Tamannaah Bhatia: తమన్నా ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా? ఇలాంటి వింత కాంబో ప్రపంచంలో ఇంకెవ్వరూ ఇష్టపడరేమో
Tamannaah Bhatia : 'ఓదెల 2' ప్రమోషన్లలో బిజీగా ఉన్న తమన్నా తన ఫేవరెట్ ఫుడ్ ఏంటో వెల్లడించింది. ఆమె చెప్పిన వంటకం పేరు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. మరి తమన్నాకు ఇష్టమైన ఆ వింత కాంబో ఏంటి అంటే?

సెలబ్రిటీలకు ఇష్టమైన ఫుడ్ గురించి తెలుసుకోవడం అభిమానులకు ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. సాధారణంగానే ఎక్కడ, ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది? అనే విషయాన్ని ఫుడ్ లవర్స్ ఆరా తీస్తూ ఉంటారు. ఇక స్టార్స్ ఇష్టపడే మంచి ఫుడ్ స్పాట్, రెస్టారెంట్స్ ఏంటి? అక్కడ దొరికే ఆహారం ఏంటి అనే విషయాలను వదులుతారా ? వీటి మీద ఇంకొంచం ఇంట్రెస్ట్ పెట్టి, విషయం తెలుసుకోవడానికి ఇష్టపడతారు. అయితే చాలామంది హైదరాబాద్లోని ఐకానిక్ ఫుడ్ టేస్ట్ ని బాగా ఇష్టపడతారు. హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బిర్యానీ. కానీ తమన్నాకు మాత్రం ఓ విచిత్రమైన వంట అంటే ఇష్టమట. తాజాగా 'ఓదెల 2' ప్రమోషన్లలో భాగంగా తమన్నా హైదరాబాదులో స్ట్రీట్ ఫుడ్ తింటూ కనిపించింది. ఈ సందర్భంగా ఆమె తనకు ఇష్టమైన ఫుడ్ ఏంటో వెల్లడించింది.
తమన్నాకు ఇష్టమైన కాంబో ఇదేనట!
హైదరాబాద్ అనేది స్పైసీ హలీం, హైదరాబాదీ బిర్యానీ వంటి అద్భుతమైన ఫుడ్ కి కేరాఫ్ అడ్రస్. అందుకే చాలామంది సెలబ్రిటీలు హైదరాబాద్లో పలు రెస్టారెంట్లలో తనకు ఇష్టమైన ఫుడ్ ని రుచి చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ముఖ్యంగా బిర్యానీని వదలకుండా తింటారు. ఇప్పుడు ఆ లిస్టులో తమన్నా కూడా చేరింది. తాజా ఇంటర్వ్యూలో తమన్నా హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న ఒక చాట్ స్పాట్ లో దర్శనమిచ్చింది. 'ఓదెల 2' సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆమె మాదాపూర్ లోని నయీంటారా (Naintara) రెస్టారెంట్ ను సందర్శించింది. అక్కడ తనకు స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని, అందులోనూ హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ అంటే ఇంకా ఇష్టమని వెల్లడించింది.
ఇక "మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి?" అని ప్రశ్నించగా, విచిత్రంగా "దోశ ప్లస్ పావు బాజీ" అని చెప్పింది. సాధారణంగా ఎవరైనా దోశ లేదా పావు బాజీలో ఏదో ఒకటి మాత్రమే ఇష్టపడతారు. కానీ తమన్నా మాత్రం ఈ రెండింటినీ కలిపి తింటుందట. "ప్రస్తుతం నేను స్ట్రిక్ట్ డైట్ లో ఉండడం వల్ల బ్రెడ్ తినలేను. అందుకే ఇంట్లోనే దోశ వేసుకుని బాజీతో కలిపి తింటాను. ఈ కాంబో అంటే నాకు చాలా ఇష్టం" అని చెప్పుకొచ్చింది తమన్నా. ఇక తాను బాగా ఇష్టపడే ఫుడ్ బిర్యానీ అని, ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీకి ఏదీ సాటి రాదని చెప్పింది.
'ఓదెల 2' ప్రమోషన్స్ జోరుగా
ప్రస్తుతం తమన్నా హీరోయిన్ గా నటించిన 'ఓదెల 2' రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఏప్రిల్ 17న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తమన్నా అండ్ 'ఓదెల 2' టీం ప్రమోషన్లలో బిజీగా ఉంది.
"द्वे" | ద్వే
— Sampath Nandi (@IamSampathNandi) April 15, 2025
మరో రెండు రోజుల్లో మాహాయుద్ధం 💥#Odela2 GRAND WORLDWIDE RELEASE ON APRIL 17th.
Bookings open now!
🎟 https://t.co/lcQBL7Lern #Odela2onApril17 @tamannaahspeaks @ashokalle2020 @ihebahp @ImSimhaa @AJANEESHB @soundar16 @Neeta_lulla @SampathNandi_TW… pic.twitter.com/zxNCOGZOLA





















