Naga Shourya : అమ్మాయిని కొడతావా? నడిరోడ్డు మీద నిలదీసిన రియల్ హీరో నాగశౌర్య
యువ కథానాయకుడు నాగశౌర్య, నిజ జీవితంలో కూడా తాను హీరో అని చేతల ద్వారా చెప్పారు. అమ్మాయిపై చెయ్యి చేసుకున్న యువకుడిని నడిరోడ్డు మీద నిలదీశారు. ఆ తర్వాత ఏమైందంటే?
అమ్మాయిల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే... సినిమాల్లో హీరో వచ్చి ఆకతాయి తాట తీస్తారు. మరి, నిజ జీవితంలో హీరోలు అలా ఉంటారా? అంటే తప్పకుండా ఉంటారని ప్రూవ్ చేసిన రియల్ హీరో నాగశౌర్య.
నడిరోడ్డు మీద నిలదీసి...
అబ్బాయితో సారీ చెప్పించి...
ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. అందులో ఏం ఉందంటే... రోడ్డు మీద కారులో వెళుతున్న సమయంలో ఓ అమ్మాయిపై అబ్బాయి చేయి చేసుకోవడం చూశారు నాగశౌర్య. వెంటనే కారు దిగడంతో పాటు 'ఎందుకు చెయ్యి చేసుకున్నావ్?' అని నిలదీశారు. అబ్బాయితో పాటు అమ్మాయి కూడా అక్కడి నుంచి వెళ్లబోతుంటే, 'ముందు సారీ చెప్పు' అంటూ ఆమెకు సారీ చెప్పించారు. మహిళల పట్ల నాగశౌర్య చూపించిన గౌరవ మర్యాదల పట్ల నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : అంత అందాన్ని చూడకుండా ఎవరైనా ఉండగలరా?
మార్చి 17న ఫలానా అబ్బాయిగా...
మార్చి 17న నాగశౌర్య థియేటర్లలోకి రానున్నారు. 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' సినిమాల తర్వాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన సినిమా 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. ఇందులో మాళవికా నాయర్ హీరోయిన్. ఈ సినిమా మార్చి 17న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.
Also Read : మంగళవారమే 'మంగళవారం' అనౌన్స్‌మెంట్ - 'ఆర్ఎక్స్ 100' దర్శకుడి సౌత్ ఇండియన్ సినిమా
ఫలానా అబ్బాయి తర్వాత...
'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' తర్వాత నూతన దర్శకుడు ఎస్ఎస్ అరుణాచలంతో వైష్ణవి ఫిలింస్ నిర్మాణంలో నాగశౌర్య ఓ సినిమా చేయనున్నారు. ఆ మధ్య పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. ఆ చిత్రానికి శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి నిర్మాతలు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో నాగశౌర్య పాత్ర విభిన్నంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ చాలా విరామం తర్వాత ఈ సినిమాతో తెలుగులో రీ ఎత్న్రి ఇస్తున్నారు. వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా... చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
గత ఏడాది ఏడడుగులు వేసిన నాగశౌర్య
గత ఏడాది నవంబర్ 20న నాగశౌర్య ఓ ఇంటి వాడు అయ్యారు. కర్ణాటకకు చెందిన అనూషా శెట్టితో ఆయన ఏడు అడుగులు వేశారు. ఎన్టీఆర్ తల్లి శాలిని ఊరు, అనూషా శెట్టి ఊరు ఒక్కటే... మంగుళూరు దగ్గరలోని కుందాపూర్. ఇద్దరి మధ్య బంధుత్వం కూడా ఉందట. విశేషం ఏమిటంటే... పెళ్లి నేపథ్యంలో రూపొందిన 'కృష్ణ వ్రింద విహారి' సినిమాలో నటించిన నాగశౌర్య, ఆ సినిమా విడుదలైన కొన్ని రోజులకు పెళ్లి చేసుకున్నారు. అందులో కట్టుబాట్లు పద్ధతి పడికట్లకు విలువ ఇచ్చే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన యువకుడిగా శౌర్య కనిపించారు. మోడ్రన్ అమ్మాయితో ప్రేమలో పడిన అతడు... పెళ్లి తర్వాత తల్లికి, భార్యకు మధ్య నలిగిపోయే పాత్రలో నటించారు. పెళ్లి నేపథ్యంలో సినిమా చేసిన వెంటనే ఆయన ఏడు అడుగులు వేయడానికి రెడీ అవుతుండటం విశేషం.