అన్వేషించండి

Prasanna Vadanam Teaser: వింత వ్యాధితో బాధపడుతున్న సుహాస్, ముఖాలు గుర్తుపట్టలేడట - ఇంట్రెస్టింగ్‌గా ‘ప్రసన్నవదనం’ టీజ‌ర్

‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సుహాస్, మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌ మూవీతో ప్రేక్షకలు ముందుకు రాబోతున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Prasanna Vadanam Teaser Out: తెలుగు సినిమా పరిశ్రమలో నటుడు సుహాజ్ వరుస సినిమాలో సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన సుహాస్, ఇప్పుడు హీరోగా ఫుల్ బిజీ అయ్యాడు. ‘కలర్ ఫొటో’, ‘రైటర్ పద్మభూషణ్’, ‘హిట్ 2’, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సరికొత్త కథలతో వరుస హిట్స్ అందుకుంటున్నాడు. రీసెంట్ గా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’ మూవీతో చక్కటి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ‘ప్రసన్న వదనం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

సరికొత్త కాన్సెప్ట్ తో ఆకట్టుకుంటున్న టీజర్

అర్జున్ వైకే ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ‘ప్రసన్న వదనం’ సినిమాలో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లిటిల్ థాట్స్ సినిమాస్, అర్హ మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి.  మణికంఠ, ప్రసాద్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినియాకు సంబంధించి విడుదలైన ఫ‌స్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ రిలీజ్ చేశారు. సుహాస్ తలకు కట్టుతో ఆస్పత్రిలో ఉన్న సీన్ తో టీజర్ ప్రారంభమైంది. డాక్టర్ సుహాస్ తల్లిదండ్రుల ఫోటోను చూపించి వీళ్లు ఎవరు? అని అడుగుతాడు. వారిని హీరో గుర్తుపట్టలేకపోతాడు. సుహాన్ ‘ఫేస్ బ్లైండ్ నెస్’ అనే సరికొత్త సమస్యతో హీరో బాధపడుతున్నట్లు డాక్టర్ చెప్తాడు. ఈ వ్యాధి వ‌చ్చిన వారు ఒక వ్యక్తికి సంబంధించి ముఖం తప్ప అన్ని గుర్తుప‌డ‌తారు. అసలు ఈ సమస్య సుహాస్ కు ఎలా వచ్చింది? దాని నుంచి అతడు ఎలా బయటపడతాడు? అనేది విషయాన్ని ఆసక్తికరంగా చూపించబోతున్నారు. టీజర్ మధ్యలో సినిమాలోని అన్ని పాత్రలను పరిచయం చేశారు. ప్రతీ సీన్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అయితే, సినిమా కథ ఎక్కడా రివీల్ కాకుండా మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ‘ప్రసన్న వదనం’ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థం అవుతుంది. టీజర్ లో సుహాస్ వ్యాధి, మిగతా పాత్రల చుట్టూ ఉన్న సస్పెన్స్ ఆసక్తి కలిగిస్తోంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్‌గా సాగిన ఈ టీజ‌ర్ ప్ర‌స్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.   

ఓటీటీలో దుమ్మురేపుతున్న ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’

ఇక ఇటీవల విడుదలైన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ థియేటర్లలో సక్సెస్ అందుకోవడంతో పాటు, ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. మార్చి 1 నుంచి ‘ఆహా’లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తొలి ఐదు రోజుల్లోనే 10 కోట్ల నిమిషాల వ్యూస్ ను అందుకుంది.  దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శివాని నాగరం హీరోయిన్ గా నటించింది. శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న, 'పుష్ప' ఫేమ్ జగదీశ్ ప్రతాప్ బండారి ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది.   

Read Also: కమల్ ‘గుణ’ పాటకు భలే క్రేజ్ - ‘తమిళనాట ‘మంజుమ్మెల్ బాయ్స్’ సంచలనం, ఇంతకీ ఆ సాంగ్‌కు.. సినిమాకు లింకేమిటీ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Government : ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
Heart Attack : యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Government : ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
Heart Attack : యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Embed widget