అన్వేషించండి

Madhavi Latha: కృష్ణుడితో ప్రేమలో పడ్డా, ‘బేబీ’ తరహా పాత్రలు చేయను: మాధవీ లత

నటి మాధవి లత తన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. ప్రేమ అంటేనే పడని తాను ఒకరి ప్రేమలో పడిపోయినట్లు తెలిపింది. ఆయన తోడుగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందని వెల్లడిచింది.

సినీ నటి మాధవీ లత గురించి పెద్దగా పరిచయం లేదు.  ‘న‌చ్చావులే’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘స్నేహితుడా’, ‘అర‌వింద్ 2’ లాంటి చిత్రాల్లో న‌టించి మెప్పించింది. నెమ్మదిగా అవకాశాలు రాక సినిమాలకు దూరం అయ్యింది. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతోంది. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. తన వ్యక్తిగత ముచ్చట్లతో పాటు సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాల గురించి స్పందించింది.

మా అమ్మానాన్నల కోరిక అదొక్కటే- మాధవీ లత

అందరు అమ్మానాన్నల మాదిరిగానే తన పేరెంట్స్ కూడా పెళ్లి చేసి పిల్లా పాపలతో హ్యాపీగా ఉండాలని భావిస్తున్నారని చెప్పింది మాధవీ. అయితే, నాకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది. “నేను చాలా ఎమోషనల్ వ్యక్తిని. చాలా ప్రాక్టికల్ గా ఉంటాను. లైఫ్ అనేది వార్ అని నమ్ముతాను. దేవుడు నాకు ఇచ్చిన రెండు గొప్ప వరాలు నా కుటుంబం, నా ఫ్రెండ్స్. వీళ్లు నన్ను ఎవరూ వ్యతిరేకించరు. అంటే భజన చేయరు. సరి చేస్తారు. ఏదైనా తప్పుగా మాట్లాడితే, అలా మాట్లాడకుండా ఉండి ఉంటే బాగుండేదని చెప్తారు. నాకు పెళ్లి చేసి ఒక చక్కటి కుటుంబాన్ని చూడాలనేది మా అమ్మనాన్నల కల. అన్నయ్యలకు పెళ్లిళ్లు చేశారు. వాళ్ల కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయి. మనువళ్లు, మనువరాళ్లతో అమ్మానాన్న సంతోషంగా గడుపుతున్నారు. పెళ్లి వయసు వచ్చిన సమయంలో తల్లిదండ్రులు వాళ్లు చూపించిన అబ్బాయిని చేసుకోమని చెప్తారు. ఆ ఏజ్ దాటిపోయాక, నీకు నచ్చిన వాడిని తీసుకురా చేస్తాం అంటారు. నాకు ఇంత వరకు ఎవరూ నచ్చలేదు. నా ఫ్రెండ్స్ సరౌండింగ్ లో ప్రేమ అనే సౌండ్ వినిపిస్తే చంపేస్తా అని చెప్తాను. మనం అనుకున్నది అనుకున్న సమయానికి ఎప్పుడూ జరగదు. కానీ, ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుంది. చాలా మంది ఫిజికల్ అట్రాక్షన్ కు గురై లవ్ మ్యారేజ్ చేసుకుని విడిపోతున్నారు. కొంత మంది ఏజ్ అయిపోయిందని ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని అడ్జెస్ట్ అవుతున్నారు.  నాకు కూడా నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటాను” అని చెప్పింది.

ఏ క్యారెక్టర్ అయినా చేస్తా, కానీ, ఓ కండీషన్- మాధవీ లత

సినిమాల్లో అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని నటి మాధవీ లత చెప్పుకొచ్చింది.  ఎలాంటి క్యారెక్టర్ అయినా ఫర్వాలేదని చెప్పింది. హీరోయిన్ అనే కాదు, ఏ పాత్ర చేయడానికైనా రెడీ అన్నది. కానీ, అమ్మాయి వ్యక్తిత్వ విలువలు తగ్గకుండా ఉండే క్యారెక్టర్ అయితేనే నటిస్తానని వెల్లడించింది. ‘బేబీ’ సినిమాలో హీరోయిన్ లాంటి అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయనని తేల్చి చెప్పింది.

ఆయనతో ప్రేమలో ఉన్నా- మాధవీ లత

గత కొంత కాలంగా లాడ్ కృష్ణతో ప్రేమలో ఉన్నట్లు చెప్పింది మాధవీ లత. “ఆరు సంవత్సరాలుగా ఎంత ట్రై చేసినా తగ్గని వెయిట్ లాస్, కృష్ణ ప్రేమ అనే ఆనందంలో తగ్గాను. ఎవరు నమ్మినా నమ్మక పోయినా, కృష్ణుడితో ప్రేమలో పడ్డాను. కృష్ణుడితో ప్రేమ ఏంటి? అని చాలా మంది అనుకుంటారు. కానీ, కృష్ణుడి భక్తులకే  ఆ ప్రేమంటే ఏంటో తెలుస్తుంది” అని వెల్లడించింది. తాజాగా రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన మాధవి,  సినిమాల్లో ఈవెంట్స్ లో ఆమె వేసుకునే డ్రెస్సుల కంటే, తను చూపించే బూ** షో కంటే ఆ వీడియోలో పెద్దగా ఏమీ లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Read Also: రష్మిక వేసుకునే డ్రెస్సులు, ఎక్స్‌పోజింగ్ కంటే పెద్దగా ఏమీ లేదు - ‘డీప్‌ఫేక్’పై మాధవీ లత కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
West Godavari Viral News: పార్శిల్‌లో డెడ్‌బాడీ-షాక్ తిన్న మహిళ- పశ్చిమగోదావరిలో ఘటన 
పార్శిల్‌లో డెడ్‌బాడీ-షాక్ తిన్న మహిళ- పశ్చిమగోదావరిలో ఘటన 
Dinga Dinga: జ్వరం వచ్చినా జలుబు చేసినా డ్యాన్స్ చేస్తారట, ఉగాండాను షేక్ చేస్తున్న డింగ డింగ వైరస్‌
జ్వరం వచ్చినా జలుబు చేసినా డ్యాన్స్ చేస్తారట, ఉగాండాను షేక్ చేస్తున్న డింగ డింగ వైరస్‌
Instant Loan Apps: అర్జంట్‌గా డబ్బులు కావాలా?, నిమిషాల్లో రుణం ఇచ్చే ఇన్‌స్టాంట్‌ లోన్‌ యాప్స్‌ ఇవి, కానీ జాగ్రత్త!
అర్జంట్‌గా డబ్బులు కావాలా?, నిమిషాల్లో రుణం ఇచ్చే ఇన్‌స్టాంట్‌ లోన్‌ యాప్స్‌ ఇవి, కానీ జాగ్రత్త!
Bangladesh China Frienship: బంగ్లాదేశ్‌కు అత్యాధునిక యుద్ధవిమానాలు అమ్ముతున్న చైనా - ఇండియాపై భారీ కుట్రకు సిద్ధమవుతున్న పొరుగుదేశం !?
బంగ్లాదేశ్‌కు అత్యాధునిక యుద్ధవిమానాలు అమ్ముతున్న చైనా - ఇండియాపై భారీ కుట్రకు సిద్ధమవుతున్న పొరుగుదేశం !?
Embed widget