Laal Singh Chaddha In Telugu: మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో ఆమిర్ ఖాన్ సినిమా

మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆమిర్ సినిమాలో చిరు భాగం అయ్యారు మెగాస్టార్.

FOLLOW US: 

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన సినిమా 'లాల్ సింగ్ చద్దా' (తెలుగులో చడ్డా అని రాశారు). ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. దర్శక ధీరుడు రాజమౌళి, కింగ్ నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, సినిమాలో కీలక పాత్రలో నటించిన అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య సినిమా చూశారు. అసలు విషయం ఏంటంటే...
 
మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో 'లాల్ సింగ్ చద్దా' తెలుగు వెర్షన్ విడుదల అవుతోంది. ఈ విషయాన్ని చిరు స్వయంగా వెల్లడించారు. ''కొన్నేళ్ల క్రితం జపాన్ లో నా ఫ్రెండ్ ఆమిర్ ఖాన్ ను కలిశా. అప్పుడు కాసేపు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత అతని డ్రీమ్ ప్రాజెక్టు 'లాల్ సింగ్ చద్దా'లో నేనూ భాగం అయ్యాను'' అని మెగాస్టార్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. తన ఇంట్లో ఎక్స్‌క్లూజివ్‌ ప్రీమియర్ షో  వేసినందుకు థాంక్స్ చెప్పారు. ప్రివ్యూ విజువల్స్ విడుదల చేశారు. 

Also Read : మళ్ళీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు

'లాల్ సింగ్ చద్దా' ఒక ఎమోషనల్ జర్నీ అని చిరంజీవి పేర్కొన్నారు. ఈ సినిమా ఒక ఆణిముత్యం అని ఆయన అన్నారు. ఆగస్టు 11న ఈ 'లాల్ సింగ్ చద్దా' ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. వయాకామ్ 18 స్టూడియోస్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. 

Also Read : మల్లెపూలు నలిపేస్తూ ఉంటా - 'సుడిగాలి' సుధీర్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)

Published at : 16 Jul 2022 10:49 AM (IST) Tags: Megastar Chiranjeevi Aamir Khan Laal Singh Chaddha Telugu Movie Chiranjeevi Presents Laal Singh Chaddha

సంబంధిత కథనాలు

Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!

Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!

NTR30: ఎన్టీఆర్ సినిమాలో కృతిశెట్టి - క్లారిటీ వచ్చేసింది!

NTR30: ఎన్టీఆర్ సినిమాలో కృతిశెట్టి - క్లారిటీ వచ్చేసింది!

Bimbisara: 'బింబిసార' సినిమాను రిజెక్ట్ చేసిన రవితేజ?

Bimbisara: 'బింబిసార' సినిమాను రిజెక్ట్ చేసిన రవితేజ?

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

NTR: భుజం నొప్పితో బాధపడుతోన్న ఎన్టీఆర్ - రెండు నెలల పాటు రెస్ట్!

NTR: భుజం నొప్పితో బాధపడుతోన్న ఎన్టీఆర్ - రెండు నెలల పాటు రెస్ట్!

టాప్ స్టోరీస్

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

Rabindranath Tagore: ఐన్‌స్టీన్‌, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?

Rabindranath Tagore: ఐన్‌స్టీన్‌, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?

PF Data Leak: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్తగా ఉండాలి - ఎందుకంటే మీ డేటా?

PF Data Leak: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్తగా ఉండాలి - ఎందుకంటే మీ డేటా?

Flag Hoisting: జాతీయ జెండాను RSS ఎందుకు ఎగరేయటం లేదు? కాషాయ రంగుని మాత్రమే గుర్తిస్తోందా?

Flag Hoisting: జాతీయ జెండాను RSS ఎందుకు ఎగరేయటం లేదు? కాషాయ రంగుని మాత్రమే గుర్తిస్తోందా?