అన్వేషించండి

Adah Sharma: అదా శర్మ క్రిమినలా? డెవిలా? థియేటర్లలోకి ఈ వారమే సీడీ!

Adah Sharma CD Movie: అదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'సీడీ' క్రిమినల్ ఆర్ డెవిల్'. ఈ వారమే ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఇంతకీ, ఈ సినిమా జానర్ ఏంటి? థియేట్రికల్ రిలీజ్ ఎప్పుడు? అంటే...

Adah Sharma New Movie 2024: అదా శర్మ అంటే తెలుగు ప్రేక్షకులకు 'హార్ట్ ఎటాక్' బ్యూటీ. ఆ తర్వాత పలు సినిమాలు చేశారు. మెజారిటీ సినిమాల్లో క్యూట్, స్వీట్, బబ్లీ క్యారెక్టర్లు చేశారు. అయితే... 'ది కేరళ ఫైల్స్' తర్వాత ఆవిడ రేంజ్ మారింది. అందులో సీరియస్ అండ్ ఎమోషనల్ రోల్ చేశారు. పెర్ఫార్మన్స్ చేసే నటిగా పేరు తెచ్చుకున్నారు. 'బస్తర్'తో ఆ ఇమేజ్ మరింత పెరిగింది. ఆవిడ కొత్త సినిమాలపై క్యూరియాసిటీ మొదలు అయ్యింది. ఈ వారం కొత్త సినిమాతో అదా శర్మ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

మే 24న థియేటర్లలోకి వస్తున్న 'సీడీ'
CD (Criminal Or Devil) Release Date: అదా శర్మ ప్రధాన పాత్రలో రూపొందిన తాజా తెలుగు సినిమా 'CD' (క్రిమినల్ ఆర్ డెవిల్). ఈ చిత్రానికి కృష్ణ అన్నం దర్శకత్వం వహించారు. ఎస్ఎస్సిఎమ్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రొడ్యూస్ చేసింది. దీనికి గిరిధర్ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్‌. ఈ నెల 24న థియేటర్లలోకి వస్తుందీ సినిమా.

CD (Criminal Or Devil) Movie Movie Genre: 'సీడీ' (క్రిమినల్ ఆర్ డెవిల్) మూవీని డిఫరెంట్ కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచాయి. సైకలాజికల్ హారర్ థ్రిల్లర్, డ్రామా జానర్ చిత్రమిది. సెన్సార్ నుంచి ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ వచ్చింది. సినిమా బావుందని సెన్సార్ సభ్యులు ప్రంసించినట్టు తెలిసింది. సెన్సార్ రిపోర్ట్‌ బావుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలుగుతోంది.

Also Read: ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ 5 బెస్ట్ లుక్స్ - ఆ మేకోవర్, స్టైలింగుకు విమర్శకుల నోళ్లూ మూతపడ్డాయంతే!

'ది కేరళ స్టోరీ' తర్వాత అదా శర్మ తెలుగు సినిమా ఏదీ చేయలేదు. ఆ సినిమా టైంలో 'సీడీ' షూటింగ్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలోని థియేటర్లలో సినిమా విడుదల చేస్తున్నారు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో డబ్బింగ్ చేసి ఓటీటీ రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారట.

Also Read: గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ డీల్ క్లోజ్... వామ్మో, అజిత్ సినిమాకు రికార్డ్ రేటు వచ్చిందిగా!

'సీడీ' సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్ర పోషిస్తుండగా... యువ హీరో విశ్వంత్ దుద్దుంపూడి, బుల్లితెర నటి 'జబర్దస్త్' రోహిణి, నటుడు భరణి శంకర్ సహా రమణ భార్గవ్, మహేష్ విట్టా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఏ.ముద్దు కృష్ణ కథ, సంభాషణలు రాయగా... సతీష్ ముత్యాల ఛాయాగ్రహణం అందించారు. ఈ చిత్రానికి కూర్పు: సత్య గిడుతూరి, సంగీతం: ఆర్ఆర్ ధృవన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్, నిర్మాణ సంస్థ: ఎస్ఎస్సిఎమ్ ప్రొడక్షన్స్, దర్శకత్వం: కృష్ణ అన్నం.

టాప్ హెడ్ లైన్స్

Aadarsha Kutumbam OTT : ఆదర్శ కుటుంబం ఓటీటీ రిలీజ్ డేట్ - వెంకీ త్రివిక్రమ్ మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆదర్శ కుటుంబం ఓటీటీ రిలీజ్ డేట్ - వెంకీ త్రివిక్రమ్ మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Aakasamlo Oka Tara Vs Dear Astronatu : ఆకాశంలో ఒక తార Vs డియర్ ఆస్ట్రోనాట్ - ఒకే రోజు రెండు సినిమాలు... స్టోరీ వివాదం ఏంటి?
ఆకాశంలో ఒక తార Vs డియర్ ఆస్ట్రోనాట్ - ఒకే రోజు రెండు సినిమాలు... స్టోరీ వివాదం ఏంటి?
Suriya Upcoming Movie : DC డైరెక్టర్‌తో సూర్య నెక్స్ట్ మూవీ? - ఫ్యాన్స్ మరో ట్రీట్ కన్ఫర్మేనా!
DC డైరెక్టర్‌తో సూర్య నెక్స్ట్ మూవీ? - ఫ్యాన్స్ మరో ట్రీట్ కన్ఫర్మేనా!
NTR God Of War : ఎన్టీఆర్ త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ - షూటింగ్ అప్డేట్ చెప్పేసిన నాగవంశీ... రూమర్స్‌కు చెక్
ఎన్టీఆర్ త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ - షూటింగ్ అప్డేట్ చెప్పేసిన నాగవంశీ... రూమర్స్‌కు చెక్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
US Federal Court Visa Ruling: ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
Shubman Gill Strategy:  కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
Amaravati Financial Plan: అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
Khairatabad By-Election Suspense: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Embed widget