Suman Comments On Kamal Haasan: శృతిహాసన్‌తో కూడా కమల్ రొమాంటిక్ సీన్స్ చేయగలరు - హీరో సుమన్ షాకింగ్ కామెంట్స్
Hero Suman: అలనాటి నటుడు సుమన్.. కమల్ హాసన్ పై ప్రశంసల కురిపిస్తూ నోరు జారారు. ఆయనకు యాక్టింగ్ దేవుడు ఇచ్చిన వరం అని అన్నారు. ఆయన స్టైల్ గురించి చెబుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Actor About Kamal Haasan: కమల్ హాసన్ యాక్టింగ్ పై అలనాటి నటుడు, హీరో సుమన్ ప్రశంసల వర్షం కురిపించారు. కమల్ హాసన్ కి యాక్టింగ్ దేవుడు ఇచ్చిన వరం అని అన్నారు సుమన్. కమల్ హాసన్ ప్రయోగాలు చేసేవారని, గ్లామరస్ రోల్ కోసం డీ గ్లామర్ అయ్యే ఏకైక హీరో కమల్ హాసన్ అని, ఇప్పటి తరానికి ఆయనే స్ఫూర్తి అని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే?
అభిమానుల కోసం..
కమల్ హాసన్ తన అభిమానుల కోసం ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తారని అన్నారు కమల్ హాసన్. తన ఫ్యాన్స్ కి ఏం కావాలో కమల్ హాసన్ అది ఇస్తారని, అలాంటి క్యారెక్టర్లు చేస్తారని చెప్పారు. ఇక శంకర్ గారి సినిమాల్లో కచ్చితంగా ఏదో ఒక మెసేజ్ ఉంటుందని, ఆయన ఏమి చేసినా మోడ్రన్ వరల్డ్ ని రిలేట్ చేసి తీస్తారని అన్నారు. తను నటించిన శివాజీ సినిమాలో మెడికల్ కాలేజీల్లో జరిగే అవినీతి గురించి చూపించారని చెప్పారు.
మాకు హీరో అంటే ఏంజేఆర్..
"తమిళ్ ఇండస్ట్రీలో తను అనుభవాలను పంచుకున్నారు సుమన్. తమిళ్ సినిమా ఇండస్ట్రీకి 1977లో వచ్చాను. అప్పుడు ఏంజేఆర్ గారు, శివాజీ గణేశన్ వీళ్లే మెయిన్. శివకుమార్ వాళ్లు కూడా ఉండేవారు కానీ వాళ్లు మూడో స్థానంలో అలా ఉండేవాళ్లు. ఏంజేఆర్ గారు యాక్షన్ హీరో, రెబల్ సాంగ్స్ అవీ చేసేవారు. శివాజీ గణేశన్ గారు మంచి యాక్టర్. ఆ తర్వాత తమిళ్ లో 1978, 1979లో రజనీకాంత్ రావడం, కమల్ హాసన్ రావడంతో ట్రెండ్ ఛేంజ్ అయ్యింది. మేమంతా కాలేజీకి వచ్చేసరికి కమల్ హాసన్, రజనీకాంత్ గారి ఫ్యాన్స్. రజనీకాంత్ ఏంటంటే స్టైల్ మాత్రమే. కమల్ హాసన్ గారు స్టైల్, డ్రస్సింగ్ అంతా బాగుండేది. రొమాంటిక్ హీరో కమల్ హాసన్. అప్పుడు అందరూ ఆయన డ్రస్సులే వేసుకునేవాళ్లు. ఏదో రొమాంటిక్ డైలాగులు రాస్తే చెప్పడం కాదు.. కళ్లతో దాన్ని వ్యక్తపరిచేవారు. కమల్ హాసన్ తో రెండు సినిమాలు చేశాను".
క్యారెక్టర్ కోసం కష్టపడతారు..
"కమల్ హాసన్ ఒక క్యారెక్టర్ కోసం చాలా కష్టపడతారు. భారతీయుడులో ఆయనకు ముసలివాడిలా మేకప్ చేయడానికి 4 గంటలు పట్టేది. బ్రేక్ లేకుండా యాక్ట్ చేయాలి ఆయన. చాలా కష్టం. సినిమా కోసం గుండు చేయించుకుంది ఫస్ట్ ఆయనే. గడ్డం ఎక్కువగా పెంచుకుంది ఆయనే. సినిమా కోసం జుట్టు కత్తిరించుకోవడం, లాంటివి చేసి గ్లామర్ కోసం డీ గ్లామర్ అవుతాడు. అలా అని ఊరుకోరు ప్రతి సినిమాలో మళ్లీ ఆయన గ్లామర్ గా కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది. అప్పట్లో ఇలా చేసే ధైర్యం ఏ యాక్టర్ కి, హీరోకి లేదు. తమిళ్ లో హీరోలు ధైర్యం చేస్తారు. అజిత్ తెల్లజుట్టుతో నటిస్తున్నాడు. మనవాళ్లను ఎవరినైనా అడగండి ధైర్యం చేయరు. ఎవ్వరూ ఒప్పుకోరు. విక్రమ్ అపరిచితుడులో హెయిర్, ఆయన మేకప్ వీళ్లందరికీ కమల్ హాసన్ స్ఫూర్తి. అక్కడ నుంచే వచ్చింది. కమల్ హాసన్ దశావతారాల్లో ఎంతబాగా చేశాడు. పది క్యారెక్టర్లు అంటే మాటలా? దాంట్లో ఏడు అడుగుల వ్యక్తిలా నటించాడు. అది ఎవరికి సాధ్యం చెప్పండి. అందుకే, నేను ఆయన్ని గ్రేటెస్ట్ ఎవర్ యంగ్ హీరో అని అంటాను. శృతి హాసన్ ని పెట్టి రొమాంటిక్ సీన్ చేయమంటే ఆయన చేస్తాడు. చేయగలుగుతాడు. యాక్టింగ్ ఆయనకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్.." అని సుమన్ అన్నారు.