించగా, ఆ కథ బాగా నచ్చడంతో వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

ఇక ఇటీవల చియాన్ విక్రమ్​తో కూడా ఓ సినిమాను ఓకే చేయించుకున్నారని, పాన్ ఇండియా రేంజ్​లో ఈ మూవీని చేయబోతున్నట్లుగా సురేందర్ రెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం వెంకటేష్ చేస్తున్న సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వెంటనే సినిమాను మొదలుపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.వెంకీ ప్రాజెక్టు తర్వాతే చియాన్ విక్రమ్ తో సురేందర్ రెడ్డి మూవీ ఉంటుందని సమాచారం. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్ట్స్ కు సంబంధించి ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఒకవేళ ఈ రెండు ప్రాజెక్టులతో మంచి సక్సెస్ అందుకుంటే కచ్చితంగా టాలీవుడ్​లో మళ్లీ మోస్ట్ బిజినెస్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి మారడం ఖాయమని చెప్పొచ్చు. ఇక వెంకటేష్ విషయానికొస్తే.. ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో 'సైంధవ్' మూవీ చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకోగా త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టనుంది. అటు చియాన్ విక్రమ్ పా.రంజిత్ దర్శకత్వంలో 'తంగలాన్' మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో 26 న ఈ మూవీ విడుదల కానుంది.

Also Read : 'హాయ్ నాన్న' థర్డ్ సింగిల్ - నాని, మృణాల్ కెమిస్ట్రీ అదుర్స్, సాంగ్ ఎప్పుడంటే?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Naga Chaitanya: హారర్ థ్రిల్లర్‌లో నాగ చైతన్య... రెండు కథలు లైనులో పెట్టిన అక్కినేని హీరో?
హారర్ థ్రిల్లర్‌లో నాగ చైతన్య... రెండు కథలు లైనులో పెట్టిన అక్కినేని హీరో?
Operation Safed Sagar Series OTT : ఎయిర్ ఫోర్స్ కమాండర్‌గా సిద్దార్థ్ - ఓటీటీలోకి సరికొత్త సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఎయిర్ ఫోర్స్ కమాండర్‌గా సిద్దార్థ్ - ఓటీటీలోకి సరికొత్త సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
TV Actor Arrested: మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్
మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్
Hrudayam Murali Review: 'హృదయం మురళి' రివ్యూ... నటుడిగా తమన్ రీ ఎంట్రీ
'హృదయం మురళి' రివ్యూ... నటుడిగా తమన్ రీ ఎంట్రీ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Embed widget