బ్లేడుతో చేయి కోసుకున్నాడు - బ్రహ్మాజీ సీక్రెట్ భయటపెట్టిన ఆయన భార్య
వెన్నెల కిశోర్ హోస్ట్ చేస్తున్న 'అలా మొదలైంది' టాక్ షోలో బ్రహ్మాజీ తన సతీమణితో కలిసి హాజరయ్యాడు. తమ ప్రేమ, పెళ్ళి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది
టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ హోస్ట్ అవతారమెత్తిన సంగతి తెలిసిందే. 'అలా మొదలైంది' అనే సెలబ్రిటీ టాక్ షోకి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో సెలబ్రిటీ కపుల్స్ గెస్ట్ లుగా పాల్గొంటున్నారు. భార్యాభర్తల మధ్య పరిచయం, ప్రేమ, పెళ్లి వంటి విషయాలు ఎలా మొదలయ్యాయి అని చెప్పడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వాళ్ల భార్యలతో కలిసి ఈ షోలో బోలెడు కబుర్లు చెప్పారు. తాజాగా సీనియర్ నటుడు బ్రహ్మాజీ తన భార్య సాష్వతితో కలిసి ఈ షోకి వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా వదిలారు.
మామూలుగానే తన కామెడీ టైమింగ్ తో, సెన్సాఫ్ హ్యూమర్ తో అందరినీ నవ్వించే బ్రహ్మాజీ.. ఎంట్రీతోనే నవ్వులు పూజించారు. వచ్చీ రాగానే సరదాగా వెన్నెల కిషోర్ కాళ్ళ మీద పడి నమస్కరించారు. "సాష్వతి నామధేయం.. కుడికాలు ముందు పెట్టమ్మా" అని తన భార్యతో బ్రహ్మాజీ అన్నారు. "అదేంటి తండ్రి పేరు తల్లి పేరు.." అని కిశోర్ అడగబోతుండగా "అక్కర్లేదు.. మళ్లీ వాళ్లెందుకు" అని బ్రహ్మాజీ కామెడీ చేశాడు.
స్వతహాగా బెంగాలీ అయిన బ్రహ్మాజీ భార్య మాత్రం తనకు వచ్చీ రాని తెలుగులో "సత్యనారాయణన్ అండ్ మహాలక్ష్మి కొడకా.." అని చెప్పడంతో ఇద్దరూ తెగ నవ్వుకున్నారు. "ఇటు పక్క మూన్ లైట్ అటు పక్క సన్ రైజ్.. హై స్పీడ్ వాక్ లో అలా వెళ్లిజ్ ఐ లవ్ యూ చెప్పాను.. తన బర్త్ డేకి చైన్ తాకట్టు పెట్టాను.." అంటూ బ్రహ్మాజీ తన లవ్ స్టోరీ గురించి చెప్పాడు. పెళ్లికి డైరక్టర్ కృష్ణవంశీ కన్యాదానం చేసినట్లు బ్రహ్మాజి భార్య తెలిపింది.
ఇంతలో బ్రహ్మాజీ భార్య అతని చేతిని చూపిస్తూ "మీకు ఒక సీక్రెట్ చెప్తాను.. ఒక బ్లేడ్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాడు.. నేనే హాస్పిటల్ కు తీసుకువెళ్లాను" అని చెప్పింది. దీనికి షాక్ అయిన కిశోర్ "ఇంత వైలెంట్ ఏంటి అన్నా నువ్వూ..'' అంటూ నవ్వేశాడు. మీరిద్దరూ సోఫాలో ఓకే స్టైల్ లో కూర్చున్నారని కిషోర్ అనగా.. యాక్చ్యువల్ స్టైల్ ఇదంటూ బ్రహ్మాజీ కింద కూర్చొని నవ్వించాడు.
"అన్నా, మీ భార్య తిట్టే ఒక తిట్టు చెప్పొచ్చు కదా.. ఆవిడ తిడుతున్నప్పుడు మీరు వింటారా?" అని కిశోర్ అడిగితే "ఫైర్ స్టార్ట్ అవగానే పావు గంటలో కారు తీసుకొని బయటకు వెళ్లిపోతాను" అని బ్రహ్మాజీ చెప్పడం.. మీలో ఈరోజు ఒక సద్గురుని చూస్తున్నా అని కిషోర్ అనడం నవ్వు తెప్పిస్తుంది. అలానే కుక్క పిల్లకు బిస్కెట్ వేసి రా అన్నట్లు, అలా తన భార్యను ఫాలో అయిపోతాను అని బ్రహ్మాజి అంటాడు.
ఇలా 'అలా మొదలైంది' లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో సరదాగా సాగిపోయింది. బ్రహ్మాజీ దంపతులతో వెన్నెల కిషోర్ జరిపిన ఫన్నీ టాక్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకూ ఆగాల్సిందే.
కాగా, 'అలా మొదలైంది' షోకి శరత్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ ప్రొడ్యూసింగ్ చేస్తుండగా.. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యహరిస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి జీవిత రాజశేఖర్ దంపతులు, మంచు మనోజ్ - మౌనిక రెడ్డిలు గెస్టులుగా పాల్గొనగా.. నిఖిల్, ఆది సాయి కుమార్ లు తమ భార్యలతో వచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు బ్రహ్మాజీ తన భార్యతో కలిసి సందడి చేసాడు. మరి వెన్నెల కిషోర్ రాబోయే రోజుల్లో ఈ షోకి ఏయే సెలబ్రిటీ కపుల్స్ ని తీసుకొస్తాడో చూడాలి.