అన్వేషించండి

Nivetha Pethuraj: ఎవరూ నా కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడం లేదు, డబ్బు కోసం దిగజారే వ్యక్తిని కాదు - నివేతా పేతురాజ్‌ సంచలన పోస్ట్‌

Nivetha Pethuraj: సీఎం కొడుకు నివేతా పేతురాజ్‌కు రూ. 50 కోట్ల విలువైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చారని, ఆమె కోసం ఆయన విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారంటూ కోలీవుడ్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరిగుతోంది..

Actress Nivetha Pethuraj React on Fake News: కోలీవుడ్ నటి నివేదా పేతురాజ్  తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదట్లో డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఆ తరువాత చిత్రలహరి, పాగల్, అల వైకుంఠపురములో అంటూ ఇలా చాలా చిత్రాల్లోనే నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగువారికి మెంటల్ మదిలో కథాకనాయికగా పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత బ్రోచేవారెవరురా, రెడ్, దాస్ కా ధమ్కీ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ సిమిమాల్లో తళుక్కున మెరిసిన ఈ భామ ఓటీటీలోనూ వరుసగా వెబ్ సిరీస్, మూవీస్ చేస్తూ బిజీగా ఉంటుంది.

నివేదా పేతురాజ్ నటి మాత్రమే కాదు, రేసర్, బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా అనే విషయం తెలిసిందే. రీసెంట్‌గా బాడ్మింటన్‌లో ఆమె సత్తాచాటింది. తమిళనాడులో జరిగిన రాష్ట్రస్థాయి బాడ్మింటన్‌ పోటీల్లో నివేతా విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే ఇటీవల నివేతా గురించి ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. నివేతా పేతురాజ్‌ కోసం కొందరు ప్రముఖులు విచ్చలవిడిగా డబ్బుల ఖర్చు చేస్తున్నారంటూ తమిళ మీడియాలో ఆమెపై నెగిటివ్‌ ప్రచారం మొదలుపెట్టారు. సీఎం కొడుకు నివేతా పేతురాజ్‌కు రూ. 50 కోట్ల విలువైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చారని, ఆమె కోసం ఆయన విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారంటూ కోలీవుడ్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలు కాస్తా వైరల్‌ కావడం నివేతా కంట పడ్డాయి. తాజాగా వాటిపై ఆమె స్పందిస్తూ ఇలాంటి తప్పుడు వార్తలు రాసేవారిపై మండిపింది. 

నివేతా ట్వీట్ వైరల్

"నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఇటీవల నాపై తప్పుడు వార్తలు రాశారు. దీనిపై మొదట నేను మౌనంగానే ఉన్నాను. ఇలాంటి తప్పుడు వార్తలు రాసేవారు, ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేముందు వాళ్ళు విన్న సమాచారం నిజమా? కాదా? అని ధృవీకరించడానికి కొంచమైన మానవత్వం కలిగి ఉంటారని అనుకున్నాను. ఇలా తప్పుడు వార్తల వల్ల కొన్ని రోజులుగా నేను, నా కుటుంబం తీవ్ర ఒత్తిడికి లోనయ్యాం. ఇలాంటి వార్తలు రాసేముందు ఒకసారి ఆలోచించండి. నేను ఓ గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను సంపాదించడం మొదలుపెట్టాను.

నా ఫ్యామిలీ ఇప్పటికీ దుబాయ్‌లోనే స్థిరపడింది. 20 ఏళ్లకు పైగా మేము దుబాయ్‌ ఉంటున్నాం. ఇండస్ట్రీలో నేను ఇప్పటి వరకు 20పైగా సినిమాలు చేశాను. అన్నీ ఆఫర్స్‌ నన్ను వెతుక్కుంటూ వచ్చినవే. కానీ, ఏ రోజు నేను నోరు తెరిచి నాకు ఆఫర్స్‌ ఇవ్వండని డైరెక్టర్‌ కానీ, నిర్మాతను కానీ, హీరోలను కానీ అడగలేదు. నేను డబ్బు కోసం అత్యాశపడే వ్యక్తిని కాదు. నా కోసం ఎవరో డబ్బు ఖర్చు చేస్తున్నారనంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవి నారధారమైనవి. నేను చాలా సాధారణ లైఫ్ గడుపుతాను. 2002 నుండి దుబాయ్‌లో మేము అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాతే నేను ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను.

మీ కుటుంబంలోని ఆడవాళ్లు కోరుకున్నట్టే నేను కూడా గౌరవప్రదమైన, ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటున్నాను. ఆ వార్తలు రాసేవాళ్ళల్లో ఒకసారి ఆలోచించండి. మీలో మానవత్వం ఉందనే అనుకుంటున్నాను. మరోసారి నా ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా తప్పుడు వార్తలు సృష్టించరని భావిస్తూ లీగర్‌ యాక్షన్‌ తీసుకోకుండ వదిలేస్తున్నాను. ఒక అమ్మాయి, ఆమె కుటుంబాల ప్రతిష్టని నాశనం చేసేముందు ఇలాంటి వార్తలు నిజమో కాదో తెలుసుకొని రాయండి. ఇకపై నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకండి. ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసినవారందరికి థ్యాంక్యూ" అంటూ నివేతా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం నివేతా పేతురాజ్‌ ట్వీట్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget