అన్వేషించండి

Anushka Shetty: పూరిని చీట్ చేశా, నాగార్జునకు యోగా నేర్పించా - అనుష్క శెట్టి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టికి సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అనుష్క హీరోయిన్ గా తనకు ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చిందో చెప్పింది.

సినిమా ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ జేజమ్మగా పేరు తెచ్చుకున్న అనుష్క శెట్టి ముందు వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కెరియర్లో అందరూ స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పునాది వేసింది. అలా స్టార్ హీరోలతో నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ చాలా కాలం పాటు వెలుగు వెలిగింది. రీసెంట్ గా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకుంది.

తాజాగా అనుష్క తన పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అనుష్కకు సంబంధించిన పాత ఇంటర్వ్యూ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో అనుష్క తనకు హీరోయిన్ గా ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది? పూరి జగన్నాథ్, నాగార్జున తనను ఎలా సపోర్ట్ చేశారు? అనే అంశాల గురించి మాట్లాడింది. హీరోయిన్ అవ్వకముందు అనుష్క యోగా టీచర్ గా పని చేసిన విషయం తెలిసిందే కదా. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ.. యోగ టీచర్ గా ఆరు సంవత్సరాలు పనిచేశానని, యోగ మీద ఉన్న ప్యాషన్ తోనే పనిచేశాను తప్ప డబ్బు కోసం కాదని, నా జీవితంలో నేను ఎప్పుడూ డబ్బుకి ప్రయారిటీ ఇవ్వలేదని పేర్కొంది.

మీకు హీరోయిన్‌గా ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది? అని అడగగా.. "పూరి జగన్నాథ్ వల్ల వచ్చింది. ఇండస్ట్రీ పర్సన్ అయిన నివాస్ వైఫ్, నేను మంచి యోగా ఫ్రెండ్స్. నివాస్ తో పాటు శ్రీను అని ఉండేవారు. ఆయన పూరి జగన్నాథ్ ని కలవమని చెప్పారు. ఒక సినిమా కోసం హీరోయిన్ ని వెతుకుతున్నారు అని చెప్పి ఫోన్ చేయమని నాతో అన్నారు. కానీ నాకు చాలా సిగ్గు. శీను నాకు కాల్ చేయమని అన్నారు. కానీ నేను ఆ విషయంలో పూరి జగన్నాథ్ ని చీటింగ్ చేశాను. ఎందుకంటే నేను కాల్ చేయలేదు. ఆ సమయంలో శ్రీను కాల్ చేసావా? అని అడిగితే చేశాను అని చెప్పాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళందరూ నేను తప్పించుకుంటున్నానని అర్థం చేసుకొని వాళ్లే.. నన్ను పూరి జగన్నాథ్ తో కాల్ చేయించారు" అని చెప్పింది.

"నిజం చెప్పాలంటే నేను సినిమాలు పెద్దగా చూడను. టీవీ కానీ, మూవీస్ కానీ అలవాటు లేవు. అప్పుడు పూరి జగన్నాథ్ ని కలిశాను. సో ఒక మూవీ ఉందని చెప్పారు. అప్పుడు ఫోటో ఉందా? అని అడిగారు. దాంతో ఉందని, నా పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసి ఇచ్చాను. అప్పుడు పూరి ఆ ఫోటో చూసి ఆ తర్వాత నా ఫేస్ చూసి నవ్వారు. ఆ తర్వాత సరే నేను కాల్ చేస్తాను అని చెప్పి వెళ్లిపోయారు. నెక్స్ట్ డే కాల్ చేసి నువ్వు హైదరాబాద్ రావాలి అని అన్నారు. ఆ టైంలో నాకు యోగ క్లాసెస్ ఉన్నాయి. నేను రాను వీలు చూసుకుని వస్తానని చెప్పాను" అని తెలిపింది.

అప్పుడు మా ఫ్రెండ్ ఒక ఒకరు నువ్వు డైరెక్టర్ ని కలిశావు కదా, ఏమైంది? అని అడిగితే కలిశాను రమ్మన్నారు. కానీ నాకు కుదరలేదు. చూసుకొని కలుస్తానని చెప్పాను అని తెలిపింది. నువ్వు అలా ఎందుకు చెప్పావు? వాళ్ళు దాన్ని ఆటిట్యూడ్ అనుకుంటారు అని చెప్పింది. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. ఆ టైంలో నాగార్జున మాస్ షూటింగ్లో ఉన్నారు. తర్వాత లుక్ టెస్ట్ చేశారు. ఆ టైంలో నాతో పాటు ఇంకో హీరోయిన్ కూడా వచ్చింది టెస్ట్ అయ్యాక ఫోటో షూట్ కూడా చేశారు. ఇవన్నీ చూసి మన వల్ల కాదని వెళ్లిపోవాలని అనుకున్నాను. కానీ ఆ తర్వాత నాగార్జున నన్ను చూసి ఈ అమ్మాయిలో ఏదో ఉంది అని నన్ను సెలెక్ట్ చేశారు" అని  పేర్కొంది.

‘‘అందుకే నాగార్జున నాకు చాలా స్పెషల్. ఆరోజు నన్ను సెలెక్ట్ చేసి ఉండకపోయుంటే ఈ రోజు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. నాగార్జున మాత్రమే కాదు పూరి జగన్నాథ్ అలాగే సుప్రియ నాకు గాడ్ ఫాదర్స్ లాంటివాళ్ళు" అని చెప్పుకొచ్చింది. నాగార్జునకి మీరు యోగ నేర్పించారా? అని అడిగితే, "యోగా నేర్పించలేదు. కానీ ఆయన యోగా చేస్తున్న సమయంలో కొన్నిసార్లు హెల్ప్ చేశాను" అని చెప్పింది.

Also Read : 'సలార్' ఆగమనం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ప్రభాస్ - ఖుషీ అవుతున్న ఫ్యాన్స్!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Rapido Data Leak: యూజర్లు, డ్రైవర్ల డేటా లీక్ - ర్యాపిడో ఏం చేసింది?
యూజర్లు, డ్రైవర్ల డేటా లీక్ - ర్యాపిడో ఏం చేసింది?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Embed widget