Aafat Song: ‘బాబోయ్, మామూలు డ్రామాలు కాదు’ - లైగర్ నుంచి రొమాంటిక్ ‘ఆఫట్’!
లైగర్ సినిమాలోని ఆఫట్ సాంగ్ యూట్యూబ్‌లో రిలీజ్ అయింది.
యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీస్తున్న పాన్ ఇండియా సినిమా ‘లైగర్’. ఆగస్టు 25వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా నుంచి కొత్త రొమాంటిక్ వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘ఆఫట్’ అంటూ సాగే ఈ పాటను బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ తనిష్క్ బగ్చి స్వరాలు అందించారు.
‘బాబోయ్... మామూలు డ్రామాలు కాదు...’ అంటూ రమ్యకృష్ణ అమ్మాయిల గురించి చెప్పే డైలాగ్‌తో సాంగ్ ప్రారంభం అవుతుంది. విజయ్ దేవరకొండ, అనన్య పాండేల మధ్య కెమిస్ట్రీ ఈ పాటకు పెద్ద హైలెట్. ఈ సినిమాలో తల్లికి భయపడే కొడుకుగా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడని దీన్ని బట్టి చెప్పవచ్చు.
విజయ్ దేవరకొండ ఇంతకు ముందు ట్రై చేయని స్టైలిష్ స్టెప్స్‌ను ఈ పాటలో ట్రై చేశాడు. అనన్య పాండే కూడా అందాల ప్రదర్శనలో వెనక్కి తగ్గకపోవడంలో యూత్‌ను ఈ పాట బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇంతకు ముందు రిలీజ్ అయిన ‘అక్డీ పక్డీ’ పాట కూడా చాలా పెద్ద హిట్ అయింది.
ఈ సినిమాను కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వ మెహతా, హిరూ యష్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటివరకు నాలుగు పాటలు విడుదల కాగా, ఒక్కో దానికి ఒక్కో సంగీత దర్శకుడు పనిచేశారు. మొదట విడుదలైన ‘ది లైగర్ హంట్ థీమ్’కు విక్రం మోంట్రోస్, ‘అక్డీ పక్డీ’కి లిజో జార్జ్, డీజే చేటాస్, సునీల్ కశ్యప్, ‘Watt Laga Denge’కు సునీల్ కశ్యప్, ‘ఆఫట్’కు తనిష్క్ బగ్చి సంగీతం అందించారు.
ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత పూరి జగన్నాథ్, యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్నా పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండకు స్టార్‌డం తీసుకొచ్చిన అర్జున్ రెడ్డి విడుదలైన రోజే లైగర్ కూడా రిలీజ్ కానుండటంతో ఇది కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఈ సినిమాలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌ను కీలక పాత్ర కోసం తీసుకోవడం విశేషం. ఈ సినిమా ట్రైలర్ కూడా ఇప్పటికే పెద్ద సక్సెస్ అయింది. యూట్యూబ్‌లో దీనికి మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి.