ముంబై ఎయిర్ పోర్ట్ లో నటి సమంత - ఇలా అయిపోయిందేంటి?
గత కొన్ని రోజులుగా నటి సమంత ఇంటివద్దే ఉంటూ మయోసైటిస్ కి చికిత్స తీసుకుంటుంది. తాజాగా ఆమె ముంబై ఎయిర్ పోర్ట్ లో కనపడటంతో సమంత ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటి సమంత చాలా రోజుల నుంచి పెద్దగా బయట కనిపించడం లేదు. ఆమెకు మయోసైటిస్ వ్యాధి వచ్చిందని చెప్పిన తర్వాత సమంత నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. మధ్యలో ఆమె ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వచ్చాయి. అయితే వీటిపై సమంత ఎప్పుడూ స్పందించలేదు. దీంతో ఆమె అభిమానులు సమంత కు ఏమైందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సమంత త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ప్రార్థించారు. ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఆమెకు ధైర్యం చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ వస్తున్నారు. ఇటీవలె నటి రష్మిక కూడా సమంత ఆరోగ్యం పై స్పందించింది. అయితే సమంత ఇటీవలె ‘శాకుంతలం’ సినిమా డబ్బింగ్ ను ప్రారంభించాను అని ఓ పోస్ట్ పెట్టింది. తాజాగా సమంత ఉన్నట్టుండి ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించి అందర్నీ షాక్ కు గురి చేసింది.
చాలా రోజుల తర్వాత సమంత బహిరంగ ప్రదేశంలో కనిపించింది. ముంబై ఎయిర్ పోర్ట్ లో వైట్ అండ్ వైట్ డ్రెస్ లో నల్ల కళ్లద్దాలు పెట్టుకొని చేతిలో బ్యాగ్ తో స్టైయిల్ గా నడుస్తూ కనిపించింది సమంత. చాలా రోజుల తర్వాత ఆమె బయట కనిపించడంతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఆమె వెంట పడ్డారు. అయితే ఎప్పుడు బయట కనిపించినా నవ్వుతూ ఫోటోగ్రాఫర్ లతో సరదాగా మాట్లాడే సమంత ఇప్పుడు కనీసం కెమెరాల వైపు కూడా చూడకుండా సైలెంట్ గా వెళ్లిపోవడం గమనార్హం. అంతే కాదు, ఆమె మొఖం కూడా చాలా నీరసంగా కనిపిస్తోంది. దాన్ని కళ్లద్దాలతో కప్పిపుచ్చినట్టు కూడా అనిపిస్తోంది. మయోసైటిస్ వల్ల సమంత చాలా బలహీనంగా మారిపోయిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. సమంత ముంబై ఎందుకొచ్చింది అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయింది సమంత.
ఇక ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో కూడా బాగా పాపులర్ అయింది సమంత. దీని తర్వాతే ఆమెకు వరుసగా బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తో ‘సిటాడెల్’ సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది సమంత. బాలీవుడ్ లో ఇదే సమంత మొదటి సినిమా. అయితే ఇటీవలే ఆమె ఆ సినిమా నుంచి తప్పుకున్నట్టు కూడా వార్తలు హల్చల్ చేశాయి. సమంత అనారోగ్యం కారణంగానే ఈ సినిమా నుంచి తప్పుకుందని అనుకున్నారు. అయితే తాను ఆ సినిమా నుంచి తప్పుకోలేదని, త్వరలోనే ముంబైలో జరగనున్న షూటింగ్ లో పాల్గోనుందని ముంబై ఎయిర్ పోర్ట్ లో అందరికీ కనిపించి కన్ఫర్మ్ చేసింది. అయితే నిజంగా ఆమె ఆ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి వచ్చిందా లేదా మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనేది త్వరలోనే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సమంత బయట కనిపించడం పట్ల హర్షం వక్తం చేస్తున్నారు సామ్ అభిమానులు.