By: ABP Desam | Updated at : 09 Mar 2023 05:42 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Sree leela/Pooja Hegde/Samantha/Instagram
దక్షిణాదిలో హీరోయిన్లుగా నిలదొక్కుకోవడం అంటే అంత ఈజీ కాదు. అన్ని రకాల పాత్రలతో మెప్పించాలి, మురిపించాలి. హీరోలతో సమానంగా డ్యాన్సులు వేస్తూ.. వారి ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయించుకోవాలి. గ్లామర్ డాల్‌గానే కాదు.. అవసరమైతే ఐటెమ్ గార్ల్‌గా అయినా టచ్‌లో ఉండాలి. దీనికి తోడు లక్ కూడా కలిసి రావాలి. అదే లేకపోతే.. మనుగడ కష్టమే. ఈ నేపథ్యంలో తొమ్మిది మంది హీరోయిన్లకు అదృష్టం వెంటాడుతోంది. దీంతో అవకాశాల మీద అవకాశాలు క్యూ కడుతున్నాయి. మరి, ఆ లక్కీ బ్యూటీస్ ఎవరో చూసేయండి మరి.
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఫిల్మ్ మేకర్స్ ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది శ్రీలీల. ప్రస్తుతం ఆమె 5 సినిమాల్లో నటిస్తుండగా, అందులో 3 టాప్ హీరోల సినిమాలే ఉన్నాయి. చేసిన మూవీస్ తక్కువే అయినా, టాప్ క్రేజ్ దక్కించుకుంది. డ్యాన్స్, యాక్టింగ్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. మరో రెండు సినిమాలు సూపర్ హిట్ అందుకుంటే టాలీవుడ్ నెంబర్-1 హీరోయిన్ గా మారే అవకాశం ఉంది.
‘కార్తికేయ-2’ హిట్‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయింది అనుపమా. ఆ తర్వాత నిఖిల్‌తో వచ్చిన మరో మూవీ ‘18 పేజేస్’ కూడా హిట్ కొట్టడంతో అనుపమాకు అవకాశాలు క్యూకడుతున్నాయి. ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’ మూవీలో నటిస్తోంది. ఇవి కాకుండా ఒక తమిళం, మలయాళం మూవీలో కూడా నటిస్తోంది.
బాక్సాఫీస్ దగ్గర వరుస బ్లాక్ బస్టర్స్ తో పూజా హెగ్డే మంచి క్రేజ్ సంపాదించుకుంది. త్రివిక్రమ్ తదుపరి రెండు సినిమాల్లో తనే హీరోయిన్. అటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ కమర్షియల్ సినిమాలను ఏలుతోంది బుట్టబొమ్మ.
‘వారిసు’ సినిమాతో తమిళంలో బ్లాక్ బస్టర్ ఇచ్చి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ‘పుష్ప‘ సినిమాతో పాన్ ఇండియన్ హిట్ అందుకుంది. తెలుగు, తమిళం, హిందీలోనూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ‘పుష్ప2‘ షూటింగ్ లో బిజీగా ఉంది.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది సమంతా. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు చేస్తూ స్టార్ డమ్ కొనసాగిస్తోంది. సమంతా తాజాగా నటించిన పాన్ ఇండియన్ మూవీ ‘శాకుంతలం‘ త్వరలో విడుదల కానుంది.
ఈ మధ్య బ్లాక్ బస్టర్స్ లేవు. కానీ, ఆమెకున్న క్రేజ్ కంటిన్యూ అవుతోంది. డిఫరెంట్ జానర్స్ లో పలు సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది.
‘96’ మూవీ తర్వాత మల్లీ వెలుగులోకి వచ్చింది. వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్స్ సాధిస్తోంది. తాజాగా ‘పొన్నియిన్ సెల్వన్‘లో నటించి మెప్పించింది.
‘మహానటి’తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్, అటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఇటు కమర్షియల్ సినిమాలు చేస్తోంది. పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ తో పాటు గ్లామర్ రోల్స్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తోంది.
సంక్రాంతికి తెలుగులో రెండు బ్లాక్ బస్టర్లు అందుకున్నది శృతి హాసన్. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘వాల్తేరు వీరయ్య‘, బాలయ్యతో కలిసి ‘వీరసింహారెడ్డి‘ సినిమాలు చేసి అదిరిపోయే హిట్లు అందుకుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్- ప్రభాస్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘సలార్’ మూవీలో నటిస్తోంది. ఈ మధ్యే తన షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
Read Also: మా బాబుకు చూపించే తొలి సినిమా అదే, కొడుకు విషయంలో కాజల్ కండీషన్లు మామూలుగా లేవుగా!
DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య
Suriya Jyotika: ముంబైకి మకాం మార్చిన సూర్య, జ్యోతిక - తొలిసారి తల్లిదండ్రులను వదిలి..
18 ఏళ్లుగా అదేపని, చోరీ డబ్బుతో ఏకంగా ఇల్లే కట్టేశారు - సూపర్ స్టార్ కూతురికే షాకిచ్చిన పనివారు
Nithiin Rashmika New Movie : నితిన్ ఫ్లాపులు, రష్మిక కాంట్రవర్సీలు - కొత్త సినిమా కబురులో ఫుల్ సెటైర్లు
Dasara: అదరగొట్టే మాస్ స్టెప్స్‌తో ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ - ‘దసరా’ ఫస్ట్ వీడియో సాంగ్ వచ్చేసింది!
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్
IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!
TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!
Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?