Actress Hema: అందుకే నా కూతురిని బయటికి తీసుకురాను, ఇష్టాలను చంపేసుకోవాల్సి వస్తుంది - హేమ
Actress Hema: టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమకు ఒక కూతురు ఉంది. కానీ తన గురించి హేమ ఎక్కువగా బయటికి రానివ్వదు. దాని వెనుక కారణమేంటో ఇటీవల బయటపెట్టింది.
Actress Hema Family: ప్రస్తుతం సోషల్ మీడియాలో, టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పేరే వినిపిస్తోంది. ఇటీవల బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొంది అని ఆరోపణలు రావడమే దీనికి కారణం. దీంతో ఒక్కసారిగా హేమ పాత ఇంటర్వ్యూలు, అందులో తను చెప్పిన విషయాలు అన్నీ వైరల్ అవుతున్నాయి. తన పాత ఇంటర్వ్యూల్లో తన పర్సనల్ లైఫ్ గురించి, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎన్నో విశేషాలను పంచుకుంది హేమ. అంతే కాకుండా ఒక ఇంటర్వ్యూలో తన కూతురి గురించి, ఫ్యామిలీ గురించి కూడా చెప్పుకొచ్చింది.
ప్లీజ్ రాలేను అన్నారు..
తన కెరీర్‌లో ఒక మంచి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాలని ఉందని హేమ బయటపెట్టింది. ‘‘నాకు ఎప్పటినుండో ఒక కోరిక ఒక మంచి పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయాలని. మా డైరెక్టర్లు ఎవరికైనా కూడా అలా అనిపిస్తే బాగుంటుంది’’ అని చెప్పుకొచ్చింది. ఇంక తన భర్త సయ్యద్ జాన్ అహ్మద్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఆయనకు మొహమాటం ఎక్కువ. మొగుడు, పెళ్లాం కలిసి చేసే రియాలిటీ షోలకు రమ్మని పిలిచినా ఆయన ఒప్పుకోలేదు. పెద్ద డైరెక్టర్ ఫోన్ చేసి రమ్మన్నా కూడా ప్లీజ్ రాలేను అని చెప్పేశారు. ఎవరైనా ఎక్కడికీ రావడం లేదు అంటే చాలు ఇంకా ఎక్కువ టెన్షన్ పడిపోతారు’’ అంటూ తన భర్త మనస్తత్వం గురించి చెప్పుకొచ్చింది హేమ.
రెక్కలు కట్ చేయాల్సి వస్తుంది..
హేమకు ఈషా అనే కూతురు ఉంది. ఒకప్పుడు అసలు తన కూతురు గురించి ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడిప్పుడే ఈషాతో కలిసి ట్రిప్స్‌కు వెళ్తూ తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది హేమ. కానీ చాలామంది ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టుల లాగా తన కూతురిని తనతో పాటు షూటింగ్స్‌కు మాత్రం తీసుకెళ్లదు. దాని వెనుక కారణాన్ని కూడా తాజాగా హేమ బయటపెట్టింది. ‘‘ఈషాను ఎక్కువగా బయటికి ఎందుకు తీసుకురాను అంటే నా కూతురు అని తెలియనంతసేపు తను ఫ్రీ బర్డ్. ఒక్కసారి మీడియాలో ఈషా మా కూతురు అని తెలియగానే తన రెక్కలు కట్ చేయాల్సి వస్తుంది’’ అంటూ తన కూతురిని అందరికీ పరిచయం చేయకపోవడంపై అభిప్రాయం వ్యక్తం చేసింది హేమ.
పబ్స్‌కు వెళ్లడం ఇష్టం..
‘‘తను చిన్నగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్లాను కానీ 16 ఏళ్లు వచ్చిన తర్వాత తనను ఎక్కడికైనా తీసుకెళ్లడం మానేశాను. ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన ఫంక్షన్స్‌కు తీసుకెళ్లడం లేదు. తనకు అస్సలు యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ తనకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రోత్సహించేదాన్ని. నేను డ్రింక్ చేయను కానీ నాకు పబ్స్‌కు వెళ్లడం ఇష్టం. అక్కడ డ్యాన్స్ చేయడం, అల్లరి చేయడం, గోల చేయడం ఇష్టం. కానీ మీడియా వల్ల నేను వెళ్లలేను. నా కోరికలు చంపుకోవాల్సి వస్తుంది. నాకు స్వేచ్ఛగా తిరగడం ఇష్టం. కానీ తిరిగితే ఏదైనా గాసిప్స్ వేస్తారు, ఎందుకులే అని ఇష్టాలను చంపేసుకోవాల్సి వస్తుంది. కనీసం నా కూతురు అయినా ఈ సమాజంలో స్వేచ్ఛగా ఉండాలి’’ అని తెలిపింది హేమ.
Also Read: కరాటే కళ్యాణి పేకాట కేసులో పట్టుబడింది, ఆ ఇద్దరు నాపై అసభ్యకరమైన పోస్టులు చేశారు - హేమ