అన్వేషించండి

హీరో విశాల్‌కు తృటిలో తప్పిన ప్రమాదం - వీడియో వైరల్

హీరో విశాల్ కు తృటిలో ప్రమాదం తప్పింది. షూటింగ్ సమయంలో ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కానీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

కోలీవుడ్, టాలీవుడ్‌లో హీరో విశాల్‌కు మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే. అయితే విశాల్ తన సినిమాల కోసం తీవ్రంగా శ్రమిస్తుంటారు. అంతేకాదు రియల్ యాక్షన్ స్టంట్లు కూడా చేస్తుంటారు. దీని వల్ల ఆయనకు ప్రతీ సినిమా షూటింగ్ సమయంలో ఏదో ఒక గాయం అవుతూనే ఉంటుంది. తాజాగా ‘మార్క్ ఆంటోని’ సినిమా సెట్‌లో ప్రమాదం జరిగింది. ఓ వాహనం అదుపు తప్పి చిత్రయూనిట్ మీదకు వచ్చింది. అదే సమయంలో విశాల్క కూడా అక్కడే ఉన్నాడు. కానీ ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. విశాల్ చేసే ప్రతీ సినిమాకు ఇలాంటి ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇలా మార్క్ ఆంటోని సినిమా సెట్‌లో జరిగిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై చిత్రయూనిట్ ఇంకా స్పందించలేదు. అధికారికంగా చిత్రయూనిట్ చేసే ప్రకటన తరువాతే అసలు విషయాలు బయటకు వస్తాయి.

ఇక తమిళ యాక్షన్ హీరో విశాల్ రీసెంట్ గా ‘లాఠీ’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత ఏడాది క్రిస్మస్ కానుకగా వచ్చిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేక పోయింది. దీంతో ఇప్పుడు మరో యాక్షన్ మూవీని సిద్ధం చేస్తున్నాడు విశాల్. త్వరలో ‘మార్క్ ఆంటోనీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో విశాల్ గుబురు గడ్డంతో సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చినట్టుగా తెలుస్తోంది.

ఈ మూవీలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ షూటింగ్ లో అనుకోని ప్రమాదం జరగడంతో అంతా షాకయ్యారు. ఈ వీడియోలో భారీ వాహనం  గోడని ఢీకొట్టుకొని మరీ లోపలికి వస్తుంది.. అయితే ఢీ కొట్టిన తరువాత వెహికల్ అదుపుతప్పి.. ఎదురుగా ఉన్న ఆర్టిస్ట్ ల మీదకు దూసుకు వచ్చింది. సీన్‌లో భాగంగా విశాల్ కిందపడిపోయినట్లు నటిస్తున్నాడు. అయితే, ట్రక్కు దూసుకొస్తున్న సమయానికి వెంటనే పైకి లేవలేకపోయాడు. లక్కీగా ఆ వాహనం పక్క నుంచి వెళ్లిపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vishal (@actorvishalofficial)

ఈ మూవీలో టాలీవుడ్ యాక్టర్స్ ఇద్దరు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పుష్ప సినిమాలో విలన్ అవతారామెత్తిన సునీల్.. ఈ చిత్రంలోనూ విలన్ తరహా పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అలాగే నటి రీతూ వర్మ విశాల సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ జె సూర్య, అభినయ, ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తే... జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP DesamPithapuram MLA Candidate Tamanna Simhadri | పవన్ పై పోటీకి ట్రాన్స్ జెండర్ తమన్నాను దింపింది ఎవరు.?Thatikonda Rajaiah vs Kadiyam Sri hari | కడియం కావ్య డమ్మీ అభ్యర్థి... నా యుద్ధం శ్రీహరిపైనే | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Embed widget